Sweets: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
తీపి పదార్థాలంటే పడి చచ్చిపోయేవాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు. కానీ తీపి అధికంగా తినడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
ఒక సాధారణ మనిషి కోరికలు రెండే రెండు.. అవి ఒకటి అందం, రెండూ ఆరోగ్యం. ఈ రెండింటినీ ఒకేసారి దెబ్బతీసే గుణం తీపిపదార్థాలకే ఉంది. అందుకే అధికంగా తినేముందు పదేపదే ఆలోచించుకోవడం చాలా ముఖ్యం. రోజుకో రెండు మూడు సార్లు స్వీట్లు తినే అలవాటున్న వారు ఆ అలవాటును పూర్తిగా మానుకోవడం చాలా ముఖ్యం. ఎందుకో మీరే చదవండి...
1. శరీరాన్ని తన రుచికి బానిస చేసుకునే శక్తి తీపికే ఉంది. ఒక స్వీటుతో ఎవరూ ఆపలేరు. వరుస పెట్టి రెండు మూడు పొట్టలో వేసేస్తారు. ఇలా మనకు తెలియకుండానే స్వీట్లకు బానిసలుగా మారిపోతాం. అంతేకాదు అవసరానికి మించి తినడం వల్ల అధిక కేలరీలు శరీరంలో చేరతాయి.
2. శరీరఆరోగ్యానికి తీపి పదార్థాల అవసరం తక్కువే. అన్నం, పండ్లు, ఇతర ఆహారపదార్థాలలో ఉన్న చక్కెర మన శారీరక అవసరాలకి సరిపోతుంది. కానీ ప్రత్యేకంగా రోజూ స్వీట్లు, చాక్లెట్లు, డోనట్స్ వంటి అధిక చక్కెర పదార్థాలు తినడం వల్ల శరీరంలో ఇన్ఫ్మేషన్ ఎక్కువైపోతుంది. దీంతో కీళ్లనొప్పులు, వాపులు ఎక్కువవుతాయి.
3. తీపి పదార్థాల్లోని గుణాలు చర్మంపై కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. చర్మం సాగేగుణాన్ని, బిగుతును కోల్పేయేలా చేస్తుంది. చర్మసౌందర్యానికి కొల్లాజెన్ చాలా అవసరం. ఆ కొల్లాజెన్ నాణ్యతను తీపి పదార్థాలు దెబ్బతీస్తాయి.
4. తీపి పదార్థాలు తినేవారికి పొట్టనొప్పి వచ్చే అవకాశం కూడా ఎక్కువ. ఎందుకంటే అధిక చక్కెరలు త్వరగా జీర్ణం కావు. దీని వల్ల కొందరిలో నొప్పి వచ్చిపోవడం జరుగుతుంది.
5. ఇక దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీయడంలో తీపి పదార్థాలు ముందుటాయి. దంతాలు నల్లగా మారి, పుచ్చి పోయేలా చేస్తాయి. చివరికి త్వరగానే ఊడిపోయేలా చేస్తాయి.
6. ఇక బరువు పెరగడంలో తీపి పదార్థాలదే అధిక వాటా. శరీరంలో కొవ్వు పేరుకునేలా చేసి ఊబకాయం బారిన పడేలా చేస్తుంది. తద్వారా గుండె జబ్బులు, మధుమేహం, హైబీపీ వీటన్నింటికీ కారణం అవుతుంది.
కాబట్టి స్వీట్లు వారానికి రెండు మూడు సార్ల కన్నా ఎక్కువ తినకపోవడం చాలా మంచిది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?
Also read: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?