Nizamabad: హైవేపై కుప్పలుతెప్పలుగా కొత్త కరెన్సీ నోట్లు కలకలం.. అవాక్కయిన స్థానికులు, ఏం జరిగిందంటే..
జాతీయ రహదారిపై తుక్కు నోట్లు చెల్లాచెదురుగా పడిఉండడం చూస్తే వాటిపై నుంచి వాహనాలు వెళ్లడం వల్లే అలా జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
![Nizamabad: హైవేపై కుప్పలుతెప్పలుగా కొత్త కరెన్సీ నోట్లు కలకలం.. అవాక్కయిన స్థానికులు, ఏం జరిగిందంటే.. New currency notes find by locals on nh 44 near nizamabad Nizamabad: హైవేపై కుప్పలుతెప్పలుగా కొత్త కరెన్సీ నోట్లు కలకలం.. అవాక్కయిన స్థానికులు, ఏం జరిగిందంటే..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/17/9f15202ba1c47a8782aec8b5c099dd3f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
నిజామాబాద్ జిల్లాలో కొత్త నోట్లు కుప్పలుకుప్పలుగా పడి ఉండడం కలకలం రేపింది. నోట్లన్నీ తుక్కు తుక్కు కింద చిరిగిపోయి రోడ్డు పక్కన కనిపించాయి. నిజామాబాద్ జిల్లాలోని మెండోరా మండలం బుస్సాపూర్ వద్ద హైదరాబాద్ - నాగ్ పుర్ నేషనల్ హై వే నెంబరు 44పై ఈ నోట్ల కట్టలు చిరిగిపోయిన స్థితిలో కనిపించాయి. బుధవారం చిరిగిన కరెన్సీ నోట్ల తుక్కు కుప్పలుకుప్పలుగా కనిపించడం కలకలం రేపింది. హైవే పై నుంచి వెళ్తున్న ఓ లారీ నుంచి సంచి కింద పడిందని భావిస్తున్నారు. ఇలా సంచి పై నుంచి వాహనాలు వెళ్లడంతో నోట్లన్నీ చిరిగిపోయాయని స్థానికులు అంటున్నారు.
జాతీయ రహదారిపై తుక్కు నోట్లు చెల్లాచెదురుగా పడిఉండడం చూస్తే వాటిపై నుంచి వాహనాలు వెళ్లడం వల్లే అలా జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఆ నోట్లు అసలైనవా? లేక నకిలీ నోట్లా? అనే దానిపై కూడా స్పష్టత లేదు. ఒకవేళ అసలైనవే అయితే మరింత అనుమానాలకు తావిస్తోంది. ఆ డబ్బు ఎవరిది? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజమైన డబ్బు అయితే, లారీలో నుంచి పడిపోయేంత అజాగ్రత్తగా తరలిస్తారా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
Also Read: KTR: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్
నడి రోడ్డుపై చిరిగిపోయిన డబ్బును పెద్ద మొత్తంలో కుప్పలు కుప్పలుగా పడి ఉండడం చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దీనిపై పోలీసులు కూడా స్పందించారు. సాధారణంగా ఆర్‌బీఐ కూడా పాత నోట్లను నాశనం చేసే క్రమంలో రహస్య ప్రదేశంలో కాల్చేస్తుంది తప్ప ఇలా తరలించదని అన్నారు. దీన్నిబట్టి అది నల్లధనమో లేదా నకిలీ నోట్లో అయ్యే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అసలు ఆ నోట్లు ఏ వాహనం నుంచి జారిపడ్డాయో తెలుసుకునేందుకు సీసీటీవీ పుటేజీలు పరిశీలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Also Read: Nizamabad News: గంజాయి స్మగ్లింగ్, చోరీ నియంత్రణే నిజామాబాద్ జిల్లా పోలీసులకు పెద్ద టాస్క్
Also Read: బీజేపీ అధికారంలోకి వస్తే.. 70 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం.. అన్ని కుదిరితే 50కే..
Also Read: బ్రాహ్మణులే అర్చకత్వానికి అర్హులా..? తిరుపతిలో సుబ్రహ్మణ్య స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)