అన్వేషించండి

Pushpa 2: సుక్కూ... ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎక్కడ? 'పుష్ప 3'లో చూసుకో అంటావా?

Pushpa 3 The Rampage: 'పుష్ప 2' పెయిడ్ ప్రీమియర్స్ నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. అయితే... ఆడియన్స్ మదిలో కొన్ని ప్రశ్నలు మాత్రం ఉన్నాయి. వాటికి సమాధానాలు 'పుష్ప 3'లో చూసుకోవాలి ఏమో!?

థియేటర్లలో 'పుష్ప 2' విడుదలైంది. సూపర్ డూపర్ హిట్ టాక్ వచ్చింది. యాంటీ ఫ్యాన్స్ లేదా కొంత మంది సినిమా బాలేదని నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. అది బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపించే అవకాశాలు తక్కువ. మెజారిటీ ఆడియన్స్ నుంచి సినిమాకు అప్రిసియేషన్ వస్తోంది. పుష్ప రాజ్ క్యారెక్టరైజేషన్, గంగమ్మ జాతర ఎపిసోడ్, యాక్షన్ బ్లాక్స్ వంటి అంశాలతో మెస్మరైజ్ చేసిన సుకుమార్... కొన్ని ప్రశ్నలు అలా వదిలేశారు.

పుష్ప ఎక్కడ? అసలు ఆ సీన్ లేదుగా!
Where Is Pushpa పేరుతో 'పుష్ప 2' అనౌన్స్ చేశారు. ఓ వీడియో గ్లింప్స్ విడుదల చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా 'పోలీస్ డౌన్ డౌన్' అంటూ ప్రజలు నిదానాలు చేయడం చూపించారు. తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో పుష్ప తప్పించుకున్నాడని వార్తల్లో న్యూస్ రీడర్ చెప్పడం చూపించారు సుకుమార్. పోలీసులు పుష్ప మీద పది రౌండ్లు కాల్పులు జరిపారని కూడా డైలాగ్ ఉంది. అన్ని గాయాలతో మనిషి అసలు బ్రతికే అవకాశం లేదని కొందరు న్యూస్ ఛానల్స్ డిబేట్లలో తేల్చేస్తారు. తర్వాత అడివిలో పుష్ప కనిపిస్తాడు. 

'అడివిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయి అంటే పులి వచ్చింది అని అర్థం. అదే పులి రెండు అడుగులు వెనక్కి వేస్తే? పుష్ప వచ్చాడని అర్థం' అని ఆ అనౌన్స్‌మెంట్‌ వీడియో చివరలో డైలాగ్ ఉంటుంది. అసలు ఆ సీన్ 'పుష్ప 2'లో లేనే లేదు. మరి, ఏం చేశారు? అనేది క్వశ్చన్. పార్ట్ 3లో చూపిస్తారు ఏమో సుక్కు.

జపాన్ ఎందుకు వెళ్ళాడు? పుష్ప అక్కడ ఏం చేశాడు?
'పుష్ప 2' చూసిన జనాలకు ఇప్పుడు చెప్పే సీన్ బాగా అర్థం అవుతుంది. జపాన్ పోర్టులో హీరో ఇంట్రడక్షన్ తీశారు సుకుమార్. తన సరుకు ఎక్కడకు వెళుతుందో తెలుసుకోవడం కోసం కంటైనర్‌లో జపాన్ వచ్చానని, 40 రోజులు ఖాళీగా ఉండటం ఎందుకు అని 30 రోజుల్లో జపనీస్ నేర్చుకున్నానని చెబుతాడు. అంతా బావుంది. ఆ ఫైట్ తర్వాత జపాన్ ఊసే ఉండదు. 'పుష్ప 2' ట్రైలర్ చూస్తే... కరెక్టుగా 1.35 సెకన్స్ దగ్గర జపాన్ రెస్టారెంట్‌లో అల్లు అర్జున్ ఎవరితోనో డీల్ చేస్తారు. ఆ సీన్ కూడా సినిమాలో లేదు. 

జపాన్ రెస్టారెంట్ సన్నివేశానికి ముందు ట్రైలర్‌లో జాలి రెడ్డి (డాలీ ధనుంజయ) కూడా కనిపిస్తాడు. జాలి రెడ్డి ఎవరికో గన్ గురి పెడతారు. ఆ సీన్ కూడా 'పుష్ప 2'లో లేదు. ఎండింగ్ టైటిల్ కార్డ్స్ పడేటప్పుడు వస్తాడు జాలి రెడ్డి. పార్ట్ 3లో ఆయన క్యారెక్టర్ కీలకం కానుంది ఏమో!? పుష్ప శివమాల ఎందుకు వేశాడు? భన్వర్ సింగ్ షెకావత్ నదిలో స్నానం చేసే సీన్ ఎందుకు తీసేశారు? అనేది పార్ట్‌ 3లో చూడాలి ఏమో!?

Also Readపుష్ప 2 రివ్యూ: సుక్కు మార్క్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ మాస్ తాండవం... మరి సినిమా హిట్టా? ఫట్టా?


బ్లాస్ట్ చేసింది ఎవరు? బ్లాస్ట్ తర్వాత ఏం జరిగింది?
'పుష్ప 2' ఎండింగ్ అందరికీ నచ్చిందని చెప్పలేం. బీభత్సమైన హై ఇచ్చిన కోట ఫైట్ తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్స్ అందరినీ మెప్పించాయని చెప్పలేం. పార్ట్ 3 కోసం సరైన లీడ్ ఇవ్వలేదని ఫ్యాన్స్ సహా ఆడియన్స్ కొందరు ఫీలయ్యారు. కానీ, సుకుమార్ చాలా తెలివిగా కొన్ని ప్రశ్నలు వదిలేశారు. పైన పేర్కొన్న ప్రశ్నలకు తోడు మరో రెండు బ్లాస్టులు 'పుష్ప 3'లో కీలకం కానున్నాయి.

ట్విస్ట్ రివీల్ చేయకుండా చెప్పాలంటే... భన్వర్ సింగ్ షెకావత్ ఒక బ్లాస్ట్ దగ్గర ఉంటారు. ఆ తర్వాత ఆయన క్యారెక్టర్ కనిపించదు. ఆయనతో బ్రహ్మాజీ రోల్ కూడా తర్వాత లేదు. మరి, ఆ బ్లాస్ట్ తర్వాత ఏమైంది? అనేది క్వశ్చన్. మరొక బ్లాస్ట్ క్లైమాక్స్ ముగిసిందని అనుకున్నప్పుడు జరిగింది. అది ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనేది మరొక క్వశ్చన్. వీటికి సమాధానాలు 'పుష్ప 3: ది ర్యాంపేజ్'లో లభిస్తాయి.

Also Read: ‘పుష్ప 2’ జాతర ఎపిసోడ్‌కు సౌదీ అరేబియా సెన్సార్ - కర్ణాటకలోనూ కోలుకోలేని షాక్... విషయం ఏమిటంటే?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Railway Projects: ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు 4 రైల్వే లైన్లు, రైల్వే క్రాసింగ్స్‌ లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు
ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు 4 రైల్వే లైన్లు, రైల్వే క్రాసింగ్స్‌ లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు
IND vs PAK T20 World Cup: భారత్, పాక్ మ్యాచ్ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
భారత్, పాక్ మ్యాచ్ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Asaduddin Owaisi: గన్‌తో ముస్లింలకు గురిపెట్టిన హిమంత బిశ్వ శర్మ! పోలీసులకు అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు
గన్‌తో ముస్లింలకు గురిపెట్టిన హిమంత బిశ్వ శర్మ! పోలీసులకు అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు
Shahid Kapoor: షాహిద్ కపూర్ సంచలన వ్యాఖ్యలు... సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదేనా?
షాహిద్ కపూర్ సంచలన వ్యాఖ్యలు... సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదేనా?

వీడియోలు

Gautam Gambhir about Surya T20 Captaincy | టీ20 కెప్టెన్సీపై హెడ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు
T20 World Cup 2026 Jasprit Bumrah, Abhishek Sharma Health Update | కోలుకుంటున్న బుమ్రా, అభిషేక్ శర్మ
T20 World Cup 2026 Jasprit Bumrah Health Update | కోలుకుంటున్న బుమ్రా, అభిషేక్ శర్మ
Pakistan Conditions to Play with India | భారత్‌తో మ్యాచ్ ..షరతులు పెట్టిన పాక్
Nepal vs England T20 World Cup | ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించిన నేపాల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Railway Projects: ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు 4 రైల్వే లైన్లు, రైల్వే క్రాసింగ్స్‌ లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు
ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు 4 రైల్వే లైన్లు, రైల్వే క్రాసింగ్స్‌ లేకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు
IND vs PAK T20 World Cup: భారత్, పాక్ మ్యాచ్ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
భారత్, పాక్ మ్యాచ్ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుంది.. లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
Asaduddin Owaisi: గన్‌తో ముస్లింలకు గురిపెట్టిన హిమంత బిశ్వ శర్మ! పోలీసులకు అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు
గన్‌తో ముస్లింలకు గురిపెట్టిన హిమంత బిశ్వ శర్మ! పోలీసులకు అసదుద్దీన్ ఒవైసీ ఫిర్యాదు
Shahid Kapoor: షాహిద్ కపూర్ సంచలన వ్యాఖ్యలు... సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదేనా?
షాహిద్ కపూర్ సంచలన వ్యాఖ్యలు... సందీప్ రెడ్డి వంగా ప్లాన్ అదేనా?
Leopard In Medak: అకోలా- హైదరాబాద్ 161 నేషనల్ హైవే పక్కన చిరుత సంచారం.. జాగ్రత్తగా ఉండండి
అకోలా- హైదరాబాద్ 161 నేషనల్ హైవే పక్కన చిరుత సంచారం.. జాగ్రత్తగా ఉండండి
YSRCP Leader Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్; కానీ ఇప్పుడే విడుదల కష్టమే!అసలు చిక్కు ఎక్కడంటే?
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్; కానీ ఇప్పుడే విడుదల కష్టమే!అసలు చిక్కు ఎక్కడంటే?
Krishna Crime News: బ్లాక్ మెయిల్ చేసి సోదరిపై పలుమార్లు అత్యాచారం, విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు
బ్లాక్ మెయిల్ చేసి సోదరిపై పలుమార్లు అత్యాచారం, విజయవాడ పోక్సో కోర్టు సంచలన తీర్పు
Srisailam Lathi charge: శ్రీశైలంలో భక్తులపై లాఠీ ఛార్జ్‌- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు !
శ్రీశైలంలో భక్తులపై లాఠీ ఛార్జ్‌- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నేతలు !
Embed widget