Kadapa Crime: కడపలో ఏఆర్ ఎస్సై చంద్రరావు ఆత్మహత్య...
కడపలో ఏఆర్ ఎస్సై చంద్రరావు(25) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సమస్యలతో ఆయన బలవన్మరణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
కడపలో ఏఆర్ ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తోన్న చంద్రరావు(25) ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం తన నివాసంలో ఉరేసుకుని సూసైడ్ కు పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన చంద్రరావు వృత్తిరీత్యా కడపలో ఉంటున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనాస్థలిని పరిశీలించి చంద్రరావు మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. కుటుంబ సమస్యలతో చంద్రరావు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also read: తనిఖీల పేరుతో అసభ్యకర చర్యలు... పరీక్షలు బహిష్కరించిన విద్యార్థులు
అనంతపురంలో విషాద ఘటన
అనంతపురం జిల్లా హిందూపురంలోని శాంతినగర్ కు చెందిన నజీమ్ రజీ(36) జనరేటర్ మరమ్మత్తులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. నజీమ్‌కు పదమూడేళ్ల క్రితం షాజియా కౌసర్ (29)తో వివాహం అయింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరికి 13 ఏళ్లు కాగా, ఇంకొకరికి మూడేళ్లు. మరో కుమార్తెకు ఏడేళ్లు. అన్యోన్యంగా సాగే ఈ కుటుంబం ప్రస్తుతం విషాదంలో మునిగిపోయింది. ఐతే గత నాలుగురోజుల క్రితం కర్ణాటకలోనే దావణగెరె జిల్లా చెన్నగిరికి తన మరదలి పెళ్లికి వెళ్లారు. ఈ క్రమంలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మరదలి పెళ్లితో సందడిగా ఉన్న అత్తారిల్లు విషాదంతో నిండిపోయింది.
Also Read: బాత్రూంలో షాక్ కొట్టి చనిపోయిన భర్త.. వెంటనే కుప్పకూలి భార్య కూడా.. కన్నీరు పెట్టించే ఘటన
ఓ వైపు పెళ్ళి ఏర్పాట్లు జరగుతుండగా, మరోవైపు బాత్రూంలో స్నానానికి వెళ్లిన నజీమ్ రజీ గీజర్ షాక్ కొట్టి మరణించాడు. చనిపోయిన భర్తను చూసి షాక్ కు గురై భార్య షాజియా కౌసర్ కూడా కుప్పకూలిపోయింది. జీవితాంతం కలిసుంటామని పెళ్లి ప్రమాణాలతో ఒక్కటైన జంట మరణంలోను కలిసే వెల్లారు. పెళ్లికి వెళ్లిన నజీమ్ కుటుంబం.. విగతజీవులుగా హిందూపురం రావడం ఆ ప్రాంత వాసులను కలిచివేసింది. ముగ్గురు పిల్లలు అనాథలుగా మారిపోయారు. అన్యోన్యంగా సాగే కుటుంబం విధి ఆడిన నాటకానికి బలయిపోయింది. బుధవారం వీరు మరణించగా నిన్న రాత్రికి హిందూపురానికి దంపతులు మృతదేహాలు వచ్చాయి. పలువురు నివాళులు అర్పించి సానుభూతిని తెలియచేశారు. భార్య భర్తల మధ్య చిన్నిచిన్న వివాదాలకే అనేక విడిపోతున్న ఘటనలు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: హైవేపై కుప్పలుతెప్పలుగా కొత్త కరెన్సీ నోట్లు కలకలం.. అవాక్కయిన స్థానికులు, ఏం జరిగిందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి