అన్వేషించండి

Bheemla Nayak Title Song: భీమ్లా నాయక్‌ పాటపై వివాదం.. ఐపీఎస్ అధికారి ఆగ్రహం, మా సేవలను మరిచిపోయారు!

పవర్ స్టార్ బర్త్ డే కానుకగా విడుదలైన భీమ్లానాయక్ టైటిల్ సాంగ్ యూ ట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేసింది. అభిమానుల్ని ఊపేసింది. అయితే తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ ఒకరు మాత్రం ఈ పాటపై మండిపడ్డారు. ఏందుకంటే...

పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భీమ్లా నాయక్'. ‘అయ్యనుప్పుమ్’ కోషియం రీమేక్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ఆగస్టు 15న ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా.. పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబరు 2న టైటిల్ సాంగ్ విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్వరపరిచిన ఈ పాట మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటకు సాహిత్యం అందించగా.. మొగులయ్య , రామ్ మిరియాల,  శ్రీ కృష్ణ,  పృథ్వీ చంద్ర ఆలపించారు. అయితే ఇప్పుడీ పాటపై తెలంగాణ సీనియర్ IPS అధికారి,  హైదరాబాద్ ఈస్ట్ జోన్ డిసిపి ఎం.రమేష్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Thankfully, @TelanganaCOPs are #PeopleFriendlyPolice . We don’t break the bones of those whom we are paid to protect ! Surprisingly, @ramjowrites couldn’t find enough words in Telugu to describe the valour of a cop. No mention of service in the song. https://t.co/EsQVaW5p2s

హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా '‘ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండ,  ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్దగూండా, నిమ్మళంగ కనబడే నిప్పుకొండ, ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా, ఇస్తిరి నలగని చొక్కా పొగరుగ తిరిగే తిక్క, చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా విరుగును బొక్క. ఎవ్వడైన ఈడి ముందు గడ్డిపోస.. ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస.. కుమ్మడంలో విడే ఒక బ్రాండు తెల్సా.. వీడి దెబ్బతిన్న ప్రతీవాడు పాస్టుటెన్సా..'’ అంటూ రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ పవన్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. 'భీమ్లా నాయక్' సినిమాలో సబ్ ఇన్స్పెక్టర్ పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని రామజోగయ్య శాస్త్రి ఈ లిరిక్స్ రాశారు. అయితే ఈ సాహిత్యం విని రియల్ పోలీసులు కాస్త అప్సెట్ అయ్యారు.

'థ్యాంక్ ఫుల్లీ.. తెలంగాణా కాప్స్ ఫ్రెండ్లీ పోలీసులు. మేము రక్షించే వాళ్ళమే కానీ. ఎముకలు విరగొట్టే వాళ్ళం కాదు. ఆశ్చర్యకరంగా రామజోగయ్య శాస్త్రికి పోలీసుల పరాక్రమాన్ని వర్ణించడానికి తెలుగులో సరైన పదాలు దొరకలేదు. పాటలో పోలీసుల సేవ గురించి ఎక్కడా ప్రస్తావించలేదు'' అని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ ట్వీట్ చేశారు.

'భీమ్లా నాయక్' చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే - డైలాగ్స్ అందిస్తున్నారు. ఇది మలయాళ బ్లాక్ బస్టర్ 'అయ్యప్పనుమ్ కొశీయుమ్' చిత్రానికి అధికారిక రీమేక్. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిత్యా మీనన్.. రానా కు జోడీగా ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Also Read: బొమ్మరిల్లు సిద్ధార్థ్ చనిపోయాడంటూ ప్రచారం.. కావాలనే చేస్తున్నారంటూ ఆవేదన

Also Read: ఈడీ ముందుకు రకుల్ ప్రీత్ సింగ్.. నాడు బాలీవుడ్.. నేడు టాలీవుడ్ కేసులో!

Also Read: ‘బిగ్‌బాస్’ విన్నర్ మృతిపై సందేహాలు.. ఆ రాత్రి ఏం జరిగింది? పోలీసులు ఏమన్నారంటే..

Also Read: ఆర్జీవీ చెంప పగలగొట్టిన అషూ రెడ్డి.. పవన్ కళ్యాణ్‌కు గిఫ్ట్.. వర్మ మళ్లీ తెగించారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget