Vanama Raghava: వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్... రామకృష్ణను బెదిరించినట్లు అంగీకరించిన రాఘవ... ఏఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడి
పాల్వంచలో కుటుంబం ఆత్మహత్య ఘటనలో అరెస్టైన వనమా రాఘవకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. రామకృష్ణను బెదిరించినట్లు వనమా రాఘవ ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.
![Vanama Raghava: వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్... రామకృష్ణను బెదిరించినట్లు అంగీకరించిన రాఘవ... ఏఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడి Bhadradri Kottagudem Vanama Raghava sent to 14 days judicial remand Vanama Raghava: వనమా రాఘవకు 14 రోజుల రిమాండ్... రామకృష్ణను బెదిరించినట్లు అంగీకరించిన రాఘవ... ఏఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/08/54f9c26624a66d70f8e7cca40875c0d2_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టైన వనమా రాఘవను పోలీసులు కొత్తగూడెం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. వనమా రాఘవకు కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం అతడిని పోలీసులు భద్రాచలం సబ్ జైలుకు తరలించారు. అంతకుముందు వనమా రాఘవ అరెస్టుపై ఏఎస్పీ రోహిత్ రాజ్ మీడియాతో మాట్లాడారు. రాఘవపై మొత్తం 12 కేసులు నమోదు చేశామని చెప్పారు. రామకృష్ణను బెదిరించినట్లు వనమా రాఘవ అంగీకరించినట్లు ఏఎస్పీ తెలిపారు.
Also Read: వనమా రాఘవ అరెస్టు... హైదరాబాద్‌కు వస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య
జనవరి 3వ తేదీన పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ ఇద్దరు చిన్నారులు, భార్యతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. భార్య, పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నారు. ఈ ఘటనలో రామకృష్ణ, శ్రీలక్ష్మి, సాహిత్య అక్కడికక్కడే మృతిచెందారు. పెద్ద కుమార్తె సాహితీ చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందింది. రామకృష్ణ బావమరిది జనార్దన్ ఫిర్యాదుతో పాల్వంచ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు.
Also Read: ఆస్తి తగాదాలు.. అక్రమ సంబంధాలు.. రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో వైరల్
గతంలో నమోదైన కేసులపై కూడా విచారణ
అయితే ఆత్మహత్యకు ముందు రామకృష్ణ సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో తీసుకున్నారు. ఈ వీడియో కొత్తగూడెం ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవపై ఆరోపణలు చేశారు. తన ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులతో పాటు ఇతర ఉన్నాయని వీడియోలో చెప్పారు. రాఘవ, సూర్యవతి, మాధవి కారణంగానే ఆత్మహత్య చేసుకుంటున్నామని తెలిపారు. ఈ సూసైడ్ ఘటన బయటకు రాగానే వనమా రాఘవ పరారీలో ఉన్నాడు. అతడి కోసం 8 ప్రత్యేక బృందాలను గాలించాయి. శుక్రవారం రాత్రి వనమా రాఘవను అదుపులోకి తీసుకున్నామని ఏఎస్పీ తెలిపారు. దమ్మపేట మండలం మందలపల్లి వద్ద రాఘవను అరెస్టు చేశామన్నారు. ఈ కేసులో బాధితుల నుంచి లభించిన ఆధారాలను సీజ్ చేసి కోర్టుకు సమర్పించామన్నారు. వనమా రాఘవపై గతంలో నమోదైన కేసులపై కూడా విచారణ చేస్తామని తెలిపారు.
Also Read: టీఆర్ఎస్ నుంచి వనమా రాఘవ సస్పెషన్... నాడే శిక్ష వేసి ఉంటే నేడు నాలుగు ప్రాణాలు దక్కేవి
Also Read: ప్రపంచంలోని టాప్ టెక్ కంపెనీలు ఇవే
Also Read: ఈ నెలలో ఓటీటీలో రాబోయే సినిమాలివే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)