News
News
X

Bheemla Nayak: 'దీపావళి పండగ ముందే వచ్చేసింది..' 'లాలాభీమ్లా' ప్రోమోలో పవన్ మాస్ అవతార్..

తాజాగా 'భీమ్లా నాయక్' సినిమా నుంచి 'లాలాభీమ్లా' అనే సాంగ్ ప్రోమో వచ్చింది. ఈ వీడియోలో పవన్ మాస్ లుక్ తో కనిపించారు. 

FOLLOW US: 

పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం 'భీమ్లా నాయక్'. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పలు అప్డేట్స్ తో ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు దర్శకనిర్మాతలు. 

Also Read: రవితేజ - వంశీ చిత్రం టైటిల్ వచ్చేసింది.. ఐదు భాషల్లో ఒకేసారి..

తాజాగా మరో బ్లాస్టింగ్ అప్డేట్ రాబోతుందంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈరోజు ఉదయం అయితే ఓ పోస్టర్ ను వదిలారు. దీనిపై 'భీమ్లా నాయక్' నుంచి 'లాలా భీమ్లా' అనే స్పెషల్ సాంగ్ కి సంబంధించిన ప్రోమో రాబోతుందని తెలిపారు. 'ది సౌండ్ ఆఫ్ భీమ్లా' అనే హ్యాష్ ట్యాగ్ తో దీనిని వైరల్ చేశారు. ఖద్దరు చొక్కా, గళ్ల లుంగీ కట్టుకుని కనిపించిన పవన్ ను చూసిన ఫ్యాన్స్ మురిసిపోయారు. పైగా ఆయన పక్కనే ఒక విస్కీ బాటిల్ పెట్టుకొని కనిపించాడు పవన్. 

ఉదయం నుంచి ఈ పోస్టర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. తాజాగా ప్రోమోను విడుదల చేశారు. ఈ వీడియోలో పవన్ మాస్ లుక్ తో కనిపించారు. 'నాగరాజు గారూ హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండీ. మీకు దీపావళి పండగ ముందుగానే వచ్చేసిందండీ' అంటూ పవన్ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. తమన్ అందించిన స్కోర్ అభిమానులను ఆకట్టుకుంటుంది. పూర్తి పాటను నవంబర్ 7న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అదే రోజున త్రివిక్రమ్ పుట్టినరోజు కావడం విశేషం. 

ఈ సినిమాకి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే-మాటలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా కనిపించనుంది. రానాకి భార్యగా నటి సంయుక్త మీనన్ కనిపించనుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేస్తామని చెబుతున్నారు. మరి రిలీజ్ డేట్ లో ఏమైనా మార్పొస్తుందేమో చూడాలి!

Published at : 03 Nov 2021 07:07 PM (IST) Tags: pawan kalyan Bheemla Nayak Sagar k chandra Trivikram lala bheemla taman

సంబంధిత కథనాలు

Gruhalakshmi October 3rd Update: తులసి పోస్ట్ ఊస్ట్- నందు చేతికి పగ్గాలు, సామ్రాట్ చేసిన పనికి దణ్ణం పెట్టేసి వెళ్ళిపోయిన తులసి

Gruhalakshmi October 3rd Update: తులసి పోస్ట్ ఊస్ట్- నందు చేతికి పగ్గాలు, సామ్రాట్ చేసిన పనికి దణ్ణం పెట్టేసి వెళ్ళిపోయిన తులసి

Guppedanta Manasu October 3rd : ఇద్దరూ ఇద్దరే అసలు తగ్గడం లేదు- రిషి కోసం దేవయాని ముందు తలవంచిన మహేంద్ర

Guppedanta Manasu  October 3rd : ఇద్దరూ ఇద్దరే అసలు తగ్గడం లేదు- రిషి కోసం దేవయాని ముందు తలవంచిన మహేంద్ర

Karthika Deepam Octobar 3rd: దిమ్మ తిరిగేలా షాకుల మీద షాకులిచ్చిన దీప- కార్తీక్ ముందు అడ్డంగా బుక్కైయిపోయిన మోనిత

Karthika Deepam Octobar 3rd: దిమ్మ తిరిగేలా షాకుల మీద షాకులిచ్చిన దీప- కార్తీక్ ముందు అడ్డంగా బుక్కైయిపోయిన మోనిత

Devatha October 3rd Update: ప్రకృతి వైద్యశాలకి జానకమ్మ, ఆదిత్యకి స్పాట్ పెట్టిన మాధవ్- పాండిచ్చేరి ట్రిప్ ప్లాన్ చేసిన సత్య

Devatha October 3rd Update: ప్రకృతి వైద్యశాలకి జానకమ్మ, ఆదిత్యకి స్పాట్ పెట్టిన మాధవ్- పాండిచ్చేరి ట్రిప్ ప్లాన్ చేసిన సత్య

Ennenno Janmalabandham October 3rd: ఆదిత్యకి ప్రేమగా అన్నం తినిపించిన వేద - తన సూసైడ్ ఎటెంప్ట్ కి కారణం ఎవరో చెప్పి షాకిచ్చిన మాళవిక

Ennenno Janmalabandham October 3rd: ఆదిత్యకి ప్రేమగా అన్నం తినిపించిన వేద - తన సూసైడ్ ఎటెంప్ట్ కి కారణం ఎవరో చెప్పి షాకిచ్చిన మాళవిక

టాప్ స్టోరీస్

TRS News: జాతీయపార్టీలో తెలంగాణ అధ్యక్షుడు ఎవరు? ఆ ఛాన్స్ కేటీఆర్‌కే దక్కుతుందా?

TRS News: జాతీయపార్టీలో తెలంగాణ అధ్యక్షుడు ఎవరు? ఆ ఛాన్స్ కేటీఆర్‌కే దక్కుతుందా?

YSRCP MLA మేకతోటి సుచరితకు షాకిచ్చిన సొంత పార్టీ నేత, ఇంకెప్పుడంటూ నిలదీత !

YSRCP MLA మేకతోటి సుచరితకు షాకిచ్చిన సొంత పార్టీ నేత, ఇంకెప్పుడంటూ నిలదీత !

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!

Adipurush Teaser: 'న్యాయం చేతుల్లోనే అన్యాయానికి సర్వనాశనం' - 'ఆదిపురుష్' టీజర్!