Tadepalli Cheddi Gang : తాడేపల్లిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..! ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ ?
చెడ్డీ గ్యాంగ్ ఏపీ రాజధాని ప్రాంతంలో హల్ చల్ చేస్తోంది. విజయవాడలో ఓ అపార్టుమెంట్‌లో చోరీకి ప్రయత్నించిన గ్యాంగ్ తాడేపల్లిలోని ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇంట్లో దొంగతనం చేసినట్లుగా తెలుస్తోంది.
గుంటూరు, విజయవాడల్లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేస్తోంది. ముఖ్యమంత్రి జగన్ నివాసం ఉంటున్న తాడేపల్లి హై సెక్యూరిటీ జోన్‌లో ఉంటుంది. ఆ ప్రాంతాలోనూ చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడింది. ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు చెందిన విల్లాల్లో దొంగనం చేసినట్లుగా తెలుస్తోంది. గత వారం విజయవాడలోని శివదుర్గ ఎన్‌క్లేవ్‌లో దోపిడీ చేశారు. దీంతో పోలీసులు దొంగల్ని పట్టుకోవడానికి వేట ప్రారంభించారు.
Also Read : బంజారాహిల్స్‌లో లగ్జరీ కారు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం
చెడ్డీగ్యాంగ్‌లో ఉన్న ఐదుగురు సభ్యులు ఒంటిమీద దుస్తులు లేకుండా ఒక్క చెడ్డీ మాత్రమే ధరించి, ఉన్నారు. వీరికి సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. తలపాగాలు చుట్టి రెండు ఇళ్ల మధ్యలో ఉన్న సందులో వెళ్తున్నట్లు దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదు అయ్యాయి. దొంగతనం జరిగినట్లుగా ఎమ్మెల్యే కారుమూరి కానీ.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కానీ ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. అయితే నోటి మాటగా చెప్పడంతో .. సీసీ టీవీ ఫుటేజీ లభ్యం కావడంతో పోలీసులు తాడేపల్లి, మంగళగిరి, కాజా, పెదకాకాని వంటి ప్రాంతాల్లో పోలీసుల పహారాను పెంచారు.
తాడేపల్లి ప్రాంతంలో కనిపించిన ఐదుగురు సభ్యులున్న చెడ్డీగ్యాంగ్ .. విజయవాడ గుంటుపల్లిలో ఉన్న చెడ్డీగ్యాంగ్ పోలికలు ఒకే విధంగా ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. విజయవాడ, గుంటూరు పోలీసులు సంయుక్తంగా ఆ గ్యాంగ్ ఆధారాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరైనా రాత్రి సమయంలో అనుమానంగా తిరుగుతూ కనిపిస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.
Also Read: Chittoor Accident: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... కారులో చెలరేగిన మంటలు... ఆరుగురు మృతి
గతంలో చెడ్డీ గ్యాంగ్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అలజడి రేపింది. ఎలాంటి తాళమైన, డోర్‌నైనా ఒక్క రాడ్ సహాయంతోనే విరగొట్టడం ఈ చెడ్డీ గ్యాంగ్ స్పెషాలిటీ. నగర శివారు ప్రాంతాల్లోని నిర్మానుష్య ప్రాంతాలలో వెలుస్తున్న కాలనీలను టార్గెట్‌గా చేసుకుంటూ వరుస చోరీలకు పాల్పడుతోంది ఈ గ్యాంగ్. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఈ గ్యాంగ్‌లు ఇప్పుడు ఏపీ రాజధాని ప్రాంతంపై దృష్టి పెట్టినట్లుగా భావిస్తున్నారు. ఈ గ్యాంగ్ ఎక్కువగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో ఉంటూ పగలు బిచ్చగాళ్లలాగా లేదా కూలీలలాగా నటిస్తూ కాలనీలలో సంచరిస్తూ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రిళ్ళు దోపిడీ చేస్తూంటారని పోలీసులు చెబుతున్నారు.