IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Ravi Teja: ‘టైగర్ నాగేశ్వరరావు’గా రవితేజ.. వేటకు ముందు నిశబ్దమంటున్న స్టువర్టుపురం దొంగ

రవితేజ తన 71వ చిత్రాన్ని ప్రకటించాడు. ఈ చిత్రానికి ‘టైగర్ నాగేశ్వరరావు’ టైటిల్ ఖరారు చేసినట్లు బుధవారం ట్వీట్ చేశాడు.

FOLLOW US: 

వితేజ మంచి జోరు మీద ఉన్నాడు. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చే రవితేజ.. ఈ ఏడాది కూడా అదే ట్రెండ్ కొనసాగిస్తున్నాడు. 2022లో సందడి చేసేందుకు తాజాగా ఐదు చిత్రాలను అంగీకరించాడు. ‘ఖిలాడీ’, ‘రామారావ్ ఆన్ డ్యూటీ’ సినిమాలు దాదాపు పూర్తి కావస్తున్నాయి. అంతేకాదు నక్కిన త్రినాధరావుతో ‘ధమాకా’ సినిమా, సుధీర్ వర్మలతో చిత్రాలకు కూడా ఓకే చెప్పేశాడు. తాజాగా దొంగాట వంశీ కృష్ణ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో నటిస్తున్నట్లు రవితేజ ప్రకటించారు. ఈ చిత్రానికి ‘టైగర్ నాగేశ్వరరావు’ అనే టైటిల్ ఖరారు చేశారు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతోపాటు, కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. 

స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్ ఇది. పాన్ ఇండియా మూవీకి తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చాలా గ్యాప్ తర్వాత తమిళ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ (ఆకాశమే హద్దురా మ్యూజిక్ డైరెక్టర్, ‘ఒరేయ్ బామ్మర్ది’ హీరో) ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నాడు. ఇక పోస్టర్ విషయానికి వస్తే.. ‘ఫీల్ ది సైలెన్స్ బిఫోర్ ది హంట్’ అనే క్యాప్షన్ ఉంది. పులి అడుగుల నుంచి మనిషి అడుగులు.. పాదాలను పోస్టర్‌లో చూపించారు. 

‘క్రాక్’ సినిమా ఇచ్చిన కిత్‌తో రవి తేజ వరుసగా సినిమాలు చేసేస్తున్నారు. ఇటీవల రవితేజ తన 70వ చిత్రాన్ని కూడా ప్రకటించాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌‌ను ఇటీవలే ప్రకటించారు. ‘హీరోలు ఉండరు’ (Heroes does not exist) అనే క్యాప్షన్‌తో విడుద‌ల చేసిన ఈ ప్రాజెక్ట్‌కు ‘రావ‌ణాసుర’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. హీరోలు ఉండరని అంటే రవితేజ ఇందులో విలన్‌గా కనిపిస్తాడా? అనే సందేహాలు నెలకొన్నాయి. ఇందులో హీరోకు నెగటీవ్ షేడ్స్ ఉంటాయని వస్తున్న వార్తల నేపథ్యంలో ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌టీ టీమ్‌వర్క్స్‌ పతాకాలపై అభిషేక్‌ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 5న ఈ చిత్రం టైటిల్‌ ప్రకటించనున్నారు.

Also Read: సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్... శ్రీరామచంద్రకు టార్చర్
Also Read: మానస్ ని సేవ్ చేసిన యానీ మాస్టర్.. ప్రియాంక ఫైర్..
Also Read: 'అభిమానులు అనాలా..? ఆర్మీ అనాలా..?'.. 'ఆహా 2.0' ఈవెంట్ లో బన్నీ..
ఇట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 03 Nov 2021 12:44 PM (IST) Tags: Ravi Teja రవితేజ Tiger Nageswara Rao Ravi Teja 71 Movie Ravi Teja Tiger Nageswara Rao రవితేజ 70వ చిత్రం

సంబంధిత కథనాలు

Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?

Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?

Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?

Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?

Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత

Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత

BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?

BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?

Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video

PM Modi Arrives In Tokyo: జపాన్‌లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం, భారత సింహం అంటూ గట్టిగా నినాదాలు - Watch Video

TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే

TSRTC Offer: పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ గుడ్ న్యూస్! వీరికి ఫ్రీ రైడ్ - రోజుకు ఎన్నిసార్లంటే

CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు

CM Jagan Davos Tour : దావోస్ తొలిరోజు పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీ, డబ్ల్యూఈఎఫ్ తో పలు ఒప్పందాలు

Vitamin Deficiency: వాసన, రుచి తెలియడం లేదా? కరోనా వల్లే కాదు, ఈ విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు

Vitamin Deficiency: వాసన, రుచి తెలియడం లేదా? కరోనా వల్లే కాదు, ఈ విటమిన్ లోపం వల్ల కూడా కావచ్చు