అన్వేషించండి
Advertisement
'Unstoppable' Show: 'బాలయ్య అనుకోకుండా వెలిగిన ఒక తారాజువ్వ..' అల్లు అరవింద్ కామెంట్స్..
'Unstoppable' షోకి బాలయ్యను ఎలా ఎన్నుకున్నారు..? ఆ ఛాయిస్ ఎవరిదనే విషయంపై క్లారిటీ ఇచ్చారు అల్లు అరవింద్.
ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ 'ఆహా' ఇప్పుడు 'ఆహా 2.0' అంటూ కొత్త వెర్షన్ ను మొదలుపెట్టింది. ఇందులో కంటెంట్ ఓ రేంజ్ లో ఉంటుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఓ ఈవెంట్ ను నిర్వహించారు. ఇందులో అల్లు అరవింద్ 'Unstoppable' షోకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అసలు బాలయ్యను ఎలా ఎన్నుకున్నారు..? ఆ ఛాయిస్ ఎవరిదనే విషయంపై క్లారిటీ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ.. ''అనుకోకుండా వెలిగిన ఒక తారాజువ్వ బాలయ్య.. నెక్స్ట్ టాక్ షో ఎవరు చేస్తే బావుంటుందనే డిస్కషన్ వచ్చినప్పుడు.. అందరూ రకరకాల పేర్లు చెప్పారు. నేను బాలకృష్ణ గారు చేస్తే బావుంటుందని చెప్పా.. ఆయన చేస్తారా..? అని అడిగారు. నేను వెంటనే బాలకృష్ణ గారికి ఫోన్ చేస్తే.. లిఫ్ట్ చేసి ఏంటి బ్రదర్ ఎలా ఉన్నారని అడిగారు. ఆ తరువాత 'ఆహా' చూస్తుంటారా అని అడిగాను. చూస్తుంటానని చెప్పారు. సమంత చేసిన షో చూశారా అని అడిగాను.. 'చూశాను.. చాలా బావుంది' అని చెప్పారు. అలాంటి షో మీతో చేయాలనుకుంటున్నాం.. మీరు టైం ఇస్తే మా టీమ్ వచ్చి మిమ్మల్ని కలుస్తుందని చెప్పాను. ఓకే అన్నారు. ఆ తరువాత ఆయనే కాల్ చేసే ఎన్నిగంటలు వస్తున్నారని అడిగారు. పదకొండు గంటలకి అని చెప్పారు. ఆ తరువాత మా టీమ్ ఒంటి గంటకు ఫోన్ చేసి.. కాన్సెప్ట్ విన్నారు.. బావుందన్నారు.. చేస్తానన్నారు అని చెప్పారు. ఆయన దగ్గర ఎంత స్ట్రెయిట్ గా ఉంటుందంటే.. ఆయనకు చేయాలనిపిస్తే వెంటనే ఒప్పుకుంటారు. ఆయన ఒప్పుకోగానే మాకు అర్ధం కాలేదు.. మేమే కన్ఫ్యూజ్ అయ్యాం. ఆయన టపాస్ లాంటోడు కదా..'' అంటూ చెప్పుకొచ్చారు.
Records srushtinchalanna aayane, daanni tiragaraayalanna aayane 🔥
— ahavideoIN (@ahavideoIN) November 1, 2021
5M+ Digital views for #UnstoppableWithNBK Ep-1 promo 💥#NandamuriBalakrishna @themohanbabu @iVishnuManchu @LakshmiManchu #MansionHouse @swargaseema #NandGokulGhee #TilakNagarIndustries pic.twitter.com/Nm97UHlUjz
Also Read: హిందీ రిలీజ్ ఇష్యూ.. అల్లు అర్జున్ సీరియస్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
మొబైల్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Dr. Rahul ChaudharyPresident of Administration in NDIIT
Opinion