అన్వేషించండి
Pawan Kalyan: 'భీమ్లా నాయక్' బ్లాస్టింగ్ అప్డేట్.. ఫ్యాన్స్ గెట్ రెడీ..
'భీమ్లా నాయక్' సినిమా నుంచి మరో 'బ్లాస్టింగ్ అప్డేట్' రాబోతుందంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు దర్శకనిర్మాతలు.

'భీమ్లా నాయక్' బ్లాస్టింగ్ అప్డేట్..
పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్'. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.
ఇప్పటికే సినిమాలో పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాలను టీజర్ ద్వారా చెప్పకనే చెప్పారు. మొన్నామధ్య సినిమా ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయగా.. దానికి విపరీతమైన బజ్ వచ్చింది. రీసెంట్ గానే 'అంత ఇష్టం ఏందయ్యా' అంటూ సాగే సెకండ్ సాంగ్ ను విడుదల చేశారు. ఇప్పుడు సినిమా నుంచి మరో 'బ్లాస్టింగ్ అప్డేట్' రాబోతుందంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు దర్శకనిర్మాతలు.
ఇప్పటికే సినిమాలో పవన్ కళ్యాణ్, రానా క్యారెక్టర్లు ఎలా ఉండబోతున్నాయనే విషయాలను టీజర్ ద్వారా చెప్పకనే చెప్పారు. మొన్నామధ్య సినిమా ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయగా.. దానికి విపరీతమైన బజ్ వచ్చింది. రీసెంట్ గానే 'అంత ఇష్టం ఏందయ్యా' అంటూ సాగే సెకండ్ సాంగ్ ను విడుదల చేశారు. ఇప్పుడు సినిమా నుంచి మరో 'బ్లాస్టింగ్ అప్డేట్' రాబోతుందంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు దర్శకనిర్మాతలు.
రేపు ఉదయం 11 గంటలకు 'భీమ్లా నాయక్' సినిమాకి సంబంధించిన అప్డేట్ రాబోతుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మూడో సింగిల్ ని విడుదల చేయడానికి రెడీ అవుతున్నారని.. ఆ విషయాన్నే అఫీషియల్ గా ప్రకటించనున్నారని తెలుస్తోంది. మరి దీనిపై రేపు క్లారిటీ రాబోతుంది. ఫ్యాన్స్ మాత్రం ఈ అప్డేట్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే-మాటలు అందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా కనిపించనుంది. రానాకి భార్యగా నటి సంయుక్త మీనన్ కనిపించనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. మరి చెప్పిన టైంకి వస్తారో లేదో చూడాలి!
A BLASTING UPDATE is ready to fire up! 🥁🔥
— Naga Vamsi (@vamsi84) November 2, 2021
Stay Tuned, Tomorrow @ 11 AM 💥#BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @NavinNooli @SitharaEnts pic.twitter.com/dtPcSIhsBS
Also Read: హిందీ రిలీజ్ ఇష్యూ.. అల్లు అర్జున్ సీరియస్
Also Read: మాస్ మహారాజా ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?
Also Read: ప్రజెంట్ 'గాడ్ ఫాదర్'... 15 నుంచి 'భోళా శంకర్'... మెగాస్టార్ స్పీడు మామూలుగా లేదుగా!
Also Read: సంక్రాంతి బరిలో రాజ'శేఖర్'... యాంగ్రీ స్టార్ తగ్గేదే లే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్ చేయండి
ఇంకా చదవండి





















