అన్వేషించండి

RRR Update: ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ పూర్తైందని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు..మరి తారక్-చెర్రీకి జక్కన్న ఎందుకు కబురుపెట్టినట్టు..

'ఆర్ ఆర్ ఆర్' మూవీ షూటింగ్ ఈ మధ్యే పూరైందనే వార్తలు రావడంతో తారక్-చెర్రీ అభిమానులు హమ్మయ్య అనుకున్నారు. ఇంతలోనే షాకిచ్చాడు దర్శకధీరుడు. అగైన్ స్టార్ట్ కెమెరా యాక్షన్ అంటున్నాడట.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న మూవీ ''ఆర్.ఆర్.ఆర్''. ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ పూర్తైదని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. కేక్ కట్ చేసి సంబరాలు కూడా చేసుకున్నారు రాజమౌళి అండ్ టీమ్. దీంతో హమ్మయ్య ఎట్టకేలకు తమ అభిమాన హీరోలు షూటింగ్ పూర్తిచేసుకున్నారు ఇక తదుపరి ప్రాజెక్టులపై దృష్టిసారిస్తారని భావించారు. కానీ ఇంతలోనే జక్కన్న మళ్లీ చెక్కుదాం అంటున్నాడట. కొన్ని సీన్స్ రీషూట్ కోసం తారన్-చెర్రీని మళ్లీ సెట్స్ మీదకి పిలుస్తున్నాడని టాక్.

పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ లో బిజీగా ఉన్న జక్కన్న… 'ఆర్ ఆర్ ఆర్' సినిమాలో ఇప్పటికే తెరకెక్కించిన కొన్ని కీలక సన్నివేశాలు మరింత పర్ ఫెక్ట్ గా తీయాలని భావిస్తున్నాడట. అందుకే కనీసం ఓ నాలుగైదు రోజులు షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ - రామ్ చరణ్ ల కొత్త ప్రాజెక్టులతో బిజీ అయిపోకముందే వీటి షూట్ కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యారట. వాస్తవానికి రాజమౌళి ఇప్పటి వరకూ ఎప్పుడూ చెప్పిన సమయానికి షూటింగ్ పూర్తిచేయలేదు. ముందుగా నిర్ణయించిన సమయానికి సినిమా విడుదల చేయలేదు. అయితే 'ఆర్ ఆర్ ఆర్' మాత్రం కరోనా కారణంగా ఆలస్యమైందుకున్నారు. కానీ ఇంతలోనే మళ్లీ చిత్రీకరణ ప్లాన్ చేశాడనే వార్త విని ఎన్టీఆర్-రామ్ చరణ్ అభిమానులు మరింత లేట్ అవుతుందేమో అని డిస్సప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే అనుకున్న సమయం కన్నా ఎక్కువ టైం తీసుకుంటే అది తారక్ - చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్టులపై పడుతుందన్నది వారి భావన.

Also Read: షారుఖ్ ఖాన్ తో నయనతార, ప్రియమణి..ఎట్టకేలకు బాలీవుడ్ లో అడుగుపెట్టిన లేడీ సూపర్ స్టార్

ఈ సినిమాలో మన్యంవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, గోండు బెబ్బులి కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఆలియా భట్ - ఒలివియా మోరిస్ వీరికి జోడీగా కనిపించనున్నారు. అజయ్ దేవగన్ , సముద్రఖని, శ్రియ కీలక పాత్రలు పోషిస్తున్నారు. DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డి.వి.వి.దానయ్య నిర్మాత, కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' ప్రకటించిన తేదీకే రావడం లేదని  ఇప్పటికే స్పష్టమైంది. మరి అక్టోబర్ 13న రాకపోతే తదుపరి విడుదల తేదీని ఎప్పుడు అనౌన్స్ చేస్తారా అని వేచి చూస్తున్నారు. ఇప్పటికే 2022 సంక్రాంతికి కానుకగా జనవరి 8న 'RRR' సినిమా వచ్చే అవకాశం ఉందని కొందరు, సమ్మర్ కానుకగా వస్తుందని మరికొందరు చెబుతున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి. ఇంతకీ ఇద్దరు హీరోలను పిలిచింది ప్యాచ్ వర్కుల కోసమా…మరికొన్ని కీలక సన్నివేశాల రీ షూట్ కోసమా అన్నది తెలియాల్సి ఉంది.

Also Read: ప్రకాశ్ రాజ్ ‘మా’ ప్యానెల్ ఇదే..వాళ్లిద్దర్నీ కూడా కలిపేసుకున్నారు..

Also Read: భీమ్లా నాయక్‌ పాటపై వివాదం.. ఐపీఎస్ అధికారి ఆగ్రహం, మా సేవలను మరిచిపోయారు!

Also Read: ‘మా’లో విందు రాజకీయాలు.. నరేష్ మెసేజ్ వైరల్!

టాప్ హెడ్ లైన్స్

RS 20000 Subsidy For BCs: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..సోలార్ ప్యానల్ ఏర్పాటుపై 20వేల రాయితీ!
Jagadhatri Serial Today JULY 9th:చిలకమ్మను కిడ్నాపర్ల నుంచి కాపాడిన కౌషికి...శ్రీవల్లి కోసం మీనన్ మనుషులు ఎందుకు వెతుకుతున్నారు..?
జగద్ధాత్రి సీరియల్:చిలకమ్మను కిడ్నాపర్ల నుంచి కాపాడిన కౌషికి...శ్రీవల్లి కోసం మీనన్ మనుషులు ఎందుకు వెతుకుతున్నారు..?
Lenin OTT : అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
అఖిల్ లెనిన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఫిక్స్ - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Gurthukosthunnayi Series OTT : మరో ఓటీటీలో రొమాంటిక్ కామెడీ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి' - 100+ మిలియన్ వ్యూస్... ఎందులో చూడొచ్చంటే?
మరో ఓటీటీలో రొమాంటిక్ కామెడీ సిరీస్ 'గుర్తుకొస్తున్నాయి' - 100+ మిలియన్ వ్యూస్... ఎందులో చూడొచ్చంటే?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MS Raju vs Thopudurthi Prakash Reddy: అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
అనంతపురంలో రాజకీయ సెగలు! ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు vs తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి! అసలు వివాదం ఏంటీ?
Konda Surekha vs Kadiam Srihari: కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
కాంగ్రెస్‌లో కాకరేపుతున్న వరంగల్ పంచాయితీ! కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు!
Telangana Crime News: నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
నా ప్రియురాలికి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారు- పోస్టర్లు వేసిన యువకుడు- పోలీస్ కేసు నమోదు!
YouTuber Joseph Ravan: యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
యూట్యూబర్ జోసెఫ్ రావణ్‌కు బిగ్‌షాక్! ఖాతాలు ఫ్రీజ్ చేయించిన పోలీసులు!
Sai Pallavi : కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
కారు కోసం ముద్దు సీన్లలో నటించను - ఆ సీన్స్‌పై నేచరల్ బ్యూటీ సాయి పల్లవి రియాక్షన్
Blue Aadhaar Card:బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
బ్లూ ఆధార్ కార్డు గురించి తెలుసా? సాధారణ ఆధార్‌తో పోలిస్తే వ్యత్యాసం ఏంటీ? దీనికి అర్హులెవరు?
Tirupati Crime News: తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
తిరుపతి పద్మావతి కళ్యాణ మండపాలలో డబల్ మర్డర్- పెళ్లి విషయంలో వివాదం!
Hindu Tradition: పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
పెళ్లైన వెంటనే దంపతులిద్దరూ మొదట ఏం చేయాలి - కొత్త జీవితం ఆరంభం ఎలా ఉండాలి?
Embed widget