X

‘Thalaivi’ Movie Update: జయలలిత సమాధిని సందర్శించిన రీల్ ‘తలైవి’ కంగనా

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చెన్నైలో జయలలిత సమాధి వద్ద పుష్ప నివాళి అర్పించింది. తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

FOLLOW US: 

జయలిలత జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘తలైవి’ వినాయకచవితి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ మేరకు సినిమా విడుదలకు ముందు కంగనా..ఆమె చెన్నైలోని మెరీనా బీచ్ లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్మారకానికి నివాళులర్పించింది. క్వీన్ కట్టు-బొట్టు రియల్ క్వీన్ జయలలితనే తలపించింది.

ప్రస్తుతానికి ఇండస్ట్రీలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా సినీ, రాజకీయాలు రెండింటితో సంబంధం ఉన్న జయలలిత జీవితంపై సినిమా అంటే సామాన్య ప్రేక్షకులకు కూడా ఎంతో ఆసక్తి. ఇందులో భాగంగా సౌత్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్, రాజకీయనాయకురాలు అయిన జయలలిత జీవితంపై పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ‘తలైవి’ సినిమా ఒకటి.  సెప్టెంబర్ 10 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. తాగా ఈ సినిమా విడుదలకు ముందు కంగ‌నా.. చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఉన్న జ‌య స‌మాధి వ‌ద్ద‌కు వెళ్లి పుష్ప నివాళి అర్పించింది.

Also Read: సంపాదనంతా దాని కోసమే ఖర్చైపోయింది.. పిల్లలు పుట్టే అవకాశం లేదన్నారు.. గతం తలచుకొని రోజా కంటనీరు

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ఈ సినిమాను రూపొందించారు. కరోనా కారణంగా తొలుత త‌లైవి సినిమాను ఓటీటీ రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేసినా.. థియేట‌ర్ ఓన‌ర్ల ఆందోళ‌న‌తో ఆలోచన మార్చుకున్నారు.  మొద‌ట థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసేందుకు అంగీక‌రించారు. థియేటర్లో విడుదలైన రెండు వారాల తర్వాత OTT ప్లాట్ ఫామ్ సందడి చేయనుంది. ఈ సినిమాలో కంగనాతో పాటూ అర‌వింద స్వామి, సామ్నా కాసిమ్‌, స‌ముతిరాకాని, భాగ్య‌శ్రీ, ప్రియ‌మ‌ణి న‌టిస్తున్నారు.

వాస్తవానికి ఈ సినిమాను ఏప్రిల్ 23 న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా ఆలస్యం కావడంతో  సెప్టెంబర్ 10 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తెస్తున్నారు. ``అమ్మ జయలలిత వ్యక్తిత్వాన్ని ఆమె కథను బిగ్ స్క్రీన్ పై మాత్రమే చూడడానికి అర్హమైనది! ఆమె సినిమా ప్రపంచంలోకి సూపర్ స్టార్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నందున..మళ్లీ అదే దరహాసం! సెప్టెంబర్ 10 న మీకు సమీపంలో ఉన్న సినిమా థియేటర్లలోలో తలైవి చూడండి!`` అని పోస్ట్ చేసింది కంగనా. జయలలిత జీవితంలోని విభిన్న కోణాలను ఈ చిత్రంలో చూపిస్తున్నారు.

Also Read: సరదా తీరిపోతోంది..ఇంక నావల్లకాదంటున్న హీరో కార్తికేయ , అలరిస్తోన్న ''రాజా విక్రమార్క'' టీజర్

Also Read: షారుఖ్ ఖాన్ తో నయనతార, ప్రియమణి..ఎట్టకేలకు బాలీవుడ్ లో అడుగుపెట్టిన లేడీ సూపర్ స్టార్

Also Read: ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ పూర్తైందని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు..మరి తారక్-చెర్రీకి జక్కన్న ఎందుకు కబురుపెట్టినట్టు..

Tags: Photos Goes Viral ‘Thalaivi’ Heroin Kangana Ranaut Tribute Jayalalithaa's memorial

సంబంధిత కథనాలు

Pawan Kalyan: పవన్ టార్గెట్.. దర్శకులు రీచ్ అవుతారా..?

Pawan Kalyan: పవన్ టార్గెట్.. దర్శకులు రీచ్ అవుతారా..?

Dhanush: విడాకులు తీసుకున్న ధనుష్, ఐశ్వర్య.. ఇప్పుడు ఒకే హోటల్ లో..

Dhanush: విడాకులు తీసుకున్న ధనుష్, ఐశ్వర్య.. ఇప్పుడు ఒకే హోటల్ లో..

Sarkaru Vaari Paata: మహేష్ సినిమా టైటిల్ సాంగ్ ట్యూన్‌ ప్లే చేసిన తమన్.. ఫ్యాన్స్ ఖుషీ..

Sarkaru Vaari Paata: మహేష్ సినిమా టైటిల్ సాంగ్ ట్యూన్‌ ప్లే చేసిన తమన్.. ఫ్యాన్స్ ఖుషీ..

Sree Leela: 'పెళ్లి సందడి' ముద్దుగుమ్మ.. నాలుగు ఆఫర్లు పట్టేసింది..

Sree Leela: 'పెళ్లి సందడి' ముద్దుగుమ్మ.. నాలుగు ఆఫర్లు పట్టేసింది..

Lata Mangeshkar: లతా మంగేష్కర్ ఆరోగ్యంపై వదంతులు... స్పందించిన లతా దీదీ కుటుంబ సభ్యులు... వైద్యుల ప్రకటన ట్వీట్

Lata Mangeshkar: లతా మంగేష్కర్ ఆరోగ్యంపై వదంతులు... స్పందించిన లతా దీదీ కుటుంబ సభ్యులు... వైద్యుల ప్రకటన ట్వీట్
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Minister Harish Rao: కరోనా వ్యాప్తిపై ఆందోళన వద్దు... రాష్ట్రంలో 56 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయి.. మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao: కరోనా వ్యాప్తిపై ఆందోళన వద్దు... రాష్ట్రంలో 56 వేల బెడ్స్ అందుబాటులో ఉన్నాయి.. మంత్రి హరీశ్ రావు

Micromax New Phone: మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్ వచ్చేది అప్పుడే.. రూ.15 వేలలోనే సూపర్ ఫీచర్లు!

Micromax New Phone: మైక్రోమ్యాక్స్ కొత్త ఫోన్ వచ్చేది అప్పుడే.. రూ.15 వేలలోనే సూపర్ ఫీచర్లు!

Netaji Subhash Chandra Bose: దేశవ్యాప్తంగా నేతాజీ 125వ జయంతి వేడుకలు... బోస్ హోలోగ్రామ్ విగ్రహం ఆవిష్కరించనున్న ప్రధాని... రిపబ్లిక్ డే వేడుకలకు నేడు శ్రీకారం

Netaji Subhash Chandra Bose: దేశవ్యాప్తంగా నేతాజీ 125వ జయంతి వేడుకలు... బోస్ హోలోగ్రామ్ విగ్రహం ఆవిష్కరించనున్న ప్రధాని... రిపబ్లిక్ డే వేడుకలకు నేడు శ్రీకారం

Delhi HC: వివాహ బంధంలో భర్తకు ఆ హక్కు ఉంది... భార్యతో లైంగిక సంబంధం ఆశించవచ్చు.... దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు...

Delhi HC:  వివాహ బంధంలో భర్తకు ఆ హక్కు ఉంది... భార్యతో లైంగిక సంబంధం ఆశించవచ్చు.... దిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు...