Coffee: నిమ్మరసం చేర్చిన కాఫీ తాగితే కెలోరీలు కరిగిపోయే ఛాన్స్... ఇది నిజమేనా?
బరువు తగ్గాలని కోరుకునే వారు ఎన్నో చిట్కాలు పాటిస్తుంటారు. కాఫీ విత్ లెమన్ ఈ మధ్య ట్రెండింగ్ గా మారింది. ఇది ఎంతవరకు నిజమో...
బరువు పెరగడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది. అధికబరువు బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. కాగా ఒక టిక్ టాక్ యూజర్ కొవ్వును వేగంగా కరిగించడంలో నిమ్మరసం కలిపిన కాఫీ సహాపడుతుందని చెప్పాడు. అప్పట్నించి అది ట్రెండింగ్ మారింది. అంతేకాదు ఈ పానీయం తలనొప్పి, డయేరియా వంటి బాధల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని చాలా మంది నమ్ముతున్నారు. ఇందులో ఎంతవరకు నిజముందో తెలుసుకుందాం.
విడివిడి రెండూ బెస్ట్...
ప్రజలు అధికంగా వినియోగించే పానీయాలలో కాఫీ ఒకటి. ఇందులో ఉండే కెఫీన్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. కేంద్రనాడీ వ్యవస్థను ప్రేరేపిస్తుంది. చురుకుదనాన్ని కలిగిస్తుంది. మానసికస్థితిని ఉత్సాహంగా మారుస్తుంది. ఇక నిమ్మరసం విషయానికి వస్తే ఇవి పొట్టనిండిన ఫీలింగ్ ను త్వరగా కలిగిస్తాయి. ఎక్కువ ఆహారాన్ని తినడాన్ని తగ్గిస్తాయి. వీటిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీరాడికల్స్ తో పోరాడేందుకు శరీరానికి అవసరమైన పోషకాలను ఇస్తాయి.
పరిమితంగా తీసుకుంటే...
నిమ్మకాయ కాఫీ వల్ల తలనొప్పి తగ్గుతుందని నమ్మకం ఉంది. కొన్ని అధ్యయనాల ప్రకారం కెఫీన్లో రక్త నాళాలను బిగుతుగా చేస్తే లక్షణం ఉంది. దీనివల్ల నిమ్మకాయ కాఫీ తలనొప్పి నుంచి కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ అధికంగా కెఫీన్ శరీరంలో చేరితే మాత్రం తలనొప్పి రెట్టింపవుతుంది. రోజుకి ఒకటి లేదా రెండు కాఫీలతో సరిపెట్టుకోవాలి. డయారియా ఉన్నవాళ్లు లెమన్ కాఫీ వల్ల లబ్ధి పొందుతారని ఎలాంటి ఆధారాలు లేవు.
లెమన్ కాఫీ తయారీ...
లెమన్ కాఫీలో పాలు అవసరం ఉండదు. కేవలం బ్లాక్ కాఫీకి నిమ్మరసం చేర్చి తాగాలి. పులుపు మరీ ఎక్కువగా ఉంది అనిపిస్తే చిటికెడు ఉప్పు చేర్చుకోవచ్చు. రోజుకోసారి మాత్రమే లెమన్ కాఫీని ప్రయత్నించాలి.
కలిపి తాగితే కెలోరీలు కరుగుతాయా?
నిమ్మరసం, కాఫీ రెండు విడివిడిగా చూసుకుంటే ఆరోగ్యకరమైనవే. కానీ ఈ రెండు కొవ్వును కరిగించడంలో అంతగా సహాయపడవు. కాఫీకి నిమ్మరసం జోడించడం వల్ల ఆకలి తగ్గుతుంది. జీవక్రియ వేగవంతమవుతుంది. కానీ కొవ్వు కరగడం మాత్రం కొంచెం కష్టమే. అయినా కొవ్వును కోల్పోవడం అంతసులువైన పనేం కాదు. నిమ్మకాయ నీటిని మాత్రమే తాగడం ద్వారా కొంతవరకు దీన్ని సాధించవచ్చు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?
Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు
Also read: తెల్లవెంట్రుక పీకేస్తే... అవి మరింత ఎక్కువవుతాయంటారు నిజమేనా?