అన్వేషించండి

MAA Election: ప్రకాశ్ రాజ్ ‘మా’ ప్యానెల్ ఇదే.. వాళ్లిద్దర్నీ కూడా కలిపేసుకున్నారు..

'మా' అధ్యక్ష పదవికి పోటీపడుతున్న ప్రకాశ్ రాజ్ తన కార్యవర్గాన్ని ప్రకటించాడు. అధ్యక్ష బరిలో నిలిచిన జీవిత, హేమను సైతం అనూహ్యంగా తన ప్యానెల్లోకి చేర్చారు ప్రకాశ్ రాజ్. ఇంకా ఎవరెవరు ఉన్నారో చూద్దాం..

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. ఇప్పటికే విందులకు ఆహ్వానించి ‘మా’లో సరికొత్త రాజకీయానికి తెరతీశారు. దానిపై ఇంకా చర్చ జరుగుతుండానే ప్రకాశ్ రాజ్ తన ప్యానెల్ ప్రకటించారు. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ప్రకాశ్ రాజ్.. మెయిన్ ప్యానెల్, ఎగ్జిక్యూటివ్ ప్యానెళ్లను ప్రకటించారు.

సీనియర్ నటి జయసుధ, నటి జీవిత, నటి హేమ అధ్యక్షపదవి  పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని ధృవీకరించిన ప్రకాశ్ రాజ్... జయసుధను మెయిన్ ప్యానెల్‌లోకి తీసుకోవాలని అనుకున్నామని, కానీ ఆమె అధికార ప్రతినిధిగా ఉంటానని చెప్పారని ప్రకాశ్ రాజ్ తెలిపారు. జయసుధతోపాటు జీవిత, సాయి కుమార్, బండ్ల గణేశ్, బెనర్జీ అధికార ప్రతినిధులుగా ఉంటారని ప్రకాశ్ రాజ్ క్లారిటీ ఇచ్చారు. జీవిత రాజశేఖర్, హేమతో తాను వ్యక్తిగతంగా మాట్లాడానని తెలిపారు. ‘మా’ అసోసియేషన్ మూడు , నాలుగు విభాగాలుగా విడిపోకూడదని చెప్పానన్నారు.  

Also Read: ‘మా’లో విందు రాజకీయాలు.. నరేష్ మెసేజ్ వైరల్!

ఇక ప్యానెల్ విషయానికొస్తే ప్రగతి, అనసూయ, అజయ్, సుబ్బరాజు, సమీర్, ఖయ్యూం, బ్రహ్మాజీ, కౌశిక్, ప్రభాకర్, భూపాల్, శివారెడ్డి, రమణారెడ్డి, సుడిగాలి సుధీర్, సురేశ్ కొండేటి, తనీష్, టార్జాన్, రూపాల్, గోవిందరావ్,శ్రీధర్ రావు  సభ్యులుగా ఉన్నారు. ఇక ట్రెజరర్ ఎవరన్న దానికి వస్తే.. నాగినీడుని ఎంపిక చేశామని ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఆయనకు ప్రసాద్ ల్యాబ్‌ లాంటి మహాసంస్థను నడిపిన అనుభవం వుందని, అకౌంట్స్ గురించి తెలుసునని.. ముక్కుసూటితనం ఉందని నాగినీడును ప్రశంసించారు. 

Also Read: భీమ్లా నాయక్‌ పాటపై వివాదం.. ఐపీఎస్ అధికారి ఆగ్రహం, మా సేవలను మరిచిపోయారు!

జాయింట్ సెక్రటరీగా అనితా చౌదరిని ప్రకటించారు. మహిళల హక్కుల గురించి ఆమె పోరాడతారని ప్రశంసించారు.  మరో జాయింట్ సెక్రటరీగా ఉత్తేజ్‌ను ప్రకటించిన ప్రకాశ్ రాజ్. నాటక రంగంతో పాటు సినీ రంగంలో ఉత్తేజ్‌కు అపార అనుభవం వుందని తెలిపారు. వైస్ ప్రెసిడెంట్స్ విషయానికి వస్తే బెనర్జీని పేరు ప్రకటించారు. ఆయన ఈసీ మెంబర్‌గా, జాయింట్ సెక్రటరీగా మా అసోసియేషన్‌లో పనిచేశారని తెలిపారు. మరో వైస్ ప్రెసిడెంట్‌గా హేమను ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్స్‌గా శ్రీకాంత్‌, జనరల్ సెక్రటరీగా జీవితా రాజశేఖర్‌ను ప్రకటించారు. అక్టోబర్ 10న ‘మా’కు ఎన్నికలు నిర్వహించనున్నట్లు క్రమశిక్షణ సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి ప్రధానంగా పోటీ రెండు ప్యానెళ్ల మధ్యనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు.

Also Read: గుర్రం చనిపోయిందని డైరెక్టర్‌ మణిరత్నంపై కేసు

Also Read: బొమ్మరిల్లు సిద్ధార్థ్ చనిపోయాడంటూ ప్రచారం.. కావాలనే చేస్తున్నారంటూ ఆవేదన

టాప్ హెడ్ లైన్స్

Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Avengers Doomsday Promo : అవెంజర్స్ డూమ్స్ డే ప్రోమో వచ్చేసింది - ఐరన్ మ్యాన్ పవర్ ఫుల్ విలన్
అవెంజర్స్ డూమ్స్ డే ప్రోమో వచ్చేసింది - ఐరన్ మ్యాన్ పవర్ ఫుల్ విలన్
Govinda Sunita Ahuja : కూతురి వయసున్న అమ్మాయితో ఇలానా! - గోవిందాపై భార్య సునీత ఫైర్
కూతురి వయసున్న అమ్మాయితో ఇలానా! - గోవిందాపై భార్య సునీత ఫైర్
I Nobody OTT : ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి వారణాసి విలన్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget