Corona Updates: ఏపీలో కొత్తగా 141 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఇద్దరు మృతి

ఏపీలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా.. 141 కేసులు నమోదయ్యాయి.

FOLLOW US: 

ఆంధ్రప్రదేశ్ లో.. కొత్తగా.. 30,752 శాంపిల్స్ పరీక్షంచగా.. 141 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. గడచిన 24 గంటల్లో 165 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు.. మొత్తం 20,73,792 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20,58,227 మంది డిశ్ఛార్జి అయ్యారు. మెుత్తం.. 14,492 మంది వైరస్ కారణంగా మరణించారు. ప్రస్తుతం 1,073 చికిత్స పొందుతున్నారు.

60 ఏళ్లు పైబడిన వారు డాక్టర్ నుంచి మెడికల్ సర్టిఫికేట్ లేకుండా ప్రికాషన్ డోస్(ముందు జాగ్రత్త మోతాదు) పొందవచ్చని కేంద్రం స్పష్టం చేసింది అయితే.. వారు  డోస్ తీసుకునే ముందు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని చెప్పింది. '60 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు, సహ-అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు.. ప్రికాషన్ డోస్ కోసం.. డాక్టర్ నుంచి ఏదైనా ధృవీకరణ పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఏదైనా సమస్యగా అనిపిస్తే.. వైద్యుడి సంప్రదించండి.' అని ఆరోగ్య కార్యదర్శి రాకేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు.

ఎలక్షన్ డ్యూటీ కోసం వెళ్లేవారు.. ఫ్రంట్ లైన్ వారియర్స్ కిందకు వస్తారని రాకేష్ భూషణ్ చెప్పారు. వాళ్లు ప్రికాషన్ డోసు తీసుకోవాలన్నారు. రెండో డోస్ ఎప్పుడు తీసుకున్నారనే దాని ఆధారంగా ప్రికాషన్.. డోస్‌కు అర్హత ఉంటుందని  వెల్లడించారు. రెండో డోస్ తర్వాత తొమ్మిది నెలల తర్వాత మాత్రమే వ్యాక్సిన్ వేసుకోవాలని పేర్కొన్నారు.

డిసెంబరు 25న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి జాతినుద్దేశించి మాట్లాడారు.  2022 జనవరి 10 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లతోపాటు.. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోస్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పెరుగుతున్న నేపథ్యంలో..  ప్రధాని ఈ ప్రకటన చేశారు. వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు ఉంటుందని తెలిపారు. అయితే ఆ సమయంలో..  వైద్యుడి వద్ద సర్టిఫికెట్ తీసుకురావాలనే ఆలోచన ఉండేది.. అయితే తాజాగా కేంద్రం ప్రికాషన్ డోసుకు ఎలాంటి సర్టిఫికెట్ అవసరం లేదని చెప్పింది. 

Also Read: AP BJP : బెయిల్‌పై ఉన్న నేతలు జైలుకెళ్లడం ఖాయం... ప్రజాగ్రహ సభలో ప్రకాష్ జవదేకర్ జోస్యం !

Also Read: CJI NV Ramana: తెలుగు ప్రజల ఆశీర్వాద బలం వల్లే ఈ స్థాయికి... ఏపీ పర్యటన చాలా సంతోషానిచ్చింది... సీజేఐ బహిరంగ లేఖ

Also Read: Hindupuram Balakrishna : హిందూపురంలో డంపింగ్ యార్డ్ వివాదం.. బాలకృష్ణ ఇంటి ముట్టడితో ఉద్రిక్తత!

Published at : 28 Dec 2021 06:08 PM (IST) Tags: ap corona cases New Corona Cases Covid updates omicron cases ap latest covid updates

సంబంధిత కథనాలు

Petrol-Diesel Price, 25 May: వాహనదారులకు శుభవార్త! నేడు దిగివచ్చిన పెట్రోల్ ధరలు, ఈ సిటీలో మాత్రం స్థిరం

Petrol-Diesel Price, 25 May: వాహనదారులకు శుభవార్త! నేడు దిగివచ్చిన పెట్రోల్ ధరలు, ఈ సిటీలో మాత్రం స్థిరం

Gold-Silver Price: నేడు మళ్లీ పసిడి ధర షాక్! ఊహించనట్లుగా పెరిగిన బంగారం, వెండి మాత్రం కిందికి

Gold-Silver Price: నేడు మళ్లీ పసిడి ధర షాక్! ఊహించనట్లుగా పెరిగిన బంగారం, వెండి మాత్రం కిందికి

Bharat Bandh : సీపీఎస్‌ రద్దు, కుల ఆధారిత జనాభా గణన డిమాండ్‌తో భారత్ బంద్

Bharat Bandh : సీపీఎస్‌ రద్దు, కుల ఆధారిత జనాభా గణన డిమాండ్‌తో భారత్ బంద్

Konaseema Curfew : బుధవవారం నుంచి కోనసీమలో కర్ఫ్యూ - కీలక నిర్ణయం తీసుకున్న పోలీసులు

Konaseema Curfew :  బుధవవారం నుంచి కోనసీమలో కర్ఫ్యూ - కీలక నిర్ణయం తీసుకున్న పోలీసులు

Konseema Protest Live Updates: కోనసీమ జిల్లా అంతటా కర్ఫ్యూ- ఆందోళనతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త

Konseema Protest Live Updates: కోనసీమ జిల్లా అంతటా కర్ఫ్యూ- ఆందోళనతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

GT vs RR, Qualifier 1 Highlights: మిల్లర్‌ 'కిల్లర్‌' విధ్వంసం, ఫైనల్‌కు GT - RRకు మరో ఛాన్స్‌

GT vs RR, Qualifier 1 Highlights: మిల్లర్‌ 'కిల్లర్‌' విధ్వంసం, ఫైనల్‌కు GT - RRకు మరో ఛాన్స్‌

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !