Banjara Hills: బంజారాహిల్స్‌లో లగ్జరీ కారు బీభత్సం.. ఇద్దరు దుర్మరణం
వాహన ప్రమాదానికి మద్యం తాగడంతో పాటు అతివేగం కూడా కారణమని పోలీసులు గుర్తించారు. కారు ప్రమాదం తర్వాత నిందితుడు కారును ఆపకుండా పరారయ్యాడు.
హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని రోడ్ నెంబర్ - 2లో ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ విలాసవంతమైన కారు బీభత్సం చేసింది. ఆ కారు మితిమీరిన వేగంతో వచ్చి, అదే సమయంలో రోడ్డు దాటుతున్న ఇద్దరు యువకులను ఈ కారు ఢీకొట్టింది. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు స్పాట్‌లోనే మృతి చెందారు. చనిపోయిన వీరిని త్రిభువన్ (23), ఉపేందర్ (25) అనే వ్యక్తులుగా బంజారాహిల్స్ పోలీసులు గుర్తించారు. వీరిద్దరు రెయిన్ బో ఆసుపత్రిలో ఉద్యోగులు అని తేల్చారు. కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీసులు నిర్ధరించారు.
వాహన ప్రమాదానికి మద్యం తాగడంతో పాటు అతివేగం కూడా కారణమని పోలీసులు గుర్తించారు. కారు ప్రమాదం తర్వాత నిందితుడు కారును ఆపకుండా పరారయ్యాడు. జూబ్లీహిల్స్‌లోని తన ఇంటికి వెళ్లి ఆ కారును పార్క్ చేశాడు. ఈ క్రమంలో అక్కడ డ్యూటీలో ఉన్న ఒక కానిస్టేబుల్ అనుమానించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక మృత దేహలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
హైదరాబాద్ - విజయవాడ హైవేలో మరో ప్రమాదం
మరోవైపు, నల్గొండ జిల్లా చిట్యాల వద్ద మరో రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ఓ లారీ యూ టర్న్ తీసుకుంటుండగా.. రెండు కార్లు లేచి లారీని ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. హైదరాబాద్ - విజయవాడ మార్గంలో ప్రమాదం జరగడంతో దాదాపు 2 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ హైవేపై పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.
Also Read: Rythubandhu: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో మీ ఖాతాల్లోకి రైతుబంధు నిధులు
Also Read: Karimnagar: కరీంనగర్ లో కరోనా కలకలం... 46 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్
Also Read: Konijeti Rosaiah: ముగిసిన రోశయ్య అంత్యక్రియలు.. కొంపల్లి ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు పూర్తి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి