Somu Verraju: బీజేపీ అధికారంలోకి వస్తే.. 70 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తాం.. అన్ని కుదిరితే 50కే
అమరావతిలోనే రాజధాని ఉండాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. అన్నారు. బీజేపీ ఆఫీసు కూడా ఇక్కడే నిర్మిస్తామన్నారు.
కమ్యూనిస్టులు.. దేశానికి పట్టిన చీడ పురుగులు అని సోము వీర్రాజు విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం వైసీపీ, టీడీపీ ఏమీ చేయలేదని విమర్శించారు. తమకు అధికారం ఇస్తే మూడేళ్లలో రాజధాని నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని.. సోము వీర్రాజు స్పష్టం చేశారు. విజయవాడలో బీజేపీ జనాగ్రహ సభలో భాగంగా ఆయన మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజధానిలో రైతుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు. రాజధానిపై ఏడువేల కోట్లు ఖర్చు చేశామన్న వారిని రైతులు నిలదీయాలని సోము వీర్రాజు అన్నారు.
అమరావతిని రాజధానిగా బీజేపీ నమ్మింది. ఇక్కడే రాష్ట్ర కార్యాలయాన్ని నిర్మించాం. ఎయిమ్స్ ను కూడా మంగళగిరిలో నిర్మించాం. అలాగే రాజధాని కోసం వేలకోట్లు ఇచ్చాం. ఇక ఉత్తరాంద్ర, రాయలసీమను అభివృద్ధి చేసే పార్టీ బీజేపీనే. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తాం. ప్రాంతీయ పార్టీలన్నీ కమీషన్లతో కాలక్షేపం చేస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం నిధులిస్తుంటే జగన్,చంద్రబాబు స్టిక్కర్లు వేసి ప్రచారం చేసుకున్నారు. స్కూళ్ల బలోపేతానికి కేంద్రం రూ.4వేల కోట్లు ఇస్తే నాడు-నేడు అంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ లాంటి విద్య అందాలనే లక్ష్యంతో విద్యావిధానాన్ని బీజేపీ ప్రభుత్వమే అమల్లోకి తెచ్చింది.
- సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
'వైసీపీ ప్రభుత్వం రూ.3రూపాయల మద్యాన్ని రూ.25 రూపాయలకు కొని రూ.250కి విక్రయిస్తున్నారు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్ పేరుతో చెత్త బ్రాండ్లను తీసుకొచ్చి అమ్మేస్తున్నారు. బీజేపీకి ఓటు వేస్తే రూ.70 చీప్ లిక్కర్ ఇస్తాం.. ఆదాయం బాగుంటే రూ.50కే ఇస్తాం. మద్యం రూపంలో ప్రజలను దోచి మళ్లీ వారికే ఇస్తున్నారు. ప్రజల కోరికను తీర్చే సత్తా బీజేపీకే ఉంది.' అని సోము వీర్రాజు అన్నారు.
Also Read: ఏపీలో సన్ ఫార్మా పెట్టుబడులు... సీఎం జగన్ తో సన్ ఫార్మా ఎండీ దిలీప్ షాంఘ్వీ భేటీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి