News
News
X

Horoscope Today : ఈ ఐదు రాశులవారికి భలేమంచి రోజు… ఆ మూడు రాశుల వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

2021 సెప్టెంబర్ 6 సోమవారం రాశిఫలాలు

మేషం

ఈ రోజు మేషరాశివారికి అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. తలపెట్టిన పనులు పూర్తిచేస్తారు. కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు. అయితే శారీరక శ్రమ పెరుగుతుంది. ఎవ్వరితోనూ వివాదాలు పెట్టుకోవద్దు. ఇష్టదైవాన్ని ప్రార్థించడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు.

వృషభం

ఇల్లు, వాహనం కొనాలనుకున్న ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో పెద్దగా మార్పులుండవు . ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.  ఓ శుభవార్త వింటారు. అనవసర ఆలోచనలతో కాలాన్ని వృథా చేయకండి. మానసికంగా దృఢంగా ఉండండి.

మిథునం

మిథున రాశివారికి ఈ రోజంతా శుభసమయమే. ఉద్యోగస్తులు, వ్యాపారులు, విద్యార్థులకు మంచి జరుగుతుంది. గతంలో చేసిన సహాయాలకి ప్రతిఫలం పొందుతారు. అనవసర వివాదాల్లో జోక్యం చేసుకోవద్దు. కుటుంబంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి.

Also Read: ఈ ఏడు వ్యసనాలు ఉంటే మీ జీవితం అధోగతిపాలే....

కర్కాటకం

రిస్క్ తీసుకుని అయినా చేపట్టిన పనులు మొండిగా పూర్తిచేస్తే మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగంలోసమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు.

సింహం

అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మరింత శ్రమ పెరుగుతుంది. పదోన్నతులకు అవకాశం ఉంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ఎప్పటి నుంచో రావాల్సిన మొత్తం చేతికందే సూచనలున్నాయి.  విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.  

కన్య

కన్య రాశివారికి ఈ రోజు ముఖ్యమైన పనుల్లో పురోగతి ఉంటుంది. అయితే ప్రతి పనికీ శ్రమ, మానసిక ఒత్తిడి తప్పవు. ఉద్యోగంలో అంతా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం నిలకడగా సాగుతుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. కుటుంబంలో సమస్యలు పరిష్కారమవుతాయి. వివాదాల జోలికి పోవద్దు. మానసికంగా దృఢంగా ఉండండి.

Also Read: శరీరంలో ఉండే ఈ పది వాయువుల గురించి తెలుసా?

 తుల

తుల రాశివారికి ఈ రోజు అనుకూల ఫలితాలున్నాయి.  అనుకున్న పనులు పూర్తవుతాయి. ఇంటా బయటా కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారం అందుతుంది. వ్యాపారులు కష్టపడితే మంచి ఫలితాలు అందుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మానసిక ఇబ్బంది కలిగిస్తాయి.

వృశ్చికం

అనుకున్న పనులు నెరవేరతాయి. మేధావులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో కష్టానికి తగిన ఫలితం అందుకుంటారు. వ్యాపారంలో కలిసొస్తుంది. స్నేహితుల సహకారం ఉంటుంది. ఎప్పటినుంచో రావాల్సిన సొమ్ము హఠాత్తుగా చేతికందుతుంది. వివాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.

ధనుస్సు

ధనస్సు రాశివారు ఈ రోజు సమయానుకూలంగా ముందుకుసాగండి. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి ఉంది. కుటుంబంలో ఒక కీలక సమస్య నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పెద్దల ఆశీర్వచనాలు మీపై ఉంటాయి.

Also Read: రుద్రాక్ష చెట్టు ఇంట్లోనే పెంచుకోవచ్చు…ఎలాగో తెలుసా?

మకరం

మకర రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. అనుకున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు. అనారోగ్య సూచనలున్నాయి. ప్రయాణాల సమయంలో జాగ్రత్తలు తీసుకోండి.

కుంభం

మీ ఎదుగుదల చూసి ఓర్వలేనివారు కొందరు మిమ్మల్ని కిందకు లాగే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహంచండి.ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. పెద్దల సలహాలతో ఓ పని పూర్తిచేస్తారు.  ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.

మీనం

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలున్నాయి. ఆదాయం నిలకడగా ఉన్నప్పటికీ ఖర్చులు పెరుగుతాయి. తలపెట్టిన పనులు కాస్త టెన్షన్ పెట్టినా చివరకు పూర్తవుతాయి. మీ ప్రతిభతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. బంధువులు, స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

Also Read: తెలివైనవాడికి శత్రువులు ఎందుకుండరు?

Published at : 06 Sep 2021 06:43 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces 6 September 2021 Horoscope

సంబంధిత కథనాలు

Spirituality:పెళ్లిలో అరుంధతీ నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు, ఇంత అర్థం ఉందా!

Spirituality:పెళ్లిలో అరుంధతీ నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు, ఇంత అర్థం ఉందా!

Horoscope Today 16th August 2022: ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు

Horoscope Today  16th August 2022:  ఈ రెండు రాశులవారికి అదృష్టం, ఆ రాశివారికి విజయం, ఆగస్టు 16 రాశిఫలాలు

Horoscope Today 15 August 2022: స్వాతంత్ర్య దినోత్సవం ఈ రాశులవారి జీవితంలో రంగులు నింపుతుంది, ఆగస్టు 15 రాశిఫలాలు

Horoscope Today  15 August 2022:  స్వాతంత్ర్య దినోత్సవం ఈ రాశులవారి జీవితంలో రంగులు నింపుతుంది, ఆగస్టు 15 రాశిఫలాలు

Holes to Pots in Cremation : అంత్యక్రియలు సమయంలో కుండకు కన్నాలు పెట్టి పగలగొడతారెందుకు!

Holes to Pots in Cremation : అంత్యక్రియలు సమయంలో కుండకు కన్నాలు పెట్టి పగలగొడతారెందుకు!

Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!

Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!

టాప్ స్టోరీస్

CM KCR Sings National Anthem: అబిడ్స్ లో సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సీఎం కేసీఆర్ | ABP Desam

CM KCR Sings National Anthem: అబిడ్స్ లో సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొన్న సీఎం కేసీఆర్ | ABP Desam

Prashanth Neel: ఏపీలో హాస్పిటల్ నిర్మాణానికి ప్రశాంత్ నీల్ భారీ సాయం, రఘువీరా ప్రశంసలు

Prashanth Neel: ఏపీలో హాస్పిటల్ నిర్మాణానికి ప్రశాంత్ నీల్ భారీ సాయం, రఘువీరా ప్రశంసలు

తుపాకుల పాలనకు ఏడాది- ‘డెత్‌ టు అమెరికా’అంటూ నినాదాలు

తుపాకుల పాలనకు ఏడాది- ‘డెత్‌ టు అమెరికా’అంటూ నినాదాలు

Bimbisara Making Video: ‘బింబిసార’లోని ఆ సీన్స్ కోసం ఇంత కష్టపడ్డారా?

Bimbisara Making Video: ‘బింబిసార’లోని ఆ సీన్స్ కోసం ఇంత కష్టపడ్డారా?