(Source: ECI/ABP News/ABP Majha)
Haryana Crime: ఫ్యామిలీనే చంపేసిన ముద్దుల కొడుకు, హోటల్ రూంలో ఫ్రెండుతో.. ఈ ‘గే’ కథ ఘోరం!
హర్యానాలోని రోహ్‌తక్‌కు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి ప్రదీప్ మలిక్. ఇతని కుమారుడు అభిషేక్. ఈయన స్వలింగ సంపర్కానికి అలవాటుపడ్డాడు.
హర్యానాలో ఓ స్వలింగ సంపర్కుడు దారుణానికి ఒడిగట్టాడు. తాను అమ్మాయిగా మారేందుకు కుటుంబం సహకరించలేదనే అక్కసుతో ఏకంగా వారందరినీ చంపేశాడు. ఆగస్టు 27న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. పూర్తి వివరాలివీ..
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హర్యానాలోని రోహ్‌తక్‌కు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి ప్రదీప్ మలిక్. ఇతని కుమారుడు అభిషేక్. ఈయన స్వలింగ సంపర్కానికి అలవాటుపడ్డాడు. తన క్లాస్ మేట్ అయిన యువకుడితోనే అభిషేక్ స్వలింగ సంపర్క భాగస్వామిగా చేసుకున్నాడు. ఈ క్రమంలో లింగ మార్పిడి కూడా చేయించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ డబ్బు కోసం కుటుంబాన్ని అడగ్గా.. వారు ససేమిరా అన్నారు. దీంతో అందర్నీ చంపేశారు.
Also Read: WhatsApp Status: వాట్సాప్ ఎంత పని చేసింది.. జర చూస్కోవాలి కదా బ్రో.. స్టేటస్ తో బయటకొచ్చిన అసలు కథ!
ఇందుకోసం ఆగస్టు 27న ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన అతను తన చెల్లెల్ని తన రూంకు పిలిచాడు. వెంటనే ఆమెను తన తండ్రి తుపాకీతో కాల్చి చంపేశాడు. ఆ తర్వాత తన అమ్మను రూంలోకి పిలిచి ఆమెను కూడా చంపేశాడు. ఆ తర్వాత తల్లిదండ్రులను కూడా తుపాకీతో కాల్చి చంపేశాడు. అనంతరం తన భాగస్వామిని కలిసేందుకు హోటల్‌కు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్లుగా షాక్ అవుతూ.. తన ఫ్యామిటీ రక్తపు మడుగులో ఉందంటూ స్థానికులను పిలిచి నటించాడు. పోలీసులు తమదైన శైలిలో విచారణ జరపగా.. అసలు నిజం వెలుగులోకి వచ్చింది.
Also Read: Hyderabad Fake Baba: పరీక్షలో పాస్ కావాలంటే 'కాల భైరవ పూజ' చేస్తాడట.. రూ.80 వేలు సమర్పయామి
ఈ కేసు గురించి ఓ సీనియర్ పోలీసు అధికారి మాట్లాడుతూ.. అభిషేక్ మాత్రమే తన ఫ్యామిలీ మొత్తాన్ని చంపినట్లు తెలిపారు. తన స్వలింగ సంపర్క భాగస్వామి కోసమే అతను ఈ దారుణం చేసినట్లుగా భావిస్తున్నట్లు వెల్లడించారు. చంపిన అనంతరం నిందితుడు వారిపై ఉన్న బంగారు ఆభరణాలను అభిషేక్ దొంగిలించినట్లుగా వివరించారు. ఈ కేసులో ఆగస్టు 31న పోలీసులు అభిషేక్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Also Read: Telangana Inter: ఇంటర్మీడియట్ అకడమిక్ క్యాలెండర్ ఖరారు.. పరీక్షలు, సెలవులు ఈ తేదీల్లో..
Also Read: Hyderabad Rains: త్వరగా ఇళ్లకు వెళ్లిపోండి.. హైదరాబాద్ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక..
Also Read: Khammam: ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ‘సన్’ స్ట్రోక్ తగులుతుందా? వివాదాస్పదంగా కుమారుల తీరు