News
News
X

Hindupuram Balakrishna : హిందూపురంలో డంపింగ్ యార్డ్ వివాదం.. బాలకృష్ణ ఇంటి ముట్టడితో ఉద్రిక్తత!

హిందూపురంలో బాలకృష్ణ ఇంటిని వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు ముట్టడించడం ఉద్రిక్తతకు దారి తీసింది., డంపింగ్ యార్డ్ వివాదంలో ఓ టీడీపీ కార్యకర్త సోషల్ మీడియాలో పెట్టిన పోస్టుపై వివాదం జరుగుతోంది.

FOLLOW US: 
 
హిందూపురంలో  ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముట్టడికి వైఎస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. హఠాత్తుగా కొంత మంది వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు బాలకృష్ణ ఇంటి మీదకు వచ్చారు. ఎందుకు వచ్చారో టీడీపీ కార్యకర్తలు తెలుసుకునే లోపే ముట్టడికి ప్రయత్నించారు. వారిని టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు వచ్చే లోపు అక్కడ తోపులాట జరిగింది. ఈ వివాదం అంతా ఓ డంపింగ్ యార్డ్‌కు సంబంధించి జరిగింది.

Also Read: ప్రజల వద్దకే నేరుగా పథకాలు.. సీఎం జగన్ వెల్లడి, తాజాగా వారి అకౌంట్లలోకి 703 కోట్లు

 హిందూపురంలో కొద్ది రోజులుగా డంపింగ్ యార్డ్ నిర్మాణానికి సంబంధించి  వివాదం నడుస్తోంది.   11th 12th వార్డ్ సంబదించి ఖాళీగా ఉన్న మునిసిపల్ స్థలంలో డంపింగ్ యార్డ్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయాన్ని టీడీపీతో పాటు స్థానిక ప్రజలు కూడా తిరస్కరించారు. ఇళ్ల మధ్య డంపింగ్ యార్డ్ నిర్మించడం ఏమిటని ఆందోళనలు  చేస్తున్నారు.  డంపింగ్ యార్డ్ నిర్మాణానికి జరుగుతున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు.  ప్రజల ఆరోగ్యాన్ని ద్రుష్టి లో ఉంచుకుని ఈ డంపింగ్ యార్డ్ ను రద్దు చేసి ఊరికి చివర్లో నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. 

News Reels

Also Read: భారతీయ జగన్ పార్టీగా బీజేపీ, ఆ సభ కూడా అలాంటిదే.. పయ్యావుల సంచలన వ్యాఖ్యలు

మరో వైపు ప్రజల ఆందోళలనకు టీడీపీ మద్దతు పలికిలింది. ఇళ్ల మధ్య ఉన్న స్థలంలో పార్క్ లేదా సచివాలయం లేకపోతే.. స్కూల్ నిర్మించాలని.. డంపింగ్ యార్డ్ వద్దంటున్నారు.  టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఊరికి చివరిగాఉండేలా  డంపింగ్ యార్డ్ స్థలాన్ని ఎమ్మెల్యే బాలకృష్ణ సిద్ధం చేశారని అంటున్నారు. ఈ అంశంపై అటు టీడీపీ, ఇటు వైసీపీ వర్గాల మధ్య విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో  తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ కార్యకర్త పెట్టిన సోషల్ మీడియా  పోస్ట్ వివాదానికి కారణం అయింది. అభివృద్ధిపై చర్చకు సిద్దమని రెండు వర్గాలు సవాల్ చేసుకోవడంతో పరిస్థితి చేయిదాటి పోయింది.

Also Read: Movie Ticket Rates Issue: టికెట్ రేట్స్ ఇష్యూ... ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీలో సభ్యులు వీరే!

డంపింగ్ యార్డ్ విషయంలో వైఎస్ఆర్‌సీపీ తప్పు చేస్తోందని పెట్టిన పోస్ట్ వివాదాస్పదం కావడంతో వైఎస్ఆర్‌సీపీ వర్గీయులు బాలకృష్ణ ఇంటి ముట్టడికి వచ్చారు. అయితే వైఎస్ఆర్‌సీపీలో ఉన్న రెండు వర్గాలు ఎప్పటికప్పుడు బలప్రదర్శన చేసుకోవడం కోసం ఇలాంటి లేని పోని వివాదాల్ని సృష్టిస్తున్నారని టీడీపీ వర్గాలంటున్నాయి. ఊరికి చివరికి డంపింగ్ యార్డ్ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 28 Dec 2021 01:37 PM (IST) Tags: Balakrishna Anantapur hindupuram Hindupuram dumping yard Hindupuram clash Balakrishna house siege

సంబంధిత కథనాలు

JD Waiting For Party :  విశాఖ నుంచి పోటీ ఖాయం - సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏ పార్టీలోకి ?

JD Waiting For Party : విశాఖ నుంచి పోటీ ఖాయం - సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఏ పార్టీలోకి ?

Breaking News Live Telugu Updates: కాకినాడలో భారీ బ్లాస్టింగ్, భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి

Breaking News Live Telugu Updates: కాకినాడలో భారీ బ్లాస్టింగ్, భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి

Hyderabad Woman Suicide: ఆ వీడియోలు ఎక్కువగా చూడొద్దని చెప్పిన భర్త - భవనం పైనుంచి దూకిన నవ వధువు

Hyderabad Woman Suicide: ఆ వీడియోలు ఎక్కువగా చూడొద్దని చెప్పిన భర్త - భవనం పైనుంచి దూకిన నవ వధువు

Rythu Bazar Employees: రైతు బజార్ల సిబ్బందికి సీఎం జగన్ గుడ్ న్యూస్!

Rythu Bazar Employees: రైతు బజార్ల సిబ్బందికి సీఎం జగన్ గుడ్ న్యూస్!

Duvvada Train Incident: శశికళ మృతికి కారణం ఎవరు? ఆ తల్లిదండ్రులను ఓదార్చేదెవరు?

Duvvada Train Incident: శశికళ మృతికి కారణం ఎవరు? ఆ తల్లిదండ్రులను ఓదార్చేదెవరు?

టాప్ స్టోరీస్

CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్‌, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్

CM KCR Speech: పవర్ ఐల్యాండ్‌గా హైదరాబాద్‌, న్యూయార్క్‌లో కరెంటు పోవచ్చేమో! ఇక్కడ అస్సలు పోదు: కేసీఆర్

షర్మిల పాదయాత్రకు నో పర్మిషన్- తేల్చి చెప్పిన వరంగల్ పోలీసులు

షర్మిల పాదయాత్రకు నో పర్మిషన్- తేల్చి చెప్పిన వరంగల్ పోలీసులు

Sonu Sood New Car: సోనూసూద్ గ్యారేజీలోకి మరో లగ్జరీ కారు, కాస్ట్ ఎంతో తెలుసా?

Sonu Sood New Car: సోనూసూద్ గ్యారేజీలోకి మరో లగ్జరీ కారు, కాస్ట్ ఎంతో తెలుసా?

Himachal Congress Meet: హిమాచల్ సీఎం పీఠంపై ఇంకా వీడని చిక్కుముడి, షిమ్లాలో ఎమ్మెల్యేల మీటింగ్

Himachal Congress Meet: హిమాచల్ సీఎం పీఠంపై ఇంకా వీడని చిక్కుముడి, షిమ్లాలో ఎమ్మెల్యేల మీటింగ్