Vijay Sethupathi Attacked: విజయ్ సేతుపతిపై దాడి.. ఎగిరి మరీ తన్నాడు..
కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతికి ఊహించని సంఘటన ఎదురైంది. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా.. విజయ్ సేతుపతిపై దాడి జరిగింది.
కోలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ సేతుపతి గురించి అందరికీ తెలిసిందే. తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ మధ్యకాలంలో ఆయనకు బాలీవుడ్ లో కూడా క్రేజ్ పెరిగింది. అలాంటి వ్యక్తికి ఎయిర్ పోర్ట్ లో ఊహించని షాక్ సంఘటన ఎదురైంది. బెంగుళూరు ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తుండగా.. విజయ్ సేతుపతిపై దాడి జరిగింది.
Also Read: 'దీపావళి పండగ ముందే వచ్చేసింది..' 'లాలాభీమ్లా' ప్రోమోలో పవన్ మాస్ అవతార్..
ఈ ఘటనతో విజయ్ సేతుపతితో పాటు.. ఆయనతో ఉన్న అనుచరులు కూడా ఒక్కసారిగా షాకయ్యారు. ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ దిగి ఎగ్జిట్ వైపు వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన ఓ వ్యక్తి విజయ్ సేతుపతిని ఎగిరి తన్నాడు. దీంతో ఒక్కసారిగా షాకైన హీరో వెనక్కి తిరిగి చూశాడు. చుట్టుపక్కన ఉన్నవాళ్లు.. సెక్యూరిటీ, పోలీసులు వెంటనే దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు అతడు విజయ్ సేతుపతిపై ఎందుకు దాడి చేశాడనే విషయం తెలియాల్సివుంది.
ఇక విజయ్ సేతుపతి సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది 'ఉప్పెన' సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన.. ప్రస్తుతం దాదాపు పది సినిమాల్లో నటిస్తున్నారు. అందులో 'ముంబైకర్' అనే బాలీవుడ్ సినిమా కూడా ఉంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేశారు. త్వరలోనే తన సినిమాలను ఒక్కొక్కటిగా విడుదల చేయబోతున్నారు విజయ్ సేతుపతి.
யார்டா நீ கோழை? பின்னாலிருந்து விஜய் சேதுபதியை உதைக்கறான்😡😡 pic.twitter.com/dLGdOn7sIV
— Thalaivar Darbarᴬᴺᴺᴬᴬᵀᵀᴴᴱ🇮🇳 (@Vijayar50360173) November 3, 2021
Also Read: 'మేజర్' మూవీ రిలీజ్ డేట్ చెప్పిన మహేశ్ బాబు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి