అన్వేషించండి
Advertisement
Allu Arjun: 'అభిమానులు అనాలా..? ఆర్మీ అనాలా..?'.. 'ఆహా 2.0' ఈవెంట్ లో బన్నీ..
'ఆహా 2.0' ఈవెంట్ లో బన్నీ ఇచ్చిన స్పీచ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ 'ఆహా' ఇప్పుడు 'ఆహా 2.0' అంటూ కొత్త వెర్షన్ ను మొదలుపెట్టింది. ఇందులో కంటెంట్ ఓ రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఓ ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో బన్నీ తన స్పీచ్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ముందుగా.. 'అభిమానులు అనాలా..? ఆర్మీ అనాలా..?' అంటూ తన ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ.. ఆర్మీ అని ఫిక్స్ అయ్యారు.
ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. 'ఆహా'కి సంబంధించి ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదని.. ఇంత షార్ట్ టైంలో 'ఆహా' ఇంత సక్సెస్ అయిదంటే.. దానికి కారణం తెలుగు ప్రేక్షకులే అని అన్నారు. అరుస్తున్న తన ఫ్యాన్స్ ను ఉద్దేశిస్తూ.. 'మీరు లేకపోతే అసలు నేనే లేను' అంటూ కామెంట్ చేశాడు.
ఒక సక్సెస్ ఫుల్ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా 'ఆహా' ఉన్నందుకు ఎంతో గర్విస్తున్నానని చెప్పారు. దీనికి కారణమైన తన తండ్రికి కంగ్రాట్స్ చెప్పారు. డెబ్భై ఏళ్ల వయసులో కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేసి హ్యాండిల్ చేయడం మాములు విషయం కాదని.. యువర్ ది ఎనర్జీ ఆఫ్ 'ఆహా' అంటూ తన తండ్రిపై ప్రేమను కురిపించాడు. ఇప్పటినుంచి 'ఆహా' వేరే లెవెల్ అని అన్నారు.
'ఆహా 2.0' కొత్త సాఫ్ట్ వేర్ తో ఉంటుంది. చదువురాని వాళ్లు కూడా ఆపరేట్ చేయొచ్చని.. 'ఆహా' తెలుగువారి కొత్త అలవాటు.. ఎవ్రీ ఫ్రైడే న్యూ రిలీజ్ అంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. 'ఆహా'లో ఒక సర్ప్రైజ్ ఉండబోతుందని.. అది 'సినిమాపురం' అని ఓ వీడియో రిలీజ్ చేశారు. అదేంటో తరువాత చెప్తానని అన్నారు.
ఆ తరువాత 'పుష్ప' సినిమా గురించి మాట్లాడారు. సినిమా రిలీజ్ అవ్వకముందు చాలా తక్కువ సినిమాలకు పాజిటివ్ ఫీలింగ్ ఉంటుందని.. 'పుష్ప' సినిమా వచ్చే విధానం చూస్తుంటే చాలా పాజిటివ్ గా ఉందని అన్నారు. ఈ సినిమాలో సుకుమార్ గారి బ్రిలియన్స్ చూస్తారని చెప్పారు. సినిమా బాగా రావడంతో పాటు సినిమా ఆడియో కూడా అదిరిపోయిందని అన్నారు. సినిమా నుంచి ఇంకో పాట రాబోతుందని... అద్భుతంగా ఉంటుందని చెప్పారు. డిసెంబర్ 17న సినిమా రిలీజ్ అవ్వడం ఖాయమని అన్నారు.
Our Galaxy of stars on a single stage ♥
— ahavideoIN (@ahavideoIN) November 2, 2021
Watch 'Icon Staar Presents aha 2.0' Live Now!
▶️ https://t.co/k5gydwPiNe#aha2point0 #aha pic.twitter.com/JcA8tV5uGX
Also Read: హిందీ రిలీజ్ ఇష్యూ.. అల్లు అర్జున్ సీరియస్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
టెక్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion