అన్వేషించండి

7 terrible addictions: ఈ ఏడు వ్యసనాలు ఉంటే మీ జీవితం అధోగతిపాలే....

లోపాలు లేని మనిషి ఉండడు. అలాగే వ్యసనం లేనివారూ ఉండరు. అయితే ఆ వ్యసనం మన జీవితానికి ఓ మార్గం చూపించాలి..మనకు మంచి చేయాలి కానీ అదఃపాతాళానికి తొక్కేయకూడదు. ముఖ్యంగా ఉండకూడని ఏడు వ్యసనాలేంటంటే....

ఉండకూడని ఏడు వ్యసనాలు

దుర్వ్యసనం ఎంత గొప్పవాడినైనా అథఃపాతాళానికి తొక్కేస్తుంది. వ్యసనానికి లోనై జీవితంలో బాగుబడినవాళ్లు లేరు. ఇలాంటి వాళ్లు ఈ కాలంలో మాత్రమే కాదు పూర్వమూ ఉన్నారు…పురాణాల్లోనూ ఉన్నారు. ముఖ్యంగా దుర్య్వసనాలు ఏడు అని చెబుతారు. అవేంటంటే…

7 terrible addictions: ఈ ఏడు వ్యసనాలు ఉంటే మీ జీవితం అధోగతిపాలే....

పరస్త్రీ వ్యామోహం
సప్తవ్యసనాల్లో మొదటిది పరస్త్రీ వ్యామోహం. ఈ వ్యసనంతో సర్వనాశనమైపోయిన వాళ్లని చూస్తూనే ఉన్నాం. అందరకీ తెలిసిన రావణుడే బెస్ట్ ఎగ్జాంపుల్. శ్రీరామ పత్ని అయిన సీతాదేవిని అపహరించి కోరి కష్టాలు కొనితెచ్చుకున్నాడు. అంతేకాదు…తన కుటుంబాన్ని, వంశాన్ని, అయినవారినీ, చివరికి రాజ్యాన్ని కూడా కోల్పోయాడు. అందుకే మనది కాని వస్తువైని…మనలో సగ భాగం కాని మనిషిపై వ్యామోహం పెంచుకుంటే మిగిలేది నాశనమే..

7 terrible addictions: ఈ ఏడు వ్యసనాలు ఉంటే మీ జీవితం అధోగతిపాలే....

జూదం
జూదం అనే మాట వినగానే ఇప్పుడున్న జనరేషన్ కి పేకాట కళ్లముందు కనిపిస్తుంది. అదే పురాణకాలానికి వెళితే పాండవులు-కౌరవుల జూదం గుర్తొస్తుంది. ధర్మరాజు అంతటి వాడు జూదం వల్ల ఎన్ని అగచాట్లు పడ్డాడో అందరికీ తెలుసు. మంచి చెడులు నిర్ణయించే అంత గొప్పవాడే ఆ రోజుల్లో తాను అవస్తలు పడడంతో పాటూ తమ్ముళ్లు, భార్య కష్టాలకు కూడా కారణమయ్యాడు. ఇక ఇప్పటి విషయానికొస్తే జూదానిక బానిసై  కుటుంబాలను రోడ్డున పడేస్తున్న వారెందరినో చూస్తున్నాం. 

7 terrible addictions: ఈ ఏడు వ్యసనాలు ఉంటే మీ జీవితం అధోగతిపాలే....

మద్యపానం
మద్యపానం ఎంత ప్రమాదకరమో రాక్షసగురువైన శుక్రాచార్యుడే ఇందుకు ఉదాహరణ. ఆయనకి మృత సంజీవినీ విద్య తెలుసు. చనిపోయిన రాక్షసులను ఆ విద్యతో వెంటనే బ్రతికించేవాడు. కానీ మద్యపాన మత్తులో ఏం చేస్తున్నాడో తెలుసుకోకుండా తాను తాగే పానీయంలో  కచుడి చితాభస్మం కలిపి సేవిస్తాడు. కచుడంటే బృహస్పతి కుమారుడు. మృతసంజీవని విద్య నేర్చుకునేందుకు శుక్రాచార్యుని వద్ద శిష్యుడిగా చేరతాడు. అలాంటి పరిస్థితుల్లో కడుపులో ఉన్న కచుడికి మృత సంజీవినీ విద్య నేర్పించి… శిష్యుడిని బతికించి.. ఆ తర్వాత శిష్యుడి ద్వారా మళ్లీ ప్రాణం పోసుకున్నాడు శుక్రాచార్యుడు. సకల విద్యలు తెలిసిన వారినే మద్యపానం అంత వినాశనం తీసకొస్తే…మానవమాత్రులం మనమెంత…..

7 terrible addictions: ఈ ఏడు వ్యసనాలు ఉంటే మీ జీవితం అధోగతిపాలే....

వేట
వేట అనే మాట అప్పట్లో రాజులకు సంబంధించిన విషయం అయినప్పటికీ….ఇప్పటికీ స్థితిపరులకు ఇదో వ్యసనమే. ఈవేటలో పట్టుబడి కేసులు ఎదుర్కొంటున్న వారెందరో ఉన్నారు. ఇప్పుడు కోర్టులు శిక్షలు ఉంటే అప్పట్లో శాపాలుండేవి. దశరధ మహారాజు వేటకోసం వెళ్ళి, నీటి శబ్దాన్నిబట్టి బాణం వేసి జంతువులను చంపేవాడు. ఓసారి నీటి శబ్దం విని బాణ వేసినప్పుడు శ్రవణకుమారుడు బలైపోతాడు. తనకు తెలియకుండా చేసినా పాపం పాపమే కదా. శ్రవణకుమారుడి వృద్ధ తల్లిదండ్రుల శాపానికి గురైన దశరధుడు… వనవాసానికి వెళ్లిన శ్రీరాముడిని కలవరిస్తూ మరణిస్తాడు. మూగజీవాలను వేటాడితే శాపమో-శిక్షో తప్పదు…

7 terrible addictions: ఈ ఏడు వ్యసనాలు ఉంటే మీ జీవితం అధోగతిపాలే....

కఠినంగా, పరుషంగా మాట్లాడటం
సప్తవ్యసనాల్లో ఇది ఐదవది. కఠినంగా, పరుషంగా మాట్లాడటం..ఎదుటివారిపై మాట విసరడం ఎంతో ప్రమాదకరం. మాటతీరు సరిగా లేకపోవడం వల్ల ఎన్నో కుటుంబాలు విఛ్చిన్నమవుతున్నాయి. మహాభారంతో దుర్యోధనుడు పాండవులను దుర్భాషలాడి ఏ స్థితి తెచ్చుకున్నాడో అందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పట్లో దుర్భాషలాడేవారిని వేళ్లపై లెక్కెట్టేవారు…ప్రస్తుత సమాజంలో దుర్భాషలాడని వారిని వేళ్లపై లెక్కపెడుతున్నాం. అదీ తేడా…..

7 terrible addictions: ఈ ఏడు వ్యసనాలు ఉంటే మీ జీవితం అధోగతిపాలే....

కఠినంగా దండించటం
దీనికికూడా దుర్యోధనుడే ఉదాహరణ. ఒకసారి దుర్యోధనుడు తన తాతగారిని, మేనమామలని కూడా బందిఖానాలో పెడతాడు. వారికి సరైన ఆహారం కూడా అందించకండా ఇబ్బంది పెడతాడు. వాళ్ళందరికీ ఇచ్చిన అతి కొద్ది మెతుకులను శకుని ఒక్కడే తిని ప్రాణాలు నిలుపుకుని దుర్యోధనుడి చెంత చేరతాడు. కౌరవులమీద పగ తీర్చుకోవటానికి వారితో వున్నట్లు నటించి వారు నాశనమయ్యేటట్లు చేస్తాడు. ఎవరినైనా కఠినంగా దండించామని అహం సంతృప్తి చెందినా మళ్లీ అది ఎప్పటికైనా రివర్సవుతుందనేందుకు ఇంతకుమించిన ఉదాహరణ ఏముంటుంది.

7 terrible addictions: ఈ ఏడు వ్యసనాలు ఉంటే మీ జీవితం అధోగతిపాలే....

డబ్బు
లక్ష్మీదేవిని నువ్వు గౌరవిస్తే…అమ్మవారు నిన్ను కరుణిస్తుందని అంటారు పెద్దలు. నిజమేకదా… క్రమశిక్షణ లేకుండా ధనాన్ని దుర్వినియోగం చేయడం వల్ల తాత్కాలిక ఆనందం పొందొచ్చుకానీ….శాశ్వత కష్టాలు, మానసిక ప్రశాంతత కోల్పోవడం తప్పదు. ప్రస్తుతం రోజుల్లో అందరికీ క్రెడిట్ కార్డులు ఓ వ్యసనంగా మారింది. ఏదో డబ్బులు చెట్లకు కాస్తున్నట్టు…షాపింగులు, సినిమాలు, సరదాల పేరుతో కార్డులు గీకేస్తున్నారు. నిండా మునిగాక లబోదిబోమంటున్నారు. కొందరైతే ఆత్మహత్య చేసుకునే స్థాయివరకూ వెళుతున్నారు. అందుకే ధనాన్ని దుర్వినియోగం కాకుండా సద్వినియోగం చేసుకోవాలి…

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget