Jawaan Movie: షారుఖ్ ఖాన్ తో నయనతార, ప్రియమణి..ఎట్టకేలకు బాలీవుడ్ లో అడుగుపెట్టిన లేడీ సూపర్ స్టార్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, లేడీ సూపర్ స్టార్ నయనతార కాంబినేషన్లో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఇందులో ప్రియమణి కూడా కీలకపాత్ర పోషిస్తోంది. ఈ సినిమా డీటేల్స్ ఏంటో చూద్దాం..
కోలీవుడ్ దర్శకుడు అట్లీతో షారుక్ ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టు రెండేళ్లుగా వస్తున్న వార్తలు ఇన్నాళ్లకి నిజమయ్యాయి. ఎట్టకేలకు వీరిద్దరి కాంబినేషన్లో ‘జవాన్’ సినిమా పట్టాలెక్కింది. ఇందులో విశేషం ఏంటంటే లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రియమణి హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలన్‌గా రానాను తీసుకునే యోచనలో ఉన్నారని టాక్. పూనేలో ప్రారంభమైన షూటింగ్ వరుసగా పది రోజుల పాటూ జరగనుందని తెలుస్తోంది.
సౌత్ లో నయనతార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. టైమ్ చూసుకునే టైం లేనంత బిజీగా ఉంటుంది నయనతార. అమ్మడి డేట్స్ కోసం క్యూ కడతారు దర్శకనిర్మాతలు. రొటీన్ కి భిన్నంగా కెరీర్ ఆరంభంలో సీనియర్ హీరోలతో మాత్రమే అవకాశాలు దక్కించుకున్న నయన్…సెకెండ్ ఇన్నింగ్స్ లో వరుసగా యంగ్ హీరోలతో నటించడమే కాదు, లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో వరుస విజయాలందుకుంది. వాస్తవానికి సౌత్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఆరంభంలోనే బాలీవుడ్ నుంచి ఎన్నో అవకాశాలొచ్చాయి. కానీ ఎందుకనో బాలీవుడ్ పై పెద్దగా ఆశక్తి చూపలేదు నయన్. మరోవైపు సౌత్ లో తన స్టార్ డమ్ ని వదులుకుని ఇతర భాషలకు వెళ్లే ఆలోచన కూడా చేయలేదు. ఇన్నాళ్లకి బాలీవుడ్ లో ఓ సినిమాకి సైన్ చేసింది.
Also Read: ప్రకాశ్ రాజ్ ‘మా’ ప్యానెల్ ఇదే..వాళ్లిద్దర్నీ కూడా కలిపేసుకున్నారు..
మరో ముఖ్యమైన పాత్రకి ఎంపికైన ప్రియమణి …ఇదివరకే కింగ్ ఖాన్ ‘చెన్నై ఎక్స్ ప్రెస్’ లో ఓ పాటలో సందడి చేసింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో బీటౌన్లో ఫాలోయింగ్ సంపాదించుకుంది. త్వరలోనే షూటింగ్ లో పాల్గొననుంది. వాస్తవానికి బాలీవుడ్ లో ఎప్పుడో సినిమా చేయాల్సింది ప్రియమణి. అవకాశాలిస్తామని చెప్పిన బడా స్టార్లు ఆ తర్వాత ముఖం చాటేసారు. ఇలాంటి సమయంలో ఫ్యామిలీ మ్యాన్ రెండు సీజన్లలోనూ ప్రియమణి నటనకు మంచి గుర్తింపు దక్కింది. అంటే భంగపడిన చోటే ఇప్పుడు తిరిగి ప్రియమణి అవకాశాలు అందుకుంటోంది.
Also Read: భీమ్లా నాయక్ పాటపై వివాదం.. ఐపీఎస్ అధికారి ఆగ్రహం, మా సేవలను మరిచిపోయారు!
సన్యా మల్హోత్రా, సునీల్ గ్రోవర్ వంటి స్టారింగ్‌తో రానున్న ఈ పాన్ ఇండియన్ సినిమాలో నార్త్, సౌత్‌కు చెందిన మరికొంతమంది నటలు జాయిన్ కానున్నారు. ఇక షారుక్-దీపిక ‘పఠాన్’ మూవీ షూటింగ్ కూడా చివరిదశకు చేరుకోవడంతో.. అట్లీ ప్రాజెక్ట్ తర్వాత రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నాడు షారుఖ్. ఇప్పటికే పూనేలో ప్రారంభమైన షెడ్యూల్ లో షారుక్-నయన్-ప్రియమణి పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట.
Also Read: ‘మా’లో విందు రాజకీయాలు.. నరేష్ మెసేజ్ వైరల్!