News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Dengue vaccine: ఇంతవరకూ డెంగ్యూ వ్యాక్సిన్ ఎందుకు కనిపెట్టలేకపోయారు? వచ్చే అవకాశం ఉందా?

కరోనా కేసులు తగ్గుతున్నాయనుకుంటే... మరో పక్క డెంగ్యూ కేసులు ఎక్కువైపోతున్నాయ్. అసలు డెంగ్యూకి వ్యాక్సిన్ ఉందా?

FOLLOW US: 
Share:

వాతావరణం చల్లగా మారిందంటే చాలు డెంగ్యూ దోమలు విజృంభిస్తాయి. ముఖ్యంగా పిల్లలను టార్గెట్ చేసుకుంటాయి. డెంగ్యూను సకాలంలో గుర్తించి చికిత్స అందించకపోతే రక్తంలోని ప్లేట‌్లెట్ల సంఖ్య పడిపోయి ప్రాణాంతకంగా మారచ్చు. ఇప్పటికే కరోనాతో సహా చాలా వ్యాధులకు వైద్యశాస్త్రం వ్యాక్సిన్లను కనుగొంది. కానీ ప్రమాదకరమైన డెంగ్యూకు మాత్రం వ్యాక్సిన్ ను కనిపెట్టలేదు. ఎందుకిలా? డెంగ్యూకు వ్యాక్సిన్ అవసరం లేదా? లేక కనిపెట్టలేకపోతున్నారా? 

ఆ వైరస్ డేంజరస్?
కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాలలో డెంగ్యూ కేసులు ప్రస్తుతం పెరుగుతున్నాయి. రుతుపవనాలు, వాతావరణ మార్పుల వల్ల డెంగ్యూ దోమలు ఎక్కువైపోతున్నాయి.  ఈడెస్ ఈజిప్టి జాతికి చెందిన ఆడ దోమల ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందుతుంది. ప్రపంచఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారం డెంగ్యూ ఇన్ ఫెక్షన్ కొందరిలో మైల్డ్ గా కనిపిస్తాయి. వారు ఇంట్లోనే చికిత్స తీసుకుని తేరుకోవచ్చు. మరికొందరిలో మాత్రం ప్లేట్ లెట్ల కౌంట్ పడిపోయి ప్రాణాల మీదకి వస్తోంది. డెంగ్యూకు కారణమయ్యే వైరస్ లను 
DENV-1, DENV-2, DENV-3, DENV-4 గుర్తించారు. వీటిలో DENV 2 అత్యంత తీవ్రమైనది. స్ట్రెయిన్ D2గా పిలుచుకునే ఈ వైరస్  అధిక జ్వరం, వాంతులు, కీళ్ల నొప్పులకు కారణమవుతుంది.  అలాగే డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్‌కు దారితీయవచ్చు. 

వ్యాక్సిన్ లేదా?
నిన్నగాక మొన్నవచ్చిన కరోనాకు కూడా వ్యాక్సిన్ ను చాలా తక్కువ టైమ్ లోనే కనిపెట్టేశారు. కానీ ఏళ్ల నుంచి వేధిస్తున్న డెంగ్యూకు మాత్రం ఇంతవరకు ఒక్క వ్యాక్సిన్ కూడా లేదు. నిజానికి డెంగ్యూకు వ్యాక్సిన్ ను కనుగొన్నారు. దాని పేరు డెంగ్వాక్సియా. 2015లో ఈ వ్యాక్సిన్ లైసెన్స్ పొందింది. కొన్ని దేశాల్లో దీన్ని 9 నుంచి 45 సంవత్సరాల వ్యక్తులకు దీన్ని అందించారు. కానీ ఇది ఎఫెక్టివ్ గా పనిచేసినా దాఖలాలు కనిపించలేదు. అందుకు ఆ వ్యాక్సిన్ పెద్దగా ప్రచారంలోకి రాలేదు. 

మనదేశంలోనూ...
బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (NCBS)-టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌కు చెందిన భారతీయ శాస్త్రవేత్తలు డెంగ్యూ వైరస్‌కు వ్యతిరేకంగా DNA వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసినట్లు కొన్ని  వార్తలు వచ్చాయి. కానీ అవేవీ ఇంకా విజయవంతం అవ్వలేదు. దీంతో డెంగ్యూ వ్యాక్సిన్ ఇంకా తయారీ దశలోనే ఉంది. 

ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.

Also read: రోజుకో అరటిపండు చాలు... ఆ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు

Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

Also read: ఈ పాపులర్ బ్రేక్‌ఫాస్ట్ మీ గుండెకు హాని చేయచ్చు... జాగ్రత్త

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 02 Nov 2021 02:14 PM (IST) Tags: Viral Fevers dengue Dengue vaccine Dengue Mosquito డెంగ్యూ

ఇవి కూడా చూడండి

New Virus: ప్రపంచానికి పొంచి ఉన్న మరో 'వైరస్' ముప్పు- కరోనాని మించిపోయేలా మరణాలు!

New Virus: ప్రపంచానికి పొంచి ఉన్న మరో 'వైరస్' ముప్పు- కరోనాని మించిపోయేలా మరణాలు!

Millets: చిరుధాన్యాలు తింటే బీపీ, షుగర్ అదుపులో ఉంటాయా?

Millets: చిరుధాన్యాలు తింటే బీపీ, షుగర్ అదుపులో ఉంటాయా?

కాలిన గాయాలకు వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స ఇదే

కాలిన గాయాలకు వెంటనే చేయాల్సిన ప్రథమ చికిత్స ఇదే

Blood Cholesterol: రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలా? అయితే ఈ పనులు చేయండి

Blood Cholesterol: రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలా? అయితే ఈ పనులు చేయండి

Paschima Namaskarasana: పశ్చిమ నమస్కార ఆసనం అంటే ఏంటి? ఎలా వేయాలి? ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

Paschima Namaskarasana: పశ్చిమ నమస్కార ఆసనం అంటే ఏంటి? ఎలా వేయాలి? ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

టాప్ స్టోరీస్

Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

Chandrababu Bail Petition: చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

Hyundai Exter: ఈ కారు కొనాలంటే ఎనిమిది నెలల వరకు ఆగాల్సిందే - బ్లాక్‌బస్టర్ కదా ఆ మాత్రం ఉంటది!

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

AIADMK Breaks With BJP: ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే గుడ్ బై - అన్నాదురైపై బీజేపీ వివాదాస్పద వ్యాఖ్యలతో కీలక నిర్ణయం

Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?

Skanda Release Trailer: సీఎంకు కాబోయే అల్లుడిగా రామ్ - ‘స్కంద’ కొత్త ట్రైలర్ చూశారా?