By: ABP Desam | Updated at : 28 Dec 2021 05:02 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
సీజేఐ జస్టిస్ ఎన్.వి. రమణ(ఫైల్ ఫొటో)
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవల ఏపీలో పర్యటించారు. సీజేఐ నియమితులైన తర్వాత తొలిసారి ఆయన స్వగ్రామానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన తనపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్, రాష్ట్ర ప్రజలు చూపిన ప్రేమాభిమానాలపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ఆతిథ్యం ఇచ్చిన గవర్నర్, రాష్ట్ర ప్రభుత్వానికి, తేనీటి విందుకు హాజరైన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తన పర్యటన సజావుగా సాగేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపిన సీఎం, మంత్రులకు, అధికారులకు, పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read: రాజ్ భవన్ లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు గవర్నర్ తేనీటి విందు... హాజరైన సీఎం జగన్ దంపతులు
తెలుగు ప్రజల ఆశీర్వాదం బలమే
తెలుగు ప్రజల ఆశీర్వాద బలం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఏపీ పర్యటన అనంతరం ఆయన బహిరంగ లేఖ రాశారు. సమయం లేకపోవడంతో చాలా మందిని కలవలేకపోయానని, అందరినీ కలిసే అవకాశం త్వరలోనే వస్తుందని జస్టిస్ రమణ అన్నారు. తన స్వగ్రామం పొన్నవరానికి వెళ్లాలని చాలా రోజులుగా అనుకుంటున్నానని, ఇన్నాళ్లకు అది సాధ్యమైందని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు శీతాకాలపు సెలవులు కారణంగా రాష్ట్ర పర్యటనకు అవకాశం కలిగిందన్నారు. ఏపీలో అడుగు పెట్టినప్పటి నుంచీ ప్రజలు ఎంతో అభిమానంగా చూసుకున్నారని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. పొన్నవరం పొలిమేరల నుంచి ఊరేగింపుతో తీసుకెళ్లిన ఘటనను ఎన్నడూ మరిచిపోనని సీజేఐ అన్నారు.
Also Read: సీజేఐ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం తేనీటి విందు.. ప్రోటోకాల్ ప్రకారం స్వయంగా ఆహ్వానించిన సీఎం జగన్ !
కుటుంబంతో స్వగ్రామానికి రావడం ఎంతో ఆనందం
తన కుంటుంబానికి మరోసారి తన స్వగ్రామాన్ని చూపించగలగడం ఎంతో ఆనందంగా ఉందని సీజేఐ ఎన్వీ రమణ అన్నారు. ఎంతో మంది ఆప్తులను ఈ పర్యటనలో కలుసుకున్నానని, ఎన్నో రంగాలకు చెందిన వారు పలకరించేందుకు వచ్చారన్నారు. బెజవాడ బార్ అసోసియేషన్, ఏపీ హైకోర్టు బార్ అసోసియేషన్, ఏపీ బార్ కౌన్సిల్, హైకోర్టు ఉద్యోగుల సంఘం, రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ అతితక్కువ కాలంలో అసాధారణ ఏర్పాట్లతో సత్కారాలతో ముంచెత్తారని గుర్తుచేశారు. ఈ పర్యటనలో పాల్గొన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, ఏపీ, తెలంగాణ ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రోటోకాల్ సిబ్బంది, పోలీసులు, రాజ్‌భవన్ సిబ్బంది, అధికార యంత్రాంగానికి సీజేఐ కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: నాడు ఫిర్యాదులు.. నేడు అత్యంత గౌరవం.. ! సీజేఐ ఎన్వీ రమణ విషయంలో సీఎం జగన్ మనసు మారిందా ?
Top Headlines Today: బాలకృష్ణకు స్పీకర్ హెచ్చరిక; బస్సు యాత్రకు కోమటిరెడ్డి రెడీ - నేటి టాప్ న్యూస్
AP Assembly Session: సినిమా కళాకారులను వైసీపీ ఎమ్మెల్యేలు అవమానించారు- అందుకే అలా రియాక్ట్ అయ్యాను: బాలకృష్ణ
Ayyanna : జనసేనతో పొత్తు కోసం త్యాగానికి రెడీ - పోలీసుల తీరుపై అయ్యన్న కీలక వ్యాఖ్యలు !
రాజమండ్రి సెంట్రల్ జైల్లో టైఫాయిడ్‌తో రిమాండ్ ఖైదీ మృతి- చంద్రబాబు భద్రతపై లోకేష్ అనుమానం
JNV: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!
TSRTC Dasara Offer: దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ - 10 శాతం రాయితీ
Kalki 2898 AD Movie: షేర్ చేస్తే చర్యలే, లీకు వీరులకు వైజయంతి మూవీస్ సీరియస్ వార్నింగ్
Akhil Mishra Death : హైదరాబాద్‌లో ప్రమాదవశాత్తూ బాలీవుడ్ యాక్టర్ మృతి
కెనడాలోని హిందువులంతా జాగ్రత్త, దాడులు జరిగే ప్రమాదముంది - కెనడా ఎంపీ హెచ్చరికలు
/body>