WhatsApp Status: వాట్సాప్ ఎంత పని చేసింది.. జర చూస్కోవాలి కదా బ్రో.. స్టేటస్ తో బయటకొచ్చిన అసలు కథ!
ఓ యువకుడు ఏదో చేయబోతే.. ఏదో జరిగింది. తనంటే భయపడిపోవాలనే చేసిన పని.. పోలీసులకు పట్టించింది.
![WhatsApp Status: వాట్సాప్ ఎంత పని చేసింది.. జర చూస్కోవాలి కదా బ్రో.. స్టేటస్ తో బయటకొచ్చిన అసలు కథ! Police Arrested 3 persons in Hyderabad because of WhatsApp Status know details here WhatsApp Status: వాట్సాప్ ఎంత పని చేసింది.. జర చూస్కోవాలి కదా బ్రో.. స్టేటస్ తో బయటకొచ్చిన అసలు కథ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/06/3ba2b09b5bf62e9af51f5bde0b394123_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అతడు అంటే అందరూ భయపడి పోవాలి.. అలా అందరికీ అనిపించాలంటే ఏం చేయాలి. వాట్సాప్ స్టేటస్ పెట్టాలి అనుకున్నాడు. కానీ అదే తన జైలు జీవితం చూపించింది. యువకుడు పెట్టుకున్న వాట్సప్ స్టేటస్.. ఆయుధ అక్రమ వ్యాపారం చేస్తున్న వ్యక్తులను పట్టించింది.
Also Read: Weather Report: అలర్ట్..అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో మూడు రోజులు వర్షాలు!
బషీర్‌బాగ్ బ్యాంక్ కాలనీకి చెందిన ప్లంబర్ పనిచేసే సయ్యద్ ఖలీల్ రెండు తల్వార్లను రెండు చేతులతో పైకి పట్టుకుని ఫొటో తీసుకుని ఫోజు ఇచ్చాడు. దానినే.. వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఎలాగోలా.. కత్తులు పట్టుకున్న ఫొటో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చేరింది. అసలు ఏం జరుగుతుందనే కోణంలో శనివారం సాయంత్రం అతడ్ని పట్టుకున్నారు. ఆరా తీయగా.. మలక్‌పేట పోలీస్ హాస్పిటల్‌లో లాండ్రీ పనులు చేసే అంకిత్ లాల్ తనకు అమ్మినట్లు తెలిపాడు. అతడ్ని పట్టుకోగా అసలు విషయం బయటపడింది.
Also Read: Tamil Nadu: చుక్కేసి కిక్కు ఎక్కితేనే భవిష్యత్ చెప్తా.. ఈ ఫుల్ బాటిల్ బాబా కథేంటో ఓ లుక్కేయండి..
ఆసిఫ్‌నగర్ కాగజ్‌గూడ ప్రాంతానికి చెందిన రతన్ రాజ్‌కుమార్ సిద్దిఅంబర్‌బజార్‌లో గిఫ్ట్స్ షాపు నడుపుతున్నాడు. అయితే ఎన్నాళ్లుగా చేసిన లాభాలు అనిపించలేదేమో.. వేరే బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఢిల్లీ నుంచి పదునైన కత్తులు, బాకులను తెచ్చి కొద్ది నెలలుగా అమ్ముతున్నాడు. అంకిత్‌లాల్‌కు విషయం చెప్పాడు. కమీషన్ పద్ధతిలో ఒక్కో తల్వార్‌ను విక్రయిస్తున్నారు.
Also Read: America: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం…వ్యక్తిగత కక్షలే అని అనుమానిస్తున్న పోలీసులు
అంకిత్‌లాల్ ఖలీల్‌కు వ్యాపారం గురించి చెప్పగా అమ్మేందుకు రెండింటిని తీసుకున్నాడు. అదే తనకు సమస్యలు తెచ్చిపెట్టింది. తనంటే చుట్టుపక్కల వారికి భయం ఉండాలని తల్వార్లు పట్టుకున్న ఫొటోను స్టేటస్‌గా పెట్టుకున్నాడు. ఈ విషయం పోలీసులకు చేరింది. తర్వాత.. ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేసిన సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. వారి నుంచి 95 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు.
Also Read: Hyderabad Fake Baba: పరీక్షలో పాస్ కావాలంటే 'కాల భైరవ పూజ' చేస్తాడట.. రూ.80 వేలు సమర్పయామి
Data Protection: ఏం గుర్తుపెట్టుకుంటాలేం అని ముఖ్యమైన సమాచారం మొత్తం మెయిల్, ఫోన్లలో భద్రపరుస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!
Bigg Boss Telugu 5 Contestants: బిగ్ బాస్ 5.. హౌస్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీరే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)