అన్వేషించండి

Hi Nanna: ‘హాయ్ నాన్న’పై శ్రీలీల రివ్యూ - నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ మృణాల్ రెస్పాన్స్

‘హాయ్ నాన్న’ సినిమాకు సినీ సెలబ్రిటీలు సైతం ఫిదా అయిపోతుండగా.. శ్రీలీల కూడా ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. దానికి మృణాల్ రెస్పాండ్ కూడా అయ్యింది.

సినీ పరిశ్రమలో హీరోల మధ్య పోటీ ఎంత ఉంటుందో.. హీరోయిన్స్ మధ్య కూడా అంతే ఉంటుంది. ఒక్కొక్కసారి అంతకంటే ఎక్కువే ఉంటుంది. ఒక హీరోయిన్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యి.. హిట్ కొట్టిందంటే మేకర్స్ అంతా తన డేట్స్ కోసం క్యూ కడతారు. అలా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్‌కు సైతం ఎప్పటికప్పుడు పోటీ పెరిగిపోతూనే ఉంటుంది. కొందరు మాత్రమే ఆ పోటీని హెల్తీగా తీసుకుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్, శ్రీలీల మధ్య జరిగిన సంభాషణ చూస్తుంటే అదే అనిపిస్తోంది. ‘హాయ్ నాన్న’ చూసి ఇంప్రెస్ అయిన శ్రీలీల.. సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని షేర్ చేయగా.. మృణాల్ స్పందించింది.

శ్రీలీల వర్సెస్ మృణాల్..
ప్రస్తుతం శ్రీలీల, మృణాల్ ఠాకూర్.. ఇద్దరూ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్‌గా మారిపోయారు. మృణాల్.. తన పాత్రకు ప్రాధాన్యత ఉండే కథలను ఎంచుకుంటూ.. తన యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటూ ఉండగా.. శ్రీలీల తన డ్యాన్స్‌పై ఫోకస్ పెడుతూ ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే ఈ ఇద్దరి నటన ప్రేక్షకులను తెగ ఇంప్రెస్ చేసేసింది. దీంతో వీరిద్దరి మధ్య పోటీ మొదలయ్యింది. ఇక తాజాగా మృణాల్ ఠాకూర్, నాని జంటగా నటించిన ‘హాయ్ నాన్న’ చిత్రం ఆడియన్స్ అందరినీ మెప్పించి.. బాక్సాఫీస్ హిట్‌గా నిలవడంతో శ్రీలీల.. ఈ మూవీపై స్పందించింది.

కిడ్నాప్ చేయాలనిపించింది..
‘‘హాయ్ నాన్న చాలా అద్భుతంగా ఉంది. ఈ స్క్రిప్ట్‌తో ఎప్పటిలాగానే నాని మన మనసులను హత్తుకున్నారు. మృణాల్ ఠాకూర్ పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు.. లుక్స్, ప్రెజెన్స్.. అన్నీ మా మనసులోను దోచేసుకున్నాయి. కియారా ఖన్నా - నువ్వు చాలా చాలా క్యూట్‌గా ఉన్నావు. సినిమా చూస్తున్నవారంతా నిన్ను స్క్రీన్‌పై నుంచి కిడ్నాప్ చేసేస్తా బాగుంటుందని కోరుకున్నారు’’ అంటూ నాని, మృణాల్ ఠాకూర్, కియారా పర్ఫార్మెన్స్ గురించి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది శ్రీలీల. అంతే కాకుండా దర్శకుడు శౌర్యువ్‌కు కూడా హిట్ అందుకున్నందుకు కంగ్రాట్స్ తెలిపింది. శ్రీలీల ఇచ్చిన రివ్యూపై మృణాల్ ఠాకూర్ స్పందించింది.

గర్వంగా ఉంది..
‘‘చాలా థాంక్యూ స్వీట్‌హార్ట్. నీకు సినిమా నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంతే కాదు.. నేను నీ వల్ల ఇన్‌స్పైర్ కూడా అవుతున్నాను. నువ్వు పనిచేసుకుంటూ.. వర్క్ చేస్తున్నావు. అదంతా సులభం కాదు. చాలా గర్వంగా ఉంది’’ అని ఏ మాత్రం ఇగో లేకుండా శ్రీలీల గురించి తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది మృణాల్. ఒకేరోజు తేడాతో మృణాల్ నటించిన ‘హాయ్ నాన్న’, శ్రీలీల నటించిన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ విడుదల కాగా.. ‘హాయ్ నాన్న’ బ్లాక్‌బస్టర్ కొట్టగా.. ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ మాత్రం ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. అయినా కూడా ఇగో లేకుండా ఒకరి వర్క్‌ను ఒకరు ప్రశంసించుకుంటున్న ఈ హీరోయిన్స్‌ను చూసి ప్రేక్షకులు ముచ్చటపడుతున్నారు. పైగా శ్రీలీల కూడా మృణాల్ తరహాలోనే ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటే తన సినీ కెరీర్‌కు ప్లస్ అవుతుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Hi Nanna: ‘హాయ్ నాన్న’పై శ్రీలీల రివ్యూ - నిన్ను చూస్తే గర్వంగా ఉందంటూ మృణాల్ రెస్పాన్స్

Also Read: ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్ - పెళ్లి పేరుతో యువతిని మోసం చేశాడంటూ ఆరోపణలు!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget