అన్వేషించండి

Boxing Day Test Live Updates: వివాదంలో చిక్కుకున్న కోహ్లీ.. నిషేధమా..? లేక జరిమానా..? ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే..?

Kohli Vs Konstas: గురువారం ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టులో కోహ్లీ అనవసరంగా వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనిపై ఐసీసీ విచారణ ప్రారంభించినట్లు సమాచారం. 

India Vs Australia Updates: భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వివాదంలో చిక్కుకున్నాడు. బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా గురువారం తొలిరోజున ఆసీస్ ఓపెనర్ శామ్ కొన్ స్టాస్ ను ఢీకొన్నాడని తెలుస్తోంది. అయితే దీనిపై ఐసీసీ చర్యలు తీసుకోవాని ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ డిమాండ్ చేస్తున్నారు. నిజానికి కొన్ స్టాస్ తో ఢీకొనడంతోపాటు అతనితో వాగ్వాదానికి కూడా కోహ్లీ దిగాడు. మరో ఆసీస్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, అంపైర్లు జోక్యం చేసుకుని పరిస్థితి సద్ధుమణిగేలా చేశారు. ప్రస్తుతం ఈ వివాదానికి సంబంధించిన క్లిప్పింగ్ చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో అభిమానులు షేర్ చేస్తూ అసలేం జరగిందని ఆరా తీస్తున్నారు. 

అసలేమైందంటే..?
ఇన్నింగ్స్ 11వ ఓవర్ ను బుమ్రా వేశాడు. మూడో బంతిని కొన్ స్టాస్ ఆడగా అది విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్లింది. దాన్ని తీసుకుని నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి స్ట్రైకర్ వైపు కొన్ స్టాస్ వెళుతుండగా, అతడిని కోహ్లీ ఢీకొట్టాడు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని వీడియో చూస్తే తెలుస్తోంది. అయితే తనను ఢీకొట్టిన తర్వాత కొన్ స్టాస్ ఏదో మాట అనగా, దానికి కోహ్లీ జవాబిచ్చాడు. ఈ అంశం ఇద్దరి మధ్య వాగ్వాదానికి దారి తీసింది. ఆ తర్వాత ఆటగాళ్లు, అంపైర్ల చొరవతో ఈ వివాదం సద్దుమణిగింది. దీనిపై తాజాగా పాంటింగ్, వాన్ చర్చ లేవనేత్తారు. 

కోహ్లీని శిక్షించాలి..
తన దారిన తాను వెళుతున్న కొన్ స్టాస్ ను కోహ్లీనే ఢీకొట్టాడని, తన దారి మార్చుకుని మరీ కొన్ స్టాస్ కి అడ్డు తగిలాడని పాంటింగ్ ఆరోపించాడు. అత్యంత అనుభవం కల ఆటగాడు, స్టార్ ప్లేయర్ ఇలాంటి పని చేయడం సరికాదని పేర్కొన్నాడు. మ్యాచ్ రిఫరీ అండీ పైక్రాఫ్ట్ ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుని కోహ్లీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. మరోవైపు అతనికి వాన్ కూడా వంతపాడుతున్నాడు. తాను ఆడినప్పుడు ప్లేయర్లపై స్లెడ్జింగ్ కు పాల్పడి, మైదానంలోనే పలుమార్లు క్రికెటర్లను హెచ్చరించిన పాంటింగ్ కు ఇప్పుడు ఐసీసీ రూల్స్ గుర్తొచ్చాయా..? అని భారత ఫ్యాన్స్ మండి పడుతున్నారు. ఇక భారత్ అంటే గిట్టని వాన్.. పాంటింగ్ తానా అంటే తందానా అని పాడుతున్నాడని సోషల్ మీడియాలో కొంతమంది అభిమానులు సెటైర్లు విసురుతున్నారు. అయితే ఈ అంశంపై ఐసీసీ రూల్ బుక్ ఏం చెబుతోందంటే.. ఎవరైనా ప్లేయర్ లేద సహాయక సిబ్బంది, అంపైర్లను కానీ ఉద్దేశ పూర్వకంగా ఢీకొడితే అది ఆర్టికల్ 2.12 కింద శిక్షార్హమైన నేరంగా పరిగణించబడుతుంది. దీనికి తప్పును బట్టి, మ్యాచ్ నిషేధం లేదా మ్యాచ్ ఫీజులో జరిమానా విధిస్తారు. అయితే దీనిపై ఐసీసీ రిఫరీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఈ అంశంపై ఐసీసీ విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఒకవేళ లెవల్-2 నేరం అని తేలిస్తే నిషేధం, లెవల్-1 నేరం అని తేలిస్తే జరిమానా విధిస్తారని సమాచారం.  దీనిపై త్వరలోనే నిర్ణయం రావచ్చని తెలుస్తోంది. ఇక బాక్సింగ్ డే టెస్టులో తొలి రోజు ఆటముగిసేసరికి ఆసీస్ 86 ఓవర్లో 311/6 చేసింది. 

Also Read: Ind Vs Aus Test Series: హోరాహోరీగా బాక్సింగ్ డే టెస్టు - చివరి సెషన్లో సత్తా చాటిన భారత బౌలర్లు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Opening Ceremony: నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Hyderabad Rains Update : హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP DesamHyderabad to host Miss World pageant |  మే 7-31 వరకూ తెలంగాణ వేదిక మిస్ ఇండియా పోటీలు | ABP DesamChahal Dhanashree Verma Divorce | చాహల్ ధనశ్రీకి విడాకులు మంజూరు చేసిన కోర్ట్ | ABP DesamVidya Veerappan Political Career | రాజకీయాల్లో వీరప్పన్ కూతురు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Opening Ceremony: నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
నేడు ఐపీఎల్ 2025 ప్రారంభం, కళ్లు చెదిరే ప్రదర్శనలు - లైవ్ మ్యాచ్‌లు ఎక్కడ చూడాలో తెలుసా..
Revanth And KTR: బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
బీజేపీపై పోరాటానికి చేతులు కలపనున్న కేటీఆర్,రేవంత్ - స్టాలిన్ సమావేశమే వేదిక!
Tadipatri Tension: తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
తాడిపత్రిలో వైసీపీ నేత ఇంటిపై దాడి - తీవ్ర ఉద్రిక్తత
Hyderabad Rains Update : హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన- మరో రెండు రోజులు ఇదే వెదర్ 
YS Viveka Case: వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
వివేకా హత్య కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు నోటీసులు - కేసును 6 నెలల్లోతేల్చాలని సునీత పిటిషన్
Hyderabad Crime News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, మాయమాటలతో రప్పించి ఓయో రూములో ఇద్దరు బాలికలపై అత్యాచారం
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం, మాయమాటలతో రప్పించి ఓయో రూములో ఇద్దరు బాలికలపై అత్యాచారం
Telangana: సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
సీఎం రేవంత్‌తో మల్లారెడ్డి, హరీష్ రావు సమావేశాలు - అలాంటిదేమీ లేదని వివరణ
APPSC: 'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
'గ్రూప్‌-1' అభ్యర్థులకు అలర్ట్, మెయిన్స్‌ పరీక్షల షెడ్యూలు వెల్లడి- ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Embed widget