Sun Pharma In AP: ఏపీలో సన్ ఫార్మా పెట్టుబడులు... సీఎం జగన్ తో సన్ ఫార్మా ఎండీ దిలీప్ షాంఘ్వీ భేటీ
ఏపీలో ఔషధ దిగ్గజ కంపెనీ సన్ ఫార్మా ప్లాంట్ ను ఏర్పాటుచేయనుంది. సీఎం జగన్ తో సన్ ఫార్మా ఎండీ షాంఘ్వీ మంగళవారం భేటీ అయ్యారు. ఎగుమతుల లక్ష్యంగా ఉత్పత్తులు చేపడతామన్నారు.
![Sun Pharma In AP: ఏపీలో సన్ ఫార్మా పెట్టుబడులు... సీఎం జగన్ తో సన్ ఫార్మా ఎండీ దిలీప్ షాంఘ్వీ భేటీ AP Cm Jagan sun pharma md Dileep Sanghvi meet sun pharma plant in state Sun Pharma In AP: ఏపీలో సన్ ఫార్మా పెట్టుబడులు... సీఎం జగన్ తో సన్ ఫార్మా ఎండీ దిలీప్ షాంఘ్వీ భేటీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/28/d5bf8282f4fd82bb1abff969761387e9_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ర్మా రంగంలో దిగ్గజ కంపెనీల్లో ఒకటైన సన్ ఫార్మా ఏపీలో తయారీ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఇంటిగ్రేటెడ్ ఎండ్ టూ ఎండ్ ప్లాంట్‌గా ఈ ప్లాంట్ ను తీసుకొస్తామని, ఎగుమతుల లక్ష్యంగా ఉత్పత్తులు ఉంటాయని కంపెనీ ఎండీ దిలీప్ షాంఘ్వీ వెల్లడించారు. మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌ను సన్ ఫార్మా ఎండీ దిలీప్ షాంఘ్వీ కలుసుకున్నారు. రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ రంగం ప్రగతి, సన్ ఫార్మా తయారీ యూనిట్‌ను నెలకొల్పడంపై ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. పారిశ్రామిక ప్రగతి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం సన్ ఫార్మా ప్రతినిధులకు వివరించారు. అవకాశాలను వినియోగించుకోవాలని, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం ఆహ్వానించారు. రాష్ట్రాభివృద్ధి చర్యలను సీఎం జగన్ వివరించారు. పరిశ్రమలకు అత్యంత పారదర్శక విధానాలు అందుబాటులో ఉన్నాయని, నైపుణ్యాభివృద్ధిని పెంచడంద్వారా నాణ్యమైన మానవనరులను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత దిలీప్ షాంఘ్వీ మాట్లాడారు.
Also Read: ఏపీలో కొత్తగా 141 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఇద్దరు మృతి
పర్యావరణహిత విధానాలపై సీఎం ప్రత్యేక దృష్టి : సన్ ఫార్మా ఎండీ దిలీప్ షాంఘ్వీ
ఏపీ సీఎం జగన్ ను కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని సన్ ఫార్మా ఎండీ దిలీప్ షాంఘ్వీ ఉందన్నారు. షాంఘ్వీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, ఎదుర్కొంటున్న సవాళ్లపై సీఎం జగన్ కు పూర్తిగా అవగాహన ఉందన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి అన్నది ఆయన విధానంగా స్పష్టమవుతోందన్నారు. పర్యావరణహిత విధానాలపై సీఎం ప్రత్యేక దృష్టితో ఉన్నారన్నారు. సాంకేతికతను బాగా వినియోగించుకుని అత్యంత సమర్థత ఉన్న మానవనవరులను తయారు చేయడం ద్వారా ప్రజల ఆదాయాలను గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఉన్నారన్నారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారా కొత్త ఉద్యోగాల కల్పన దిశగా ఆయన ముందడుగు వేస్తున్నారన్నారు. తమ కంపెనీ తరఫున తాము కూడా దీనిపై గట్టి ప్రయత్నం చేస్తామన్నారు. సన్ ఫార్మా తరఫున ఒక పరిశ్రమను నెలకొల్పుతామన్నారు. తద్వారా తయారీ సామర్థ్యాన్ని పెంచుకుంటామని, కొత్త పరిశ్రమను విజయవంతంగా ఏర్పాటు చేయడానికి అధికారులతో సంప్రదింపులు కొనసాగుతాయని వెల్లడించారు. పరిశ్రమలకు చక్కటి ఔషధ రంగంలో ఆలోచనలను ఆయనతో పంచుకున్నామని, ఇంటిగ్రేటెడ్ తయారీ యూనిట్‌పై మాట్లాడుకున్నామన్నారు. ఏపీ నుంచి ఔషధాలను ఎగుమతి చేయాలన్నది తమ లక్ష్యాల్లో భాగమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో సన్ ఫార్మా కంపెనీ ప్రతినిధులు విజయ్ పారెఖ్, సౌరభ్ బోరా, విద్యాసాగర్ పాల్గొన్నారు.
Also Read: AP BJP : బెయిల్‌పై ఉన్న నేతలు జైలుకెళ్లడం ఖాయం... ప్రజాగ్రహ సభలో ప్రకాష్ జవదేకర్ జోస్యం !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)