Anantapur: బాత్రూంలో షాక్ కొట్టి చనిపోయిన భర్త.. వెంటనే కుప్పకూలి భార్య కూడా.. కన్నీరు పెట్టించే ఘటన
చిన్నచిన్న సంఘటలనకే విడిపోతున్న బార్యభర్తలను చూస్తున్నాం. కానీ పెళ్ళి ప్రమాణాలతో ఒక్కటైన జంట మరణంలోను కలిసి వెళ్లడం విషాదాన్ని నింపింది.
కొంత మంది భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎంత దారుణంగా దెబ్బతింటున్నాయో అందరికి తెలిసిందే. చిన్న చిన్న మనస్పర్దలకే కాపురాలు కుప్పకూలిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ రోజుల్లో కూడా భార్యాభర్తల మధ్య సంబందాలు ఎంత బలంగా ఉన్నాయో చాటే సంఘటన హిందూపురంలో జరిగింది. భర్త లేకపోతే తాను కూడా బతకలేను అని రోదిస్తూ ఆయన మృతదేహం ముందే భార్య కుప్పకూలి పోయింది. ఈ హృదయ విదార ఘటన చూసి స్థానికుల కంట్లోనూ నీళ్లు తిరిగాయి.
హిందూపురంలోని శాంతినగర్ కు చెందిన నజీమ్ రజీ(36) జనరేటర్ మరమ్మత్తులు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. నజీమ్‌కు పదమూడేళ్ల క్రితం షాజియా కౌసర్ (29)తో వివాహం అయింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకరికి 13 ఏళ్లు కాగా, ఇంకొకరికి మూడేళ్లు. మరో కుమార్తెకు ఏడేళ్లు. అన్యోన్యంగా సాగే ఈ కుటుంబం ప్రస్తుతం విషాదంలో మునిగిపోయింది. ఐతే గత నాలుగురోజుల క్రితం కర్ణాటకలోనే దావణగెరె జిల్లా చెన్నగిరికి తన మరదలి పెళ్లికి వెళ్లారు. ఈ క్రమంలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. మరదలి పెళ్ళితో సందడిగా ఉన్న అత్తారిల్లు విషాదంతో నిండిపోయింది.
ఓ వైపు పెళ్ళి ఏర్పాట్లు జరగుతుండగా, మరోవైపు బాత్రూంలో స్నానానికి వెళ్లిన నజీమ్ రజీ గీజర్ షాక్ కొట్టి మరణించాడు. చనిపోయిన భర్తను చూసి షాక్ కు గురై భార్య షాజియా కౌసర్ కూడా కుప్పకూలిపోయింది. జీవితాంతం కలిసుంటామని పెళ్లి ప్రమాణాలతో ఒక్కటైన జంట మరణంలోను కలిసే వెల్లారు. పెళ్లికి వెళ్లిన నజీమ్ కుటుంబం.. విగతజీవులుగా హిందూపురం రావడం ఆ ప్రాంత వాసులను కలిచివేసింది. ముగ్గురు పిల్లలు అనాథలుగా మారిపోయారు. అన్యోన్యంగా సాగే కుటుంబం విధి ఆడిన నాటకానికి బలయిపోయింది.
బుధవారం వీరు మరణించగా నిన్న రాత్రికి హిందూపురానికి దంపతులు మృతదేహాలు వచ్చాయి. పలువురు నివాళులు అర్పించి సానుభూతిని తెలియచేశారు. భార్య భర్తల మధ్య చిన్నిచిన్న వివాదాలకే అనేక విడిపోతున్న ఘటనలు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో ఈ ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది.
Also Read: Hyderabad: మీరు అపార్ట్‌మెంట్లలో ఉంటారా? ఈ సౌకర్యం ఫ్రీగా పొందండి.. ఇంకా రెండు రోజులే ఛాన్స్
Also Read: KTR: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి