America: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం…వ్యక్తిగత కక్షలే అని అనుమానిస్తున్న పోలీసులు
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకీ చప్పుళ్లు మారుమోగాయి. ఫ్లోరిడా నగరంలో రెండు వేర్వేరు చోట్ల దుండగుల కాల్పులు జరిపారు. రెండు ఘటనలూ వ్యక్తిగత కక్షలతోనే జరిగాయని అనుమానిస్తున్నారు పోలీసులు.
ఫ్లోరిడాలోని లేక్ ల్యాండ్‌లో ఆదివారం తెల్లవారుజామున తుపాకీతో ఓ సైకో స్వైరవిహారం చేసి నలుగురి ప్రాణాలు తీశాడు. బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్ వేసుకుని మరీ సైకో దాడులకు తెగబడ్డాడు. లేల్యాండ్ లోని ఓ ఇంట్లో 11 ఏళ్ల బాలిక , బాలింత, ఆమె ఒడిలోని శిశువు మృతిచెందారు. పొరుగింట్లో మరో మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆగంతకుడిపై కాల్పులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన దుండగుడిని ఆసపత్రికి తరలించారు. అయితే కాల్పులకు కారణం ఏంటన్నది పూర్తిగా వెల్లడించని పోలీసులు…ఈ ప్రాంతంలోనికి ప్రవేశించడానికి ఎవరికీ అనుమతి లేదని స్పష్టం చేశారు. ఈ ఘటన సుమారు ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో జరిగినట్లు పేర్కొన్నారు. ఈ దాడి నుంచి తప్పించుకునేందుకు సాక్ష్యాలను నాశనం చేసేందుకు దుండగుడు ప్రయత్నించాడని పేర్కొన్నారు. పట్టుబడిన తర్వాత కూడా తమపై దాడి చేసేందుకు తీవ్రంగా యత్నించాడని పోలీసులు చెప్పారు.
Also Read: అలర్ట్..అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో మూడు రోజులు వర్షాలు!
ఫ్లోరిడా రాయల్ పామ్ బీచ్‌లోని పబ్లిక్స్ సూపర్ మార్కెట్‌లోకి వెళ్లిన మరో దుండగుడు ఇద్దరు వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఓ మహిళ, ఆమె మనవడు ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరినీ కాల్చిన వెంటనే తాను కూడా కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని రాయల్ పామ్ బీచ్‌కు చెందిన టిమోతీ జే వాల్ గా గుర్తించినట్లు పామ్ బీచ్ కౌంటీ పోలీస్ అధికారి తెరి బార్బెరా చెప్పారు. మృతులు ఎవరన్నది పూర్తి వివరాలు తెలియలేదు. అయితే కేవలం ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరిపి తనని తాను కూల్చుకున్నాడంటే వ్యక్తిగత కక్షల వల్లే ఇదంతా జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.
Also Read: స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు...ప్రధాన నగరాల్లో ధరలు ఇలా...
మూడు రోజుల క్రితం నార్త్ కరోలినా రాష్ట్రం విన్‌స్టన్ సాలెం నగరంలో ఓ పాఠశాలలో దుండగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతిచెందాడు. గాయపడిన మరో విద్యార్థిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
Also Read: ఆ దేశంలో సెక్స్ బంద్.. ఇక శృంగారం చేయరాదని మహిళలకు పిలుపు.. ప్రభుత్వంపై వింత నిరసన!
Also Read: ఈ ఐదు రాశులవారికి భలేమంచి రోజు… ఆ మూడు రాశుల వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
Also Read: ఈ వారం మూడు రాశులవారికి చాలా ప్రత్యేకం.. మిగిలిన రాశుల వారికి ఈ వారం ఎలా ఉందో చూడండి..