Pushpa 2: ‘పుష్ప 2’ జాతర ఎపిసోడ్‌కు సౌదీ అరేబియా సెన్సార్ - కర్ణాటకలోనూ కోలుకోలేని షాక్... విషయం ఏమిటంటే?
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ది రూల్’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవగా.. కర్ణాటక, సౌదీ అరేబియాలలో మాత్రం ఈ సినిమాకు ఊహించని షాక్ తగిలింది. ఇంతకీ ఏమయ్యిందంటే..
ప్రపంచవ్యాప్తంగా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 ది రూల్’ జాతరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. డిసెంబర్ 5న అధికారికంగా విడుదల కాబోతోన్న ఈ సినిమా ఒక రోజు ముందుగానే అంటే డిసెంబర్ 4 నుండే ప్రీమియర్స్ మొదలు కాబోతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాకు ఆకాశమే అవధి అన్నట్లుగా టికెట్లు తెగిపడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో బీభత్సమైన రేట్లు ఉన్నప్పటికీ.. టిక్కెట్టు ముక్క కూడా మిగలకుండా అన్నీ సోల్డవుట్ బోర్డ్స్ కనిపించడం విశేషం. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల కోపరేషన్‌తో ‘పుష్పరాజ్’ రికార్డుల మోత మోగించబోతున్నాడు. ఆల్రెడీ టిక్కెట్ల బుకింగ్ విషయంలో సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పిన పుష్పరాజ్.. ఇక కలెక్షన్లతో ఎలాంటి సునామీ సృష్టించబోతున్నాడనేది ఇంకొన్ని గంటల్లో తెలిసిపోనుంది.
అయితే ప్రపంచవ్యాప్తంగా పుష్పరాజ్‌కు స్వాగతం పలుకుతున్నా... కర్ణాటక, సౌదీ అరేబియాలలో మాత్రం ఈ సినిమాకు కోలుకోలేని షాక్ తగిలింది. ముందుగా కర్ణాటక విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాలతో పోలిస్తే.. కర్ణాటకలో ఈ సినిమా ప్రీమియర్ చూడాలంటే దాదాపు రూ. 2000 నుండి రూ. 2500 వరకు పెట్టి టికెట్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. అంతగా హై రేట్స్ అక్కడ నిర్ణయించారు. అయినా సరే కొందరు ఫ్యాన్స్ టికెట్లను ఆ రేట్లకు బుక్ చేసుకున్నారట. కానీ అక్కడి సినీ నిర్మాతలు, బెంగళూర్ జిల్లా కలెక్టర్ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారని, ఆ నిర్ణయం ప్రకారం బెనిఫిట్ షోలు వేయడానికి అనుమతి లేదంటూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఆల్రెడీ టికెట్స్ బుక్ చేసుకున్న వారికి డబ్బులు రిఫండ్ అవుతాయని చెప్పేశారట. కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ‘పుష్ప2’ మిడ్‌నైట్ షోలపై కంప్లయింట్ ఇవ్వడంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకుని వెంటనే ఆదేశాలు జారీ చేయడంతో కర్ణాటకలో ‘పుష్ప2’ బెనిఫిట్ షోలన్నీ ఆగిపోయాయి. ఇది నిజంగా ఈ సినిమాకు పెద్ద దెబ్బే అని చెప్పుకోవచ్చు. కచ్చితంగా ఈ ఎఫెక్ట్ కలెక్షన్లపై పడే అవకాశం అయితే లేకపోలేదు.
🚨 BREAKING: Bengaluru District Collector orders to STOP #Pushpa2TheRule midnight shows. https://t.co/OZjy3TlIx1 pic.twitter.com/qwKlDKkfc6
— Manobala Vijayabalan (@ManobalaV) December 4, 2024
Also Read: పుష్ప 2 సెన్సార్ బోర్డు రివ్యూ... అల్లు అర్జున్ సినిమాలో హైలైట్స్ ఏంటో తెలుసా?
ఇక సౌదీ అరేబియా విషయానికి వస్తే.. అక్కడ సెన్సార్ నుండి ‘పుష్ప 2’కు ఇబ్బందులు ఎదురయ్యాయి. దాదాపు 20 నిమిషాల సీన్స్ కట్ చేస్తే సెన్సార్ పాస్ చేస్తామని సెన్సార్ సభ్యులు చెప్పడంతో.. చేసేది లేక 19 నిమిషాల నిడివి గల సీన్లను కట్ చేయడానికి టీమ్ ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడానికి కారణం.. ఈ సినిమాకు ఆయువు పట్టు అయిన జాతర ఎపిసోడ్ కావడం విశేషం. ఈ ఎపిసోడ్‌లో హీరో దేవత అవతారంలో కనిపించడంతో పాటు.. హిందూ దేవుళ్ల ప్రస్తావన ఎక్కువగా ఉందని సెన్సార్ బృందం అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. చివరకు టీమ్ కట్‌లకు ఓకే చెప్పడంతో ‘జాతర’ ఎపిసోడ్ లేకుండానే సౌదీ అరేబియాలో ‘పుష్ప2’ విడుదలవుతోంది. ఇలా చివరి నిమిషంలో అటు బెంగళూరు, ఇటు సౌదీ అరేబియాలో ‘పుష్పరాజ్’కు షాక్ ఎదురైంది. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రీవల్లిగా రష్మికా మందన్నా నటించగా.. ఒక ప్రత్యేక పాటలో డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీల కనిపించనుంది. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించింది.
Also Read: 'పుష్ప 2' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది... అప్పుడు మగధీర, ఇప్పుడు పుష్ప 2 - అల్లు అరవింద్ ఏమన్నారంటే?