By: ABP Desam | Updated at : 29 Jul 2021 04:19 PM (IST)
తక్షశిల విశ్వవిద్యాలయం
ప్రపంచంలోనే అతి పురాతన విశ్వవిద్యాలయాల్లో తక్షశిల ఒకటి. ప్రస్తుత విశ్వవిద్యాలయాలు నేర్పే విద్యతో పోల్చితే తక్షశిల విశ్వవిద్యాలయంలో నేర్పే విద్య ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆహా అనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో ఇలాంటి విశ్వవిద్యాలయాలు సాధ్యమా అనిపిస్తుంది..
తక్షశిల విశ్వవిద్యాలయంలో ఎలాంటి ఫీజులు ఉండవు. కోర్సుకి ఇంత కాలం అనే పరిమితి ఉండదు. ఈ యూనివర్శిటీ ప్రత్యేకత ఏంటంటే ఏ శాస్త్రబోధనలోనూ పాఠ్యాంశానికి సంబంధించి ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైన సిలబస్ ఉండదు. చదువు ఎంతకాలం చదవాలనే నిబంధన అస్సలే ఉండదు. సంవత్సరాలు కొలమానం కాదు…నేర్చుకున్న విద్య కొలమానం. గురువు తన శిష్యులకు ఎంతకాలం అవసరమైతే అంతకాలం విద్య నేర్పించి పంపిస్తారు.
వాళ్లిచ్చిన కోర్సులో చేరడం కాదు…అందులో చేరాలనుకునే వ్యక్తి తెలివితేటల ఆధారంగా కోర్సు కేటాయిస్తారు. బోధనానంతరం పరీక్షలు , మార్కులు, పట్టా ప్రధానోత్సవం ఇలాంటివేవీ ఉండనే ఉండవు. విద్యార్థి సముపార్జించిన జ్ఞానమే కొలమానం.
తక్షశిల యూనివర్శిటీలో చేరడానికి ఎలాంటి అప్లికేషన్ ఫాంలు ఉండవు. గురువుని మెప్పిస్తే చాలు. ఓ రకంగా చెప్పాలంటే గురువుగారు నిర్వహించిన ఇంటర్యూలో ఆయన్ని మెప్పిస్తే యూనివర్శిటీలో సీటొచ్చినట్టే. ఒకవేళ గురువుగారికి నచ్చకపోతే ఎలాంటి రికమండేషన్స్ ఉండవు. ఇక శిష్యుడి విద్యాగ్రాహణ శక్తి గమనించిన తర్వాత…విద్య నేర్పిస్తున్నంతకాలం ఉచితభోజనం, ఉచిత వసతి సదుపాయం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒకరి తర్వాత మరొకరు గురువుల వద్ద విద్యాభ్యాసం చేసి సర్వశాస్త్రాలు అవగాహన చేసుకునే అవకాశం ఉంటుంది. తక్షశిలలో అత్యంత ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు…అదే వర్శిటీలో ఆచార్యుడిగా అవకాశం లభిస్తుంది. చాణక్యుడు తక్షశిలలో విద్యనభ్యసించి ఆచార్యుడిగా చేరింది ఇలాగే.
విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడమే ఈ విశ్వవిద్యాలయం పరమావధి అయినప్పటకీ నిర్వహణకు ధనం అవసరమే కదా. అయినప్పటికీ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసేవారు కాదు… నగరంలో ఉండే ధనికులు కొందరు కొంత మొత్తాన్ని తమంతట తాముగా సహాయం చేసేవారు. ఆ ధనంతోనే విశ్వవిద్యాలయం నడిచేది. లాభాపేక్ష లేదు కాబట్టి ఆ కొంత మొత్తంతోనే అద్భుతమైన మేధావులను తయారు చేసింది తక్షశిల యూనివర్శిటీ.
ప్రపంచంలోనే గొప్ప విశ్వవిద్యాలయం అయిన తక్షశిలలో ఎందరో ప్రముఖులు విద్యనభ్యసించారు. ఆర్యచాణక్యుడు మొదలు ఆయుర్వేద వైద్యనిధి-ప్రసిద్ధ ఆయుర్వేద గ్రంథం చరకసంహిత రచయిత చరకుడు, ప్రపంచం మొత్తంమీద ఒక భాషకు వ్యాకరణం రాయడం అనే దానిని తన గ్రంథాలతోనే ప్రారంభించిన పాణిని తక్షశిలలో చదువుకున్నవారే. ఇంకా…అశోకుడు, చంద్రగుప్త మౌర్యుడు, విష్ణుశర్మ, బింబిసారుడు, కోసల దేశాధీశుడు ప్రసేనజిత్తు ఈ యూనివర్శిటీలోనే చదువుకున్నారు. అలెగ్జాండర్ భారతదేశ దిగ్విజయ యాత్ర సందర్భంలో తక్షశిల విశ్వవిద్యాలయాన్ని సందర్శించాడు. స్వదేశం తిరిగి వెళ్తునప్పుడు హైందవ మత సంబంధ గ్రంథాలను, పండితులను తన వెంట తీసుకుని వెళ్ళాడు.
ఇక్కడ వేదాలు, ఉపనిషత్తులు, తత్కశాస్త్రం, సంగీతం, నృత్యం, యుద్ధ తంత్రం, రాజనీతి శాస్త్రం సహా సుమారు 68 అంశాలపై బోధించేవారు. ఈ విశ్వవిద్యాలయాన్ని 1980 లో UNESCO ప్రపంచ వారసత్వ కేంద్రంగా గుర్తించింది. ప్రస్తుతం ఈ తక్షశిల విశ్వవిద్యాలయం ఉన్న ప్రదేశం ఇప్పుడు పాకిస్తాన్ లో ఉంది.
Rohini Karte 2022: రోహిణి కార్తె ప్రారంభమైంది, ఇంతకీ కార్తెలు అంటే ఏంటి
Hanuman: ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు, అసలు సిసలు వ్యక్తిత్వ వికాస గని హనుమంతుడు
Astrology: మీరు డిసెంబరులో జన్మించారా, అయితే మీరు పుట్టుకతోనే టీచర్లు, నిత్య విద్యార్థులు
Today Panchang 25 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, హనుమజ్జయంతి ప్రత్యేకత
Horoscope Today 25th May 2022: ఈ రాశివారికి కుటుంబంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Hyderabad: రేపు Hydకి ప్రధాని మోదీ, ఈ రూట్లో ట్రాఫిక్ అనుమతించరు! ప్రత్యామ్నాయ మార్గాలు ఇవీ
KTR Davos Tour: తెలంగాణకు స్టాడ్లర్ రైలు కోచ్ ఫ్యాక్టరీ, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి - ఉద్యోగాలు ఎన్నో తెలుసా
Amalapurama Protests: అమలాపురం విధ్వంసం కేసులో కీలక పురోగతి- కారకులైన 46 మంది అరెస్టు- 72 మంది కోసం గాలింపు
Amalapuram: ఇది ఆంధ్రానా? పాకిస్థానా? అంబేడ్కర్‌పై అంత ప్రేమ ఉంటే నవరత్నాలకు పెట్టుకోండి: జీవీఎల్