Raja Vikramarka Teaser: సరదా తీరిపోతోంది..ఇంక నావల్లకాదంటున్న హీరో కార్తికేయ , అలరిస్తోన్న ''రాజా విక్రమార్క'' టీజర్
Rx 100' ఫేమ్ కార్తీకేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''రాజా విక్రమార్క''. తాజాగా ఈ మూవీ టీజర్ విడుదల చేశారు..
మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘రాజావిక్రమార్క’ టైటిల్ తో వస్తోన్నాడు RX 100 హీరో కార్తికేయ. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్ఐఏ ఆఫీసర్ గా కార్తికేయ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ భలే ఆకట్టుకుంది. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా 'రాజా విక్రమార్క' టీజర్ విడుదల చేశారు.
Here is the super intriguing teaser of #RajaVikraMarka
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) September 4, 2021
Love your choice of films @ActorKartikeya
Wishing you and the entire team all the best!!
Teaser link:https://t.co/MOesNqYFS1@ActorKartikeya@actortanya @SriSaripalli_ @88Ramareddy @AdireddyT @prashanthvihari pic.twitter.com/fGKMW26vZc
NIA అధికారి అయిన కార్తికేయ ఓ సీక్రెట్ మిషన్ లో భాగంగా..అనుకోకుండా నిందితుడైన నైజీరియన్ ని కాల్చి చంపినట్లు టీజర్ లో చూపించారు. ఇందులో హై ఇంటెన్స్ యాక్షన్ తో పాటుగా హ్యూమర్ కూడా ఉన్నట్లు హింట్ ఇచ్చారు. 'మార్కింగ్ కాశ్మీర్ లో మిలిటెంట్లు కి దొరికిపోయి.. సెకండ్ షో చూడానికి ఢిల్లీ కి వచ్చాడు.. వాడిని ఆపడం ఎవరి తరం' అంటూ ఇందులో కార్తికేయ పాత్ర గురించి చెప్పుకొచ్చారు. టీజర్ చివర్లో డైలాగ్ ఆకట్టుకుంటోంది. ''చిన్నప్పుడు కృష్ణ గారిని పెద్దయ్యాక టామ్ క్రూజ్ ని చూసి ఆవేశపడి జాబ్ లో జాయిన్ అయిపోయా కానీ.. సరదా తీరిపోతోంది. ఇంక నావల్ల కాదు'' అని కార్తికేయ చెప్పే డైలాగ్ భలే అనిపిస్తోంది.
కార్తికేయ సరసన తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటించింది. సుధాకర్ కోమాకుల తోటి NIA అధికారిగా ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నాడు. తనికెళ్ల భరణి,సాయి కుమార్, పశుపతి, హర్ష వర్ధన్ ఇతర పాత్రలు పోషించారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. 'రాజా విక్రమార్క' చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Taking you into an action-packed fun ride with our dynamic agent #𝐑𝐚𝐣𝐚𝐕𝐢𝐤𝐫𝐚𝐦𝐚𝐫𝐤𝐚 aka @ActorKartikeya 🔥
— BA Raju's Team (@baraju_SuperHit) September 4, 2021
#RajaVikramarkaTeaser
▶️https://t.co/X9ZCuMTRMd@actortanya @SriSaripalli_ @88Ramareddy @AdireddyT @prashanthvihari @SCMMOffl @saregamasouth @PulagamOfficial pic.twitter.com/72Vbxs8iud
‘ప్రేమతో మీ కార్తీక్’ సినిమాతో పరిచయమైన కార్తికేయ గుమ్మకొండ.. ఆ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘RX100’ మూవీతో ఓవర్ నైట్ పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత నాని హీరోగా నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసి వావ్ అనిపించాడు. ఆ తర్వాత తెలుగులో ‘హిప్పి’, ‘గుణ 369’, 90 ML, చావు కవురు చల్లగా వంటి సినిమాల్లో నటించాడు. తాజాగా చిరంజీవి హీరోగా నటించిన అలనాటి సినిమా టైటిల్ ‘రాజా విక్రమార్క’ టైటిల్‌తో కొత్త సినిమా చేసాడు. RX100 తర్వాత ఇప్పటి వరకూ ఆ రేంజ్ హిట్టందుకోలేకపోయిన కార్తికేయ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు..
Also Read: షారుఖ్ ఖాన్ తో నయనతార, ప్రియమణి..ఎట్టకేలకు బాలీవుడ్ లో అడుగుపెట్టిన లేడీ సూపర్ స్టార్
Also Read: కళ్లజోడు జారకుండా.. దుమ్ము దులిపేస్తున్న ‘టక్ జగదీష్’ సాంగ్.. దర్శకుడు అడ్డంగా బుక్కయ్యాడు!
Also Read:వామ్మో ఎంత హాటో...ఐదు పదులకు చేరువవుతున్నా మతిపోగొట్టేస్తున్న మలైకా...