News
News
X

Hyderabad: మీరు అపార్ట్‌మెంట్లలో ఉంటారా? ఈ సౌకర్యం ఫ్రీగా పొందండి.. ఇంకా రెండు రోజులే ఛాన్స్

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఫ్రీ మంచి నీటి సరఫరా అని వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే.

FOLLOW US: 
 
హైదరాబాద్‌లో ఉచిత మంచినీటి సరఫరా పొందాలనుకొనే అపార్ట్ మెంట్ వాసులు దరఖాస్తు చేసుకొనేందుకు ఇంకా రెండు రోజులే గడువు ఉంది. వీరు ఇంకా ఉచిత తాగునీటి పథకం కోసం నమోదు చేసుకోకపోతే త్వరపడాల్సిన సమయం ఇది. ఒక అపార్ట్‌మెంట్ సముదాయంలోని మొత్తం ఫ్లాట్లలో 50 నుంచి 60 శాతం మంది ఫ్లాట్ ఓనర్లు నమోదు చేసుకున్నా.. ఆ అపార్ట్‌మెంట్‌కు ఫ్రీగా తాగునీటి సౌకర్యం పొందే వెసులుబాటు ఉండనుంది. ఇందుకు దరఖాస్తు చేసుకోని వారు దరఖాస్తు చేసుకొనేందుకు ఈ నెలఖరు వరకూ గడువు ఇచ్చారు. ఆ గడువు డిసెంబరు 31తో ముగియనుంది. అంతేకాక, వెంటనే కుళాయి వినియోగదారుడి సంఖ్య (క్యాన్‌), ఆధార్‌ నంబరుతో అనుసంధానం చేసుకోవాలని అధికారులు గతంలో నిబంధన విధించిన సంగతి తెలిసిందే. వివిధ కారణాలతో ఇప్పటికీ అనుసంధానం చేసుకోని ఫ్లాట్ల యజమానులకు ఇది ఒక మంచి అవకాశం అని అధికారులు చెబుతున్నారు.

అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల యజమానులు తమ ఇంటిని అద్దెకు ఇచ్చి అద్దెతోపాటు నీటి ఛార్జీలు విడిగా నెల నెలా వసూలు చేస్తుంటారు. ఇలాంటి విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. యజమానితో సంబంధం లేకుండా అద్దెకు ఉంటున్న వారు తమ ఆధార్‌ కార్డుతో అనుసంధానమైతే ఆ ఇంటికి ఉచిత నీటిని పొందే వీలు ఉండనుంది. ఆధార్‌ అనుసంధానం చేసినా ఆ వ్యక్తికి ఇంటిపై హక్కులు ఉండబోవని అధికారులు స్పష్టం చేశారు.

Also Read: KTR: కొంప ముంచుతున్న సోము వీర్రాజు వ్యాఖ్యలు.. దేశమంతా వైరల్, కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్

హైదరాబాద్‌లో ఉచిత మంచి నీటి పథకం కింద లబ్ధిపొందే నల్లాలు 9,84,023 ఉన్నాయి. వీటిలో ఆధార్‌తో అనుసంధానమైనవి 4,91,000. ఇంకా అనుసంధానం కావాల్సినవి.. 4,93,023గా ఉన్నాయని అధికారులు తెలిపారు.

News Reels

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఫ్రీ మంచి నీటి సరఫరా అని వరాల జల్లు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ పథకం గత డిసెంబరులోనే అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గృహ వినియోగదారులకు నెలకు 20 వేల లీటర్ల మంచి నీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నారు.

Also Read: Nizamabad: హైవేపై కుప్పలుతెప్పలుగా కొత్త కరెన్సీ నోట్లు కలకలం.. అవాక్కయిన స్థానికులు, ఏం జరిగిందంటే..

Also Read: హైదరాబాద్‌లో న్యూ ఇయర్ వేడుకలు చేసుకుంటున్నారా ? ఇదిగో ఈ రూల్స్ అన్నింటినీ గుర్తు పెట్టుకోండి..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 30 Dec 2021 09:31 AM (IST) Tags: Hyderabad News water supply in hyderabad hyderabad free water scheme hyderabad Apartments

సంబంధిత కథనాలు

రాజ్ భవన్ కు చేరిన షర్మిల పంచాయితీ,  రియాక్షన్‌ ఎలా ఉంటుంది?

రాజ్ భవన్ కు చేరిన షర్మిల పంచాయితీ, రియాక్షన్‌ ఎలా ఉంటుంది?

Petrol-Diesel Price, 2 December 2022: పెట్రోల్ డీజిల్ ధరల్లో భారీ మార్పులు- మీ ప్రాంతంలో రేట్లు ఇవే!

Petrol-Diesel Price, 2 December 2022: పెట్రోల్ డీజిల్ ధరల్లో భారీ మార్పులు- మీ ప్రాంతంలో రేట్లు ఇవే!

Gold-Silver Price 2 December 2022: 54 వేలు దాటేసిన పసిడి- తెలుగు రాష్ట్రాల్లోనే కాస్త బెటర్‌!

Gold-Silver Price 2 December 2022: 54 వేలు దాటేసిన పసిడి- తెలుగు రాష్ట్రాల్లోనే కాస్త బెటర్‌!

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

Nagole Gun Fire : నాగోల్ బంగారం షాపులో కాల్పులు, యాజమానిని బెదిరించి గోల్డ్ తో పరారీ!

TJS Kodandaram : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో సంచలనం, సింహయాజీని కలిసిన కోదండరామ్!

TJS Kodandaram : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో సంచలనం, సింహయాజీని కలిసిన కోదండరామ్!

టాప్ స్టోరీస్

Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

Vadhandhi Review: వదంది రివ్యూ: అమెజాన్ ప్రైమ్‌లో కొత్త థ్రిల్లర్ వెబ్ సిరీస్ - థ్రిల్ చేసిందా? బోర్ కొట్టించిందా?

Matti Kusthi Review - 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే? 

Matti Kusthi Review - 'మట్టి కుస్తీ' రివ్యూ : భార్యాభర్తలు ఇంట్లో కాకుండా మట్టిలో కుస్తీ పోటీకి రెడీ అయితే? 

Why Petro Rates No Change : క్రూడాయిల్ ధరలు పతనం - కానీ ప్రజలకు దక్కని ఫలితం ! పిండుకోవడమే కేంద్రం పనిగా పెట్టుకుందా ?

Why Petro Rates No Change : క్రూడాయిల్ ధరలు పతనం - కానీ ప్రజలకు దక్కని ఫలితం ! పిండుకోవడమే కేంద్రం పనిగా పెట్టుకుందా ?

TSPSC Group 4 Notification: తెలంగాణలో 'గ్రూప్-4' నోటిఫికేషన్ విడుదల, 9168 ఉద్యోగాల భర్తీ! దరఖాస్తు ఎప్పుడంటే?

TSPSC Group 4 Notification: తెలంగాణలో 'గ్రూప్-4' నోటిఫికేషన్ విడుదల, 9168 ఉద్యోగాల భర్తీ! దరఖాస్తు ఎప్పుడంటే?