అన్వేషించండి

Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక ఫస్ట్ ఛాయిస్ కాదు... 'పుష్ప 2' లక్కీ ఛాన్స్ చేజార్చుకున్న స్టార్స్ వీళ్ళే!

Pushpa 2: మోస్ట్ అవైటింగ్ మూవీ 'పుష్ప 2' ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా 'పుష్ప' మూవీని వదులుకున్న స్టార్స్ గురించి చర్చ మొదలైంది.

పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2'తో అల్లు అర్జున్ (Allu Arjun) ఓవర్ నైట్‌లో ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ గా అవతరించిన సంగతి తెలిసిందే. ఆయన మాత్రమే కాదు... ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన రష్మిక మందన్న, ఫాహద్ ఫాజిల్ కూడా ఇదే రేంజ్ లో పాపులర్ అయ్యారు. ఇక సునీల్, అనసూయ లాంటి కీలక పాత్రలు పోషించిన నటీనటులు కూడా మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే 'పుష్ప' సినిమా హీరో హీరోయిన్ లుగా సుకుమార్ ఫస్ట్ ఛాయిస్ అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ కాదట. సుకుమార్ దృష్టిలో పెట్టుకొని 'పుష్ప'ను రాసుకున్న హీరో హీరోయిన్లు ఈ మూవీని రిజెక్ట్ చేశారనే వార్త చక్కర్లు కొడుతోంది. 

2021 లో రిలీజ్ అయిన 'పుష్ప ది రైజ్' మూవీ ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఇలాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా డిసెంబర్ 5న 'పుష్ప 2 ది రూల్' అనే మూవీ వచ్చేసింది. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. ప్రపంచవ్యాప్తంగా 12,500 థియేటర్లలో, ఆరు భాషల్లో 'పుష్ప 2' మూవీ రిలీజ్ అయింది. అయితే ఇందులో హీరో హీరోయిన్లుగా నటించిన అల్లు అర్జున్, రష్మిక మందన్న డైరెక్టర్ సుకుమార్ ఫస్ట్ ఛాయిస్ కాదట. అల్లు అర్జున్ కంటే ముందు సుకుమార్ మరో ముగ్గురు స్టార్స్ ని దృష్టిలో పెట్టుకొని కథను రాసుకున్నారట. కానీ ఆ ముగ్గురూ సుకుమార్ ని రిజెక్ట్ చేయడంతో అల్లు అర్జున్, రష్మిక దగ్గరకు వచ్చి పడింది ఈ స్టోరీ. మరి ఇలాంటి అద్భుతమైన సినిమాను వదులుకున్న స్టార్స్ ఎవరు అంటే.. 

Also Readసుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?

పుష్ప రాజ్ క్యారెక్టర్ కోసం ముందుగా సుకుమార్ మహేష్ బాబుని అనుకున్నారట. ఆయనను దృష్టిలో పెట్టుకుని కథను రాసుకున్నారట. స్టోరీతో ఆయన దగ్గరకు వెళ్ళగా, మహేష్ గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో నటించడానికి సంకోచించాడట. దీంతో ఈ మూవీని రిజెక్ట్ చేశాడట. ఇంకేముంది సుకుమార్ అల్లు అర్జున్ కి కథను వినిపించడం, ఆయన ఓకే చెప్పడం... ఆ తర్వాత రికార్డులు తిరగ రాయడం తెలిసిందే. ఇక 'పుష్ప'లో అల్లు అర్జున్ నటనకు నేషనల్ అవార్డు కూడా దక్కింది. అలాగే ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రకు ముందుగా సమంతను అనుకున్నారట. కానీ అప్పటికే ఆమె సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'రంగస్థలం' సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా నటించింది. దీంతో మరోసారి అలాంటి క్యారెక్టర్ చేయలేను అంటూ సమంత రిజెక్ట్ చేసిందట. 

కానీ ఈ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకున్న రష్మిక మాత్రం నేషనల్ క్రష్ గా ఎదిగింది. అలాగే సినిమాలో ఎస్పి బన్వర్ సింగ్ షెకావత్ అనే విలన్ పాత్రకి ముందుగా సుకుమార్ అనుకున్న నటుడు ఫాహద్ ఫాజిల్ కాదు. విజయ్ సేతుపతిని అనుకున్నారట. కానీ బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన నో చెప్పడంతో ఈ అవకాశం ఫాహద్ చేతికి చెక్కింది. ఇక ఆయన 'పార్టీ లేదా పుష్ప' అనే డైలాగ్ తో ఒక్కసారిగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

Also Readపుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?

టాప్ హెడ్ లైన్స్

Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget