MAA Elections: ‘మా’లో విందు రాజకీయాలు.. నరేష్ మెసేజ్ వైరల్!
మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికలు కాక రేపుతున్నాయి. అక్టోబరులో ఎన్నికలు నిర్వహిస్తామనే ప్రకటన రావడంతో తెరవెనుక డ్రామాలు మొదలయ్యాయి. ఈ సారి అధ్యక్ష బరిలో ఏకంగా ఐదుగురు సభ్యులు నిలబడ్డారు.
మా ఎన్నికలు మునుపెన్నడూ లేనంతగా హీట్ పుట్టిస్తున్నాయి. రోజు రోజుకీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సాధారణ ఎన్నికలను మించి అనిపిస్తున్నాయి. అక్టోబర్ 10న ‘మా’కు ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమశిక్షణ సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పోటీదారులు.. మా సభ్యులను తమ వైపు తిప్పుకొనేందుకు రాజకీయాలు మొదలుపెట్టారు.
ఈసారి ప్రధానంగా పోటీ రెండు ప్యానెళ్ల మధ్యనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. మొన్నటి వరకు మాటలకే పరిమితమైన రాజకీయం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది. తాజాగా ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ పేరుతో ఓ ఆహ్వానం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
శనివారం సాయంత్రం 6 గంటలకు ఏర్పాటు చేస్తున్న పార్టీకి తప్పకుండా రావాలంటూ డాక్టర్ నరేష్ విజయ్‌కృష్ణ పేరుతో ఓ మెసేజ్ గురువారం పలువురు నటీనటుల వాట్సాప్ గ్రూప్‌లలో సర్కులేట్ అయ్యింది. హైదరాబాద్‌లోని దశపల్లా ఫోరమ్ హాల్‌లో ఏర్పాటు చేయనున్న ఈ విందు కార్యక్రమానికి ఆహ్వానం శుక్రవారం వస్తుందని ఆ సందేశంలో పేర్కొన్నారు. అయితే ఈ మెసేజ్ ప్రకాష్ రాజ్ ప్యానెల్‌కు తప్ప మిగిలిన సభ్యులకు ఫార్వర్డ్ చేస్తుండడం గమనార్హం. నరేష్ వర్గం మంచు విష్ణుకి మద్ధతు ఇస్తోంది.
వాస్తవానికి విందు రాజకీయానికి మొదట ప్రకాష్ రాజ్ ప్యానెల్ తెర తీసిందని చెప్పాలి. ఇటీవల జరిగిన నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా పార్టీ ఉందంటూ ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యుడు సమీర్ ఆహ్వానం ఇచ్చారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు మెగాబ్రదర్ నాగబాబు మద్ధతు బహిరంగంగా ఉంది. ఇప్పటికే తమ ప్యానెల్ గెలుపు కోసం నాగబాబు చేయాల్సినదంతా చేస్తున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ ప్రకటించిన ప్యానెల్ లో ఇద్దరికి పోటీ అర్హత లేకపోవడంతో కొత్త సభ్యులను బరిలోకి దించుతారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: ఈడీ ముందుకు రకుల్ ప్రీత్ సింగ్.. నాడు బాలీవుడ్.. నేడు టాలీవుడ్ కేసులో!
ఇక ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండడంతో ఎవరికి వారు విందు రాజకీయాలు మొదలెట్టారు. ఒకరిపై ఒకరు ఎత్తులు పైఎత్తులతో సాధారణ ఎన్నికల్లా గడబిడకు తెర తీసారు. ఎవరు గెలిచినా 2021-24 సీజన్ కి ఈసారి మా అధ్యక్ష కార్యవర్గం పాలన సాగించాల్సి ఉంటుంది. మొత్తానికి గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి మా ఎన్నికలు కాకరేపుతున్నాయి.
Also Read: ‘బిగ్‌బాస్’ విన్నర్ మృతిపై సందేహాలు.. ఆ రాత్రి ఏం జరిగింది? పోలీసులు ఏమన్నారంటే..
Also Read: ఆర్జీవీ చెంప పగలగొట్టిన అషూ రెడ్డి.. పవన్ కళ్యాణ్‌కు గిఫ్ట్.. వర్మ మళ్లీ తెగించారు
Also Read: బొమ్మరిల్లు సిద్ధార్థ్ చనిపోయాడంటూ ప్రచారం.. కావాలనే చేస్తున్నారంటూ ఆవేదన