By: ABP Desam | Updated at : 03 Nov 2021 07:59 AM (IST)
(Image credit: Pexels)
శీతాకాలం వచ్చేసింది... ఇక చల్లదనానికి వైరల్ ఇన్ఫెక్షన్లు, జలుబులు, దగ్గులు దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లల్లో త్వరగా జలుబు లక్షణాలు కనిపిస్తాయి. ఒకరి నుంచి ఒకరికి పాకేస్తాయి కూడా. ఈ పరిస్థితికి పిల్లలు, పెద్దలు ముందుగానే సిద్ధంగా ఉండాలి. ఎలాంటి ఆహారాన్ని తింటే జలుబు లాంటివి త్వరగా ఎటాక్ చేయకుండా, ఒకవేశ వచ్చినా త్వరగా వదిలి పోతాయో... అలాంటి ఆహారానికి ప్రాముఖ్యతనివ్వాలి. జనాల్లో విటమిన్ సి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నమ్మకం ఉంది. అది నిజమే కానీ విటమిన్ సి ఉన్న ఆహారపదార్థాల వల్ల జలుబు కూడా తగ్గుతుందనే వారు కూడా ఉన్నారు. అదెంత వరకు నిజమో చూద్దాం.
పిల్లల ఎదుగుదలకు, వారి ఆరోగ్యపరిరక్షణకు విటమిన్ సి చాలా ముఖ్యం. అయితే జలుబు రాకుండా చేయగల సమర్థత ఇందులో లేదు. కేవలం వచ్చిన ఇన్ఫెక్షన్ ను తట్టుకునే సామర్థ్యాన్ని మాత్రం శరీరానికి అందిస్తుంది. అంటే కొందరిలో జలుబు వస్తే రెండు మూడు వారాలు ఉంటుంది. కానీ విటమిన్ సి ఉన్న ఆహారపదార్థాలు తినడం వల్ల కేవలం అయిదు నుంచి వారం రోజుల్లోనే జలుబు తగ్గిపోయేలా చేస్తుంది. కాబట్టి జలుబు ఉన్నప్పుడు ఫ్రిజ్ లో పెట్టని, విటమిన్ సి అధికంగా ఉండు ఆహారాన్ని తినడం మంచిదే. దాని వల్ల మేలు జరుగుతుంది.
విటమిన్ సి చాలా అవసరం...
నాడీమండల పనితీరును చురుగ్గా ఉంచడంలో విటమిన్ సి కీలకపాత్ర వహిస్తుంది. శరీరంలో చేరే వైరస్ లు, బ్యాక్టిరియాలతో పోరాడే శక్తిని మన రోగనిరోధక వ్యవస్థకు అందిస్తుంది. విటమిన్ సి తక్కువైన వాళ్లలలో చర్మం మొద్దుబారడం, భావోద్వేగాల్లో తీవ్ర మార్పులు కనిపించడం, చర్మం మెరుపును కోల్పోవడం వంటివి జరుగుతాయి.
ఏం తినాలి?
విటమిన్ సి పుష్కలంగా అందాలంటే పుల్లని పండ్లను రోజూ వారీ మెనూలో చేర్చుకోవాలి. జామకాయలు, పసుపుగా ఉండే క్యాప్సికం, నిమ్మకాయలు, నారింజలు, కొత్తిమీర, కివీ పండ్లు, ఎర్ర క్యాప్సికం, బ్రకోలి, బొప్పాయి, స్ట్రాబెర్రీ, పైనాపిల్, కాలీఫ్లవర్, ఉసిరి వంటి ఆహార పదార్థాలను రోజూ తినడం అలవాటు చేసుకోవాలి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: రోజుకో అరటిపండు చాలు... ఆ క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు
Also read:పిల్లలు ఎత్తు పెరగాలా... అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే
Also read: తీపి అధికంగా తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Late Night: లేట్ నైట్ నిద్రపోతున్నారా? అది ఎంత ప్రమాదమో తెలుసా
Curry leaves: కరివేపాకే కదా అని తీసిపారేయకండి, బరువుని ఇట్టే తగ్గించేస్తుంది
Silent Walking: వాకింగ్ చేస్తున్నప్పుడు నిశ్శబ్దంగా ఉండడం ఎంత ముఖ్యమో తెలుసా
Children Memory Booster: మీ పిల్లలకి జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ పండ్లు తినిపించండి
Lemon: ఈ ఆహార పదార్థాలతో నిమ్మకాయ జోడించకపోవడమే ఉత్తమం
Chandrababu Arrest: వచ్చేవారం నుంచి యువగళం కొనసాగింపు, టెలీకాన్ఫరెన్స్‌లో నారా లోకేశ్ స్పష్టత
ఒకేసారి 9 వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లకు ప్రధాని పచ్చజెండా, తెలుగు రాష్ట్రాలకు రెండు రైళ్లు
Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
Hyderabad Boy Death: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలుడి మృతి, పది నిమిషాలకే అంత ఘోరం - పజిల్‌గా మారిన కేసు!
/body>