News
News
X

Weekly Horoscope: ఈ వారం మూడు రాశులవారికి చాలా ప్రత్యేకం.. మిగిలిన రాశుల వారికి ఈ వారం ఎలా ఉందో చూడండి..

ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

సెప్టెంబరు 5 నుంచి 11 వరకు వారఫలాలు

మేషం

ఈ వారం మీ వల్ల చాలామంది సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలొస్తాయి. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. ఏదో ఒక విషయానికి సంబంధించి ఒత్తిడికి గురవుతారు. సహనంతో వ్యవహరించాలి. కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. చిరాకు, కోపం తగ్గించునేందుకు ప్రయత్నించండి. కార్యాలయంలో ఎవరితోనైనా వివాదాలు ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.

వృషభం

ఈ రాశి యువత శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఖర్చు చేసే విషయంలో జాగ్రత్త వహించండి. వారం ఆరంభంలో ఉన్న ఆందోళన వారంతానికి తగ్గుతుంది. చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తారు. కార్యాలయంలో జాగ్రత్తగా ఉండండి...మీ ప్రత్యర్థులు మీ పనిని ఉపయోగించుకుని లాభపడతారు.

మిధునం

ఆస్తి సంబంధిత విషయాల్లో విజయం పొందుతారు. కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పని లాభాన్నిస్తుంది. ఈ వారం మీరు చాలా సంతోషంగా ఉంటారు.  కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయంతో పనులు పూర్తిచేస్తారు. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

Also Read: ఈ యూనివర్శిటీలో సిలబస్ ఉండదు...కోర్సుకి కాలపరిమితి లేదు…పరీక్షలుండవు.. నేర్చుకున్న విద్యే కొలమానం…

కర్కాటకం

ఎవరైనా మీకు హాని కలిగించే అవకాశం ఉంది..జాగ్రత్తగా ఉండండి. లావాదేవీలు జరిపే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. అపరిచితులతో ప్రైవేట్ చర్చలు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతారు. శత్రువుపై ఆధిపత్యం చెలాయిస్తారు. చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. కార్యాలయ వాతావరణం సాధారణంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఈ వారమంతా శుభసమయమే. పిల్లల వైపు నుంచి శుభవార్త వింటారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది.  సహోద్యోగుల నుంచి సహకారం అందుతుంది.

News Reels

సింహం

మీరు చాలా బిజీగా ఉంటారు. శారీరక అలసట కారణంగా బలహీనంగా అనిపించవచ్చు. దీర్ఘకాలిక నొప్పి వేధిస్తుంది. పని సజావుగా సాగుతుంది. ఇప్పటి వరకూ పెట్టిన పెట్టుబడుల నుంచి ఆదాయం పొందుతారు. పిల్లల వైపు నుంచి శుభవార్త ఉంటుంది. కొన్ని పనుల్లో అంతరాయం ఏర్పడవచ్చు. ఎవరితోనైనా వివాదానికి అవకాశం ఉంది. ఏ పనిని వాయిదా వేయవద్దు. బద్ధకంగా ఉండకండి. జీవిత భాగస్వామితో విభేదాలు ఉండొచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి.

కన్య

ఈ రాశి వ్యక్తులు ఈ వారం చాలా కష్టపడాల్సి ఉంటుంది. కఠినంగా మాట్లాడకండి. పిల్లలతో సంతోషంగా గడపండి. ప్రయాణ సమయంలో వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. కొత్తగా పెట్టుబడులు పెట్టే ఆలోచన పెట్టుకోవద్దు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. బంధువులను చాలా కాలం తర్వాత కలుసుకుంటారు.

Also read: ఈ ఏడుగురికి మరణం లేదు....ఎవరు-ఎందుకు?

తుల

ఈ వారం టెన్షన్ పెరగుతుంది. స్నేహితులను కలుస్తారు. కొత్త సమాచారం అందుబాటులో ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి పూర్తి మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.

వృశ్చికం

కొత్త ప్లాన్ అమలు చేయడానికి మీకు ఇదే మంచి అవకాశం. నిరుద్యోగులకు కలిసొచ్చే సమయం. వృద్ధులకు అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. ఇచ్చిన అప్పు తిరిగి పొందడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ  మాటల్ని అదుపులో ఉంచుకోండి. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. ఈ వారం విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. కార్యాలయంలో మీ బాధ్యతను నిర్వర్తించగలుగుతారు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి.

ధనుస్సు

ఈ వారం మీరు శుభవార్త వింటారు. స్నేహితుల సహాయంతో పనులు పూర్తిచేస్తారు. చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. రియల్ ఎస్టేట్ వివాదం కారణంగా ఇంట్లోంచి బయటకు రావాలంటే భయపడతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు. వారం మధ్యలో కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి రావొచ్చు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రత్యర్థుల కారణంగా మీరు నష్టపోయే అవకాశం ఉంది. బంధువులతో అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. మానసికంగా బలంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండాలి.

Also Read: గుడికి కొబ్బరికాయ, అరటిపండ్లు మాత్రమే ఎందుకు తీసుకెళతారు?

మకరం

ఈ వారం ఖర్చులు అధికంగా ఉంటాయి. అప్పులు చేయాల్సి రావొచ్చు. ఏ పనీ వాయిదా వేయడానికి ప్రయత్నించవద్దు. ప్రస్తుతానికి పెట్టుబడి ఆలోచన పక్కనపెట్టేయండి. వ్యాపారంలో ఒడిదొడుకులు ఉన్నప్పటికీ లాభం పొందుతారు. పాత వ్యాధులు తిరగబెడతాయి. చట్టపరమైన విషయాలు ముందుకు సాగుతాయి. కొత్త ప్రణాళికలు అమలు చేయవచ్చు.

కుంభం

ఈ వారం కొత్త సమాచారం పొందుతారు. కుటుంబంలో బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. పెండింగ్ పని పూర్తవుతుంది. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ..నైపుణ్యంతో వాటిని అధిగమిస్తారు. మీరు పాజిటివ్‌గా ఉంటారు. ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రత్యర్థుల చర్యల కారణంగా మీరు బాధపడాల్సి రావొచ్చు. అప్పులిచ్చేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించండి.

మీనం

వారం మధ్యలో మీకు , మీ కుటుంబ సభ్యులకు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. టెన్షన్ పెరుగుతుంది. ఈ వారం మీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. యువతకు మంచి సమాచారం అందుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. నిరుద్యోగులకు కలిసొచ్చే సమయం. భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. బంధువులతో ఏదో ఒక విషయంలో వివాదాలుంటాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు.

Also read: జడని మూడు పాయలతో అల్లడం వెనుక ఇంత అర్థం ఉందా?

Also Read: ముంబై నుంచి హీరోయిన్లను తీసుకొస్తే లేని తప్పు ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తే తప్పా.. మా ఎన్నికలపై బండ్ల గణేష్ హాట్‌ కామెంట్స్

Also Read: జయలలిత సమాధిని సందర్శించిన రీల్ ‘తలైవి’ కంగనా

Also read: సంపాదనంతా దాని కోసమే ఖర్చైపోయింది.. పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు.. గతం తలచుకొని రోజా కంటనీరు

 

 

Published at : 05 Sep 2021 08:54 AM (IST) Tags: Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Weekly Horoscope 5 To 11 September 2021

సంబంధిత కథనాలు

Love Horoscope Today 29th November 2022:  ఈ రాశి దంపతుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది

Love Horoscope Today 29th November 2022: ఈ రాశి దంపతుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది

Daily Horoscope Today 29th November 2022: ఈ రాశి ఉద్యోగులకు ఇంకొన్నాళ్లు ఇబ్బందులు తప్పవు, నవంబరు 29 రాశిఫలాలు

Daily Horoscope Today 29th November 2022: ఈ రాశి ఉద్యోగులకు ఇంకొన్నాళ్లు ఇబ్బందులు తప్పవు, నవంబరు 29 రాశిఫలాలు

December 2022 Horoscope: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

December 2022 Horoscope: డిసెంబర్ నెల ఈ 5 రాశులవారికి బావుంది, ఆ రాశివారికి అత్యద్భుతంగా ఉంది

Daily Horoscope Today 28th November 2022: ఈ రాశివారికి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, నవంబరు 28 రాశిఫలాలు

Daily Horoscope Today 28th November 2022: ఈ రాశివారికి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ, నవంబరు 28 రాశిఫలాలు

Kaal Bhairav Astami 2022: డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

Kaal Bhairav Astami 2022:  డిసెంబరు 1 కాలభైరవాష్టమి, దుర్గణాలు తొలగించి సిరి, సంపదలు ఇచ్చే భైరవుడు

టాప్ స్టోరీస్

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

వైఎస్ షర్మిల అరెస్ట్ తర్వాత ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

ఒక సిఎం కుర్చీకి ఎంతమంది అభ్యర్థులు? వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఏం జరగబోతుంది?

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

CM KCR : యాదాద్రి ప్లాంట్ నుంచి హైదరాబాద్ కు కనెక్టివిటీ, 2023 డిసెంబర్ నాటికి విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేయాలి- సీఎం కేసీఆర్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్