Biggboss5: సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్... శ్రీరామచంద్రకు టార్చర్
మొదటిరోజు నుంచే హీట్ మీద నడుస్తున్న బిగ్ బాస్ 5 సీజన్లో బుధవారం టార్చర్ ఎసిపోడ్ సాగేట్టు కనిపిస్తోంది.
ఓ మనిషిని ఎలా టార్చర్ పెట్టాలో తెలుసుకోవాలంటే బిగ్ బాస్ సీజన్లోని కొన్ని ఎపిసోడ్లను చూస్తే అర్థమైపోతుంది. బుధవారం ఎపిసోడ్ కూడా టార్చర్ కు కేరాఫ్ అడ్రస్ లా రూపొందించింది బిగ్ బాస్ టీమ్. ఇంట్లోని సభ్యులను ఓ టాస్క్ ను ఇచ్చారు. ఆ టాస్క్ పేరు సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్. ఇందుకు ఇంట్లోని సభ్యులను రెండు భాగాలుగా విభజించారు. ఒక గ్రూపు సూపర్ విలన్స్, మరో గ్రూప్ సూపర్ హీరోస్ చెప్పారు. ఒకరిని ఒకరు టార్చర్ పెట్టుకునే గెలవడమే టాస్క్. బిగ్ బాస్ ఇంటి సభ్యులకు టార్చర్ ఎలా పెట్టాలో చెప్పాలా? అందులో ఆరితేరిన వాళ్లే ఇంట్లోకి వెళతారు లేదా వెళ్లాక అయినా టార్చర్ పెట్టడం ఎలాగో నేర్చేసుకుంటారు. ప్రోమో ద్వారా ఈసారి శ్రీరామచంద్రను బాగా టార్చర్ పెట్టినట్టు తెలుస్తోంది.
ఏ టీమ్ లో ఎవరు?
రెడ్ కేప్ వేసుకున్నవాళ్లంతా సూపర్ హీరోస్, బ్లాక్ కేప్ కట్టుకున్నవాళ్లంతా సూపర్ విలన్స్. సూపర్ హీరోస్ గ్రూపులో షణ్ముక్, ప్రియాంక, కాజల్, శ్రీరామచంద్ర, మానస్ ఉన్నారు. సూపర్ విలన్స్ గ్రూపులో రవి, యానీ మాస్టర్, సన్నీ, జెస్సీ, విశ్వ, సిరి ఉన్నారు. గ్రూపులను బట్టి చూస్తే స్నేహితులను విడదీసి రైవల్ గ్రూపుల్లో వేశాడు బిగ్ బాస్. మానస్ - సన్నీ, సిరి - షణ్ముక్ లను ఒక గ్రూపులో పడకుండా జాగ్రత్తపడ్డాడు.
శ్రీరామచంద్రే మొదటి టార్గెట్...
సూపర్ హీరోస్ ను ఇబ్బంది పెట్టే టాస్కలు ఇవ్వడం మొదలుపెట్టారు సూపర్ విలన్స్. అందుకు మొదట టార్గెట్ గా శ్రీరామచంద్రను ఎన్నుకున్నారు. అతనికి చుక్కలు చూపించారు. తమ ముందే మూడు సార్లు తలకు స్నానం చేయమని చెప్పారు. ఏదో పానీయాన్ని తాగించారు. దాన్ని తాగలేక చందు చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ తరువాత ఎరుపు పెయింట్ లాంటిది ఇచ్చి తల మీద నుంచి పోసుకోమన్నారు. అవన్నీ చేశాడు చంద్ర. రవి ట్రిమ్మర్ తో శ్రీరామచంద్ర జుట్టుకు ట్రిమ్ చేసేందుకు వచ్చాడు. దానికి చంద్ర ఒప్పుకోలేదు. ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే బుధవారం ఎపిసోడ్ చూడాల్సిందే.
[tw]
Captaincy task lo Heroes Vs Villains .. Who will win? #BiggBossTelugu5 tomorrow at 10 PM on #StarMaa#FiveMuchFun pic.twitter.com/WWto8nqdiV
— starmaa (@StarMaa) November 2, 2021
Also read: విటమిన్ సి వల్ల జలుబు తగ్గుతుందా? నిజమేనా?
Also read: ఇంతవరకూ డెంగ్యూ వ్యాక్సిన్ ఎందుకు కనిపెట్టలేకపోయారు? వచ్చే అవకాశం ఉందా?
Also read: రోజుకో అరటిపండు చాలు... ఆ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు
Also read:పిల్లలు ఎత్తు పెరగాలా... అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి