అన్వేషించండి
Nani : 'అరె ఎగసి ఎగసి పడు అలజడి వాడే..' 'శ్యామ్ సింగరాయ్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే..
తాజాగా 'శ్యామ్ సింగరాయ్' సినిమాకి సంబంధించిన అప్డేట్ ను వెల్లడించింది చిత్రబృందం. 'రైజ్ ఆఫ్ శ్యామ్' అంటూ సినిమాలో అతడు పాత్ర ఎలా ఉండబోతుందో ఓ పాట ద్వారా చెప్పబోతున్నారు.

'శ్యామ్ సింగరాయ్' ఫస్ట్ సింగిల్ రిలీజ్ ఎప్పుడంటే..
నేచురల్ స్టార్ నాని హీరోగా.. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'శ్యామ్ సింగరాయ్'. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ప్రధాన హీరోయిన్ గా సాయిపల్లవి నటిస్తుండగా, సెకండ్ నాయికగా కృతిశెట్టి కనిపించబోతోంది. ఇక మరో హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ ఓ కీలకపాత్ర చేస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా కోల్ కతా బ్యాక్ డ్రాప్ తెరకెక్కుతోంది. ఇందులో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటివరకు విడుదలైన సినిమా పోస్టర్లను గమనిస్తే.. ఈ సినిమా పూర్వజన్మలకు సంబంధించిన కాన్సెప్ట్ మాదిరి అనిపిస్తోంది.
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ను వెల్లడించింది చిత్రబృందం. 'రైజ్ ఆఫ్ శ్యామ్' అంటూ సినిమాలో అతడు పాత్ర ఎలా ఉండబోతుందో ఓ పాట ద్వారా చెప్పబోతున్నారు. నవంబర్ 6న రాబోతున్న ఈ పాటకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో 1970, కలకత్తా అని ఓ టైటిల్ వేశారు. అంటే శ్యామ్ సింగరాయ్ గతానికి సంబంధించిన పాత్ర అని తెలుస్తోంది.
ఈ సినిమాను డిసెంబర్ 24న క్రిస్మస్ కానుక థియేటర్లలోకి విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. నిహారిక ఎంటర్టైన్మెంట్స్‌పై వెంకట్ బోయనపల్లి భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో మొదటి పాటను కృష్ణకాంత్ రాయగా.. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలచేయనున్నారు.
Here’s the promo of the first lyrical from #ShyamSinghaRoy :)#RiseOfShyam
— Nani (@NameisNani) November 2, 2021
Go for full volume this time 🔥
Telugu,Tamil,Malayalam,Kannada pic.twitter.com/2n3Cimxhla
Also Read: బ్రేకింగ్: కేర్ ఆస్పత్రిలో బాలకృష్ణకు సర్జరీ... డిశ్చార్జికి రెడీ!
Also Read: హిందీ రిలీజ్ ఇష్యూ.. అల్లు అర్జున్ సీరియస్
Also Read: మాస్ మహారాజా ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?
Also Read: ప్రజెంట్ 'గాడ్ ఫాదర్'... 15 నుంచి 'భోళా శంకర్'... మెగాస్టార్ స్పీడు మామూలుగా లేదుగా!
Also Read: సంక్రాంతి బరిలో రాజ'శేఖర్'... యాంగ్రీ స్టార్ తగ్గేదే లే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
ఇంకా చదవండి
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్





















