SSMB29: రాజమౌళి - మహేశ్ బాబు 'SSMB 29'లో బాలీవుడ్ నటుడు? - ఆ వార్తల్లో నిజమెంత?
SSMB29 Cast: దర్శక ధీరుడు రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' తాజాగా ఓ క్రేజీ న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడిని చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది.

Bollywood Actor Nana Patekar In Mahesh Babu And Rajamouli's SSMB29: దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli), సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కాంబోలో 'SSMB29' వర్కింగ్ టైటిల్‌తో మూవీ రూపొందుతోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. బాలీవుడ్ నటుడు నానా పాటేకర్‌ను ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర కోసం రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమై చిత్ర బృందం ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలోని ఓ ముఖ్య పాత్ర కోసం చిత్ర వర్గాలు పృథ్వీరాజ్ సుకుమార్‌తో చర్చలు ప్రారంభించాయి. దీనిపై ఆయన కూడా ఇటీవలే స్పష్టత ఇచ్చారు.
కాగా, ఈ సినిమాను జక్కన్న హాలీవుడ్ రేంజ్‌లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో మహేశ్ న్యూ లుక్‌లో కనిపించనున్నారు. కొన్నాళ్లుగా ఈ సినిమా కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు సూపర్ స్టార్. మూవీకి సంబంధించి పలు అప్ డేట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 'ఆర్ఆర్ఆర్' విజయం తర్వాత రాజమౌళి రూపొందిస్తోన్న బహు భాషా చిత్రమిది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్.నారాయణ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
Also Read: ఈ శివరాత్రికి శివ'తాండవ'మేనా! - బాలకృష్ణ 'అఖండ 2' ఫస్ట్ లుక్ అప్పుడేనా?
ప్రియాంక చోప్రా రోల్ అదేనా..
మరోవైపు, ఈ మూవీలో నటీనటులు సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా అన్న విషయాలు తప్ప ఎలాంటి సమాచారంపైనా పూర్తి స్పష్టత లేదు. సినిమాకు సంబంధించి ఎలాంటి లీకులు లేకుండా చిత్ర బృందం చర్యలు చేపడుతోంది. తాజాగా, ప్రియాంక చోప్రా రోల్‌పైనా రూమర్లు వినిపించాయి. ఈ అడ్వెంచర్ మూవీలో హీరోతో పాటు ప్రియాంక పాత్రకు సైతం అత్యంత ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తోంది. లేడీ విలన్‌గా నెగిటివ్ రోల్‌లో ఆమె కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఆమె రోల్‌ను దర్శక ధీరుడు రూపుదిద్దుతున్నారని సమాచారం. ఆమె పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్‌లో కనిపిస్తుందని ఇండస్ట్రీ గాసిప్. మహేష్ బాబు పాత్ర ప్రత్యేక ప్రయోజనం కోసం ఒక క్రేజీ ఆఫ్రికన్ అడ్వెంచర్‌ను ప్రారంభించే విధంగా ఈవెంట్లను నిర్వహించే సంపన్న బిలియనీర్‌గా ఆమె నటిస్తుందని పుకారు ఉంది. అయితే, ఇది గాసిప్ మాత్రమే అయినా సోషల్ మీడియాలో మాత్రం విస్తృతంగా ప్రచారం సాగుతోంది.
స్ట్రిక్ట్ రూల్స్..
కాగా, ఈ సినిమా గురించి ఎలాంటి లీక్స్ లేకుండా మూవీ టీం స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. దీనిపై ఇప్పటికే చిత్ర బృందానికి గట్టి హెచ్చరికలు పంపింది. దర్శక నిర్మాతల నుంచి అనుమతి లేకుండా ఎవరైనా సమాచారం లీక్ చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అటు, హీరోతో సహా సెట్‌లో ఉన్న వారెవరూ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని సమాచారం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

