X
Super 12 - Match 22 - 28 Oct 2021, Thu up next
AUS
vs
SL
19:30 IST - Dubai International Cricket Stadium, Dubai
Super 12 - Match 23 - 29 Oct 2021, Fri up next
WI
vs
BAN
15:30 IST - Sharjah Cricket Stadium, Sharjah

Texas Abortion Law: ఆ దేశంలో సెక్స్ బంద్.. ఇక శృంగారం చేయరాదని మహిళలకు పిలుపు.. ప్రభుత్వంపై వింత నిరసన!

మహిళకు ప్రభుత్వంపై కోపం వస్తే ఏం చేస్తారు? ఇదిగో ఇలా ‘సెక్స్ సమ్మె’తో నిరసన వ్యక్తం చేస్తారట. ఇదేదో కొత్తగా ఉంది కదూ.

FOLLOW US: 

మనం ఇప్పటి వరకు చాలా రకాల సమ్మెలు, బందులు గురించి విన్నాం. మరి, సెక్స్ సమ్మె గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అయితే, తప్పకుండా మీరు టెక్సాస్‌‌ మహిళలు పిలుపునిచ్చిన సరికొత్త ఆందోళన గురించి తెలుసుకోవల్సిందే. ఇటీవల టెక్సాస్ ప్రభుత్వం.. కొత్త అబార్షన్ చట్టాన్ని ప్రవేశ పెట్టింది. ఈ సందర్భంగా ఇప్పటివరకు ఉన్న నిబంధనలను మరింత కఠినతరం చేసింది. దీంతో మహిళల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి మరీ నిరసన చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి, గాయని బెట్టే మిడ్లర్ మహిళాలోకానికి ఇచ్చిన పిలుపు చర్చనీయమవుతోంది. 


టెక్సాస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బెట్టే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మహిళలంతా సెక్స్ సమ్మె చేపట్టాలని పిలుపునిచ్చింది. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొనేవరకు మహిళలు పురుషులతో సెక్స్ చేయరాదని ప్రకటించింది. గర్భం దాల్చాలా, వద్దా అనే విషయంపై సొంత నిర్ణయం తీసుకొనే హక్కు మహిళలకు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. అబర్షన్ చేయించుకోకుండా.. ఇష్టం లేకున్నా పిల్లలని కనాలని చెప్పడం అన్యాయమని ఆమె పేర్కొంది. ట్వీట్టర్ వేదికగా ఆమె తన ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు సెక్స్ సమ్మెలో పాల్గోవాలని చెప్పింది. 
 
గర్భం దాల్చిన ఆరు వారాల వరకు మహిళలకు తాము ప్రెగ్నెంట్ అనే విషయం తెలియదని, కానీ ప్రభుత్వం ఆ గడువును కూడా కుదిస్తూ నిషేదం విధించడం అన్యాయమని ఆమె పేర్కొంది. తమ గర్భం గురించి మహిళలు సొంత నిర్ణయం తీసుకొనే హక్కును ప్రభుత్వం కల్పించే వరకు ఎవరూ పురుషులతో లైంగిక సంబంధాన్ని తిరస్కరించాలని ఆమె తెలిపారు. బెట్టే మిడ్లర్ ఇచ్చిన పిలుపుకు మహిళల నుంచి సానుకూల స్పందన వస్తోంది. తప్పకుండా సెక్స్ సమ్మె చేపడతామని చెబుతున్నారు. మిగతా మహిళల మద్దతు కూడా కోరుతున్నారు. బెట్టే పిలుపును అక్కడి మహిళలు సీరియస్ తీసుకున్నా.. ప్రభుత్వానికి అది పెద్ద సమస్య కాబోదని తెలుస్తోంది. 


టెక్సాస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ కొత్త అబార్షన్ చట్టం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఆ దేశంలో మహిళాభుద్యయ సంఘాలు తమ నిరసలు వ్యక్తం చేస్తున్నాయి. వారికి మద్దతు తెలుపుతూ బెట్టీ ఈ ట్వీట్ చేశారు. టెక్సాస్ రిపబ్లికన్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఈ చట్టాన్ని ఆమోదిస్తూ సంతకం చేశారు. దీంతో సుప్రీం కోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. అయితే, కోర్టు వాటిని తిరస్కరించడంతో చట్టం అమల్లోకి వచ్చింది. 1973లో సుప్రీంకోర్టు ఇచ్చిన అబార్షన్ హక్కుల తీర్పుకు ఇది వ్యతిరేకంగా ఉందని పలువురు వాదిస్తున్నారు. మహిళల హక్కులకు భంగం కలిగించే ఈ చట్టంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని అప్పట్లో కోర్టు స్పష్టం చేసినా ఈ నిబంధన ఎలా అమల్లోకి తెస్తారని ప్రశ్నిస్తున్నారు. టెక్సాస్‌లో అమలైన ఈ కొత్త అబార్షన్ చట్టం ప్రకారం.. ఇకపై ఆరువారాల గర్భంతో అబార్షన్ చేయించకోడానికి సిద్ధమయ్యే మహిళలకు కొత్త సవాళ్లు ఎదురుకానున్నాయి. ఇదివరకు ఆరు వారాల గర్భం తర్వాత పిండాన్ని తొలగించేందుకు అనుమతి ఉండేది. అయితే.. ఈ సారి పిండాన్ని తొలగించే ముందు వైద్యులు ప్రత్యేక పరీక్షలు చేస్తారు. ఒక వేళ వారి గర్భంలోని పిండంలో హృదయ స్పందన మొదలైతే.. అబార్షన్ చేయడానికి చట్టం అంగీకరించదు. పిండంలో గుండె ఏర్పడితే.. అది ప్రాణం ఉన్న శిశువుగా పరిగణిస్తారు. అయితే, కొంతమంది మహిళలకు ఆరు వారాలు గడిచేవరకు తాము గర్భవతి అని తెలియదు. అలాంటి మహిళల పరిస్థితి ఏమిటని మహిళా సంఘాల ప్రతినిధులు ప్రశ్ని్స్తున్నారు. అయితే అత్యాచారం, అక్రమ సంబంధాల వల్ల కలిగే గర్భాలకు కూడా ఈ చట్టం వర్తిస్తుందని పేర్కోవడంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. కేవలం హెల్త్ ఎమర్జన్సీకి మాత్రమే ఈ చట్టం నుంచి ఉపశమనం కల్పిస్తారట. 

Tags: Sex Strike in Texas Sex Strike Sex Strike by Bette Midler Texas Abortion Law Bette Midler సెక్స్ సమ్మె

సంబంధిత కథనాలు

Lightning: పిల్లాడు కాదు పిడుగు.. మెరుపు తాకినా బతికేశాడు, అవే రక్షించాయి!

Lightning: పిల్లాడు కాదు పిడుగు.. మెరుపు తాకినా బతికేశాడు, అవే రక్షించాయి!

Naked Culture: ఇండియాలోని ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..

Naked Culture: ఇండియాలోని ఈ గ్రామంలో మహిళలు 5 రోజులు నగ్నంగా ఉంటారు.. వారిని చూసి నవ్వితే..

Lifestyle News: ఈ కండోమ్ కథ విన్నారా? జెండర్‌తో సంబంధం లేదట.. ఎవరికైనా ఓకే!

Lifestyle News: ఈ కండోమ్ కథ విన్నారా? జెండర్‌తో సంబంధం లేదట.. ఎవరికైనా ఓకే!

Penis Plant: ఈ మొక్క పేరు ‘పురుషాంగం’.. పాతికేళ్లకు ఒకసారే పూస్తుందట, ఎక్కడో తెలుసా?

Penis Plant: ఈ మొక్క పేరు ‘పురుషాంగం’.. పాతికేళ్లకు ఒకసారే పూస్తుందట, ఎక్కడో తెలుసా?

Signs of Iron Deficiency: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు ఐరన్ లోపం ఉన్నట్టే...

Signs of Iron Deficiency: ఈ లక్షణాలు కనిపిస్తే మీకు ఐరన్ లోపం ఉన్నట్టే...

టాప్ స్టోరీస్

Redmi Note 11 Series: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!

Redmi Note 11 Series: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!

Azim Premji Update: అజీమ్‌ ప్రేమ్‌జీని మించి ప్రేమించేదెవరు! రోజుకు రూ.27 కోట్లు దానం చేసిన ఆధునిక కర్ణుడు!

Azim Premji Update: అజీమ్‌ ప్రేమ్‌జీని మించి ప్రేమించేదెవరు! రోజుకు రూ.27 కోట్లు దానం చేసిన ఆధునిక కర్ణుడు!

Aryan Khan Bail: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు

Aryan Khan Bail: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు

Nagarjuna Meet Jagan : జగన్‌ను చూసేందుకు వచ్చా ! భేటీ వ్యక్తిగతమేనన్న నాగార్జున !

Nagarjuna Meet Jagan :   జగన్‌ను చూసేందుకు వచ్చా ! భేటీ వ్యక్తిగతమేనన్న నాగార్జున !