Puneeth Rajkumar: పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో వైరల్
గుండెనొప్పితో కన్నుమూసిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆఖరి క్షణాల వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి ఆయన అభిమానులు భావోద్వేగానికి గురవ్వుతున్నారు.
కన్నడ హీరో పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ అక్టోబరు 29న గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన మరణం అభిమానులకు ఇంకా కలగానే ఉంది. ముందు రోజు తన అన్న శివరాజ్ కుమార్ సినిమా వేడుకలో ఉత్సాహంగా పాల్గొన్న పునీత్.. అకస్మాత్తుగా కన్నుమూయడాన్ని అభిమానులే కాదు.. యావత్ సినీ రంగం జీర్ణించుకోలేకపోతోంది. ఎంతో ఫిట్‌గా ఉండే పునీత్‌కు గుండెపోటు రావడం ఏమిటని అంతా ఆశ్చర్యపోతున్నారు.
పునీత్ జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలినట్లు మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని ఆయన కుటుంబ సభ్యులే కాకుండా.. పునీత్ నటించిన ‘జేమ్స్’ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న మన టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూడా స్పష్టం చేశారు. తాజాగా పునీత్ ఇంటిలోని సీసీటీవీ ఫూటేజ్ ఒకటి బయటకు వచ్చింది. అందులో కాస్త ఆందోళనగా ఉన్న పునీత్.. తన భార్యతో కలిసి బయటకు వెళ్తున్నట్లు వీడియోలో కనిపించింది.
Also Read: పునీత్ కళ్లతో నలుగురికి చూపు.. చాలా రేర్ అంటున్న డాక్టర్స్..
జిమ్ చేస్తుండగా పునీత్‌కు అసౌకర్యంగా అనిపించింది. గుండెలో నొప్పిగా ఉండటంతో భార్య అశ్వినితో కలిసి తన ఫ్యామిలీ డాక్టర్ రమణారావు ఇంటికి బయల్దేరారు. పునీత్ స్వయంగా నడుచుకుంటూ వెళ్లి కారు ఎక్కడాన్ని ఆ వీడియోలో చూడవచ్చు. అప్పుడు కూడా ఆయన పెద్దగా అస్వస్థతకు లోనైట్లు కనిపించలేదు. బయటకు వచ్చిన తర్వాత భార్యతో ఏదో మాట్లాడుతూ కనిపించారు. ఆ తర్వాత ఇద్దరు కారులో బయల్దేరారు. డాక్టర్ రమణారావు ఈసీజీ తీసి ప్రమాదాన్ని గుర్తించారు. వెంటనే ఆయన్ని విక్రమ్ హాస్పిటల్ తీసుకెళ్లాలని సూచించారు. దీంతో పునీత్ హాస్పిటల్‌కు బయల్దేరారు. కారులో పునీత్.. భార్య ఒడిలోకి వాలిపోయారు. హాస్పిటల్‌కు చేరుకొనే లోపే కన్నుమూశారు.
వీడియో:
పునీత్ మరణించిన 48 గంటల వ్యవధిలోపే.. ఆయన కళ్లను నలుగురు అంధులకు చూపునిచ్చాయని నారాయణ నేత్రాలయ ప్రకటించింది. ఇది అరుదైన ఘటన అని వెల్లడించారు. పునీత్ నుంచి కళ్లను సేకరించిన తరువాత.. ఆయన కార్నియాలను నలుగురు అంధులకు అమర్చినట్లుగా డాక్టర్లు తెలిపారు. సాధారణంగా ఒక వ్యక్తి దానం చేసిన కళ్లతో ఇద్దరికి మాత్రమే చూపు దక్కుతుందని.. కానీ పునీత్ కళ్లలోని కార్నియాలోని సుపీరియర్, డీపర్ లేయర్స్‌ని వేరు చేసి నలుగురికి కంటిచూపుని తిరిగిచ్చారు డాక్టర్స్.
Also Read: మాస్ మహారాజా ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?
Also Read: ప్రజెంట్ 'గాడ్ ఫాదర్'... 15 నుంచి 'భోళా శంకర్'... మెగాస్టార్ స్పీడు మామూలుగా లేదుగా!
Also Read: సంక్రాంతి బరిలో రాజ'శేఖర్'... యాంగ్రీ స్టార్ తగ్గేదే లే!
Also Read: 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్‌లో ఇవి గమనించారా!?