Rythubandhu: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. త్వరలో మీ ఖాతాల్లోకి రైతుబంధు నిధులు
రైతులకు తెలంగాణ ప్రభుత్వం.. గుడ్ న్యూస్ చెప్పనుంది. త్వరలో రైతుల ఖాతాల్లో రైతు బంధు జమ కానుంది.
యాసంగి సీజన్.. పంటల సాగు ప్రారంభమవుతున్న వేళ.. రైతు బంధును పంపిణీ చేయాలని.. ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఎకరానికి 5వేల చొప్పున కోటిన్నర ఎకరాలకు నిధులు విడుదల చేయనున్నారు. దాదాపు.. 7500 కోట్ల రూపాయలు నిధులు విడుదల కానున్నట్టు సమాచారం.
అయితే పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయాల్సి ఉండటంతో.. ఇప్పటికే ఆర్థిక శాఖ కసరత్తును ప్రారంభించినట్టు తెలుస్తోంది. డిసెంబర్ 15 నుంచి రైతు బంధు సొమ్ము.. రైతుల ఖాతాల్లో జమ కానుంది. డిసెంబర్ 15వ తారీఖు లోపున నిధులు సర్దుపాటు కాకపోతే.. డిసెంబర్ చివరి వారంలో రైతుబంధు డబ్బులు విడుదల చేసే అవకాశం ఉంది.
వానాకాలం సీజన్‌కు సంబంధించి దాదాపు 60.84 లక్షల మంది రైతులకు రైతుబంధు అందింది. అంటే దాదాపు రూ.7,360.41 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. సుమారు 1.47 కోటి ఎకరాలకు నిధుల పంపిణీ చేసింది. మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండెకరాలు, మూడో రోజు మూడెకరాలు ఇలా నగదు బదిలీ చేశారు. ఈసారి కూడా అదే పద్ధతిని ఎంచుకునే ఛాన్స్ ఉంది.
మరోవైపు ధాన్యం కొనుగోలుపై సందిగ్ధిత కొనసాగుతుంది. తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. బాయిల్డ్ రైస్ ఎంత కొంటారో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని పార్లమెంటులో టీఆర్ఎస్ ప్రశ్నించింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమాధానమిచ్చారు. వినియోగించే ధాన్యాన్నే కొనుగోలు చేస్తామని ఈ మేరకు సీఎం కేసీఆర్ తో కూడా మాట్లాడామని పీయూష్ తెలిపారు. వానాకాలం పంట పూర్తిగా కొంటామని తెలిపారు. దేశంలో పెంచినట్లుగానే తెలంగాణ నుంచి ధాన్యం సేకరణను బాగా పెంచామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఎందుకు రాజకీయం చేస్తున్నారో అర్థం కావట్లేదని, కేంద్రం సాధ్యమైనంత వరకూ తెలంగాణకు సహకరిస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూ ఆధారంగా కొనుగోళ్లు చేస్తామని స్పష్టం చేశారు.
Also Read: మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో
Also Read: Karimnagar: కరీంనగర్ లో కరోనా కలకలం... 46 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్
Also Read: Konijeti Rosaiah: ముగిసిన రోశయ్య అంత్యక్రియలు.. కొంపల్లి ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు పూర్తి
Also Read: DH Srinivasa Rao: ఒకట్రెండు నెలల్లో భారత్ లో కరోనా కేసులు పెరిగే ఛాన్స్ ఉంది