అన్వేషించండి

Vanama Raghava Case: ఆస్తి తగాదాలు.. అక్రమ సంబంధాలు.. రామకృష్ణ మరో సెల్ఫీ వీడియో వైరల్‌

రామకృష్ణ ఫ్యామిలీ సూసైడ్ కేసులో రోజుకో ట్విట్స్ తెరపైకి వస్తోంది. నిన్నటి వరకు భార్యను తన వద్దకు రమ్మన్నాడని వీడియోలో ఆరోపించాడు రామకృష్ణ... ఇప్పుడు మరిన్ని సంచలనాలతో ఇంకో వీడియో విడుదలైంది.

కొత్తగూడెంలో రాజకీయంగా కాకరేపుతున్న రామకృష్ణ కేసులో ఇంకో ట్విస్ట్‌. ఆస్తు తగాదాలు, అక్రమ సంబంధాలే తన ఫ్యామిలీ నాశనానికి కారణమని ఆరోపిస్తూ రామకృష్ణ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. 

నలుగురు కూర్చొని చర్చించుకోవాల్సిన సమస్యను నడిరోడ్డుపై పడేశారని తన అక్క, అమ్మ, రాఘవపై ఆగ్రహం వ్యక్తం చేశారు రామకృష్ణ. రాఘవ అండతో తన ఆస్తులను కాజేసి అప్పులు పాల్జేశారని ఆరోపించారు. చివరు ఓ ఫ్యామిలీ ప్రాణాలే తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే... " మా ఫాదర్ మోతుగూడెంలో హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేసేవారు. 1992 అక్టోబర్‌లో ఓ పోలీసు వాహనాన్ని నక్సల్స్ పేల్చేశారు. అందులో మా నాన్న కూడా ఉన్నారు. ఆయన కూడా పోలీసు అనుకొని నక్సల్స్  ఈ పని చేశారు. మొత్తంగా ఆ ఘటనలో ఆరుగురు చనిపోయారు. చిన్న తనంలోనే తండ్రిని పోగొట్టుకున్నాను. ఈ వీడియో మీరు చూసేసరికి నేను లేకపోయి ఉండొచ్చు. అసలు నేను ఎందుకు చనిపోతున్నాను అని చెప్పేందుకే ఈ వీడియో చేస్తున్నాను. నాకు చాలా మంది అప్పులు ఇచ్చారు వాళ్లు నష్టపోకుండా ఉండేందుకే ఈ వీడియో చేస్తున్నాను. తండ్రి నుంచి రావాల్సిన ఆస్తిని నాకు అప్పు ఇచ్చిన వాళ్లకు ఇవ్వండి. మిగిలినది మా అక్క, తల్లికి ఇచ్చేయండి. 

ఈ సమస్యకు పాత్రధారి సూత్రధారి వనమా రాఘవేంద్ర. మా అక్కతో ఉన్న సంబంధం, వాళ్లకు సహకరిస్తున్న మా అమ్మతోనే సమస్య. ధర్మబద్ధంగా నాకు రావాల్సిన ఆస్తులను కాజేస్తున్నారు. సంవత్సరం క్రితం పెద్దల మధ్య జరిగిన ఒప్పందాన్ని కూడా పెండింగ్‌లో పెట్టారు. నన్ను అప్పుల ఊబిలోకి నెట్టేశారు. చావు తప్ప వేరే మార్గం లేకుండా ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. అక్రమ సంబంధం వల్ల ఓ కుటుంబం నాశనమైపోయే స్థితికి తీసుకొచ్చారు. వీళ్లను ఏం చేస్తారో ఈ సమాజానికే వదిలేస్తున్నాను. అనవసరంగా లేనిపోని అభియోగాలు వేయడం లేదు. అనుమానాలన్నీ నివృత్తి చేస్తాను. మాది పాత పట్టిసీమ. గతంలో కూడా మా ఫ్యామిలీలో చాలా గొడవలు జరిగాయి. కానీ ఎప్పుడూ వనమా రాఘవేంద్ర కలుగజేసుకోలేదు. మా అక్క, బావకు జరిగిన గొడవల్లోనూ ఏరోజూ ఇన్వాల్వ్‌ కాలేదు. మా ఫ్యామిలీ మెంబర్‌ అయితే ఏదో గొడవలో మధ్యవర్తిత్వం వహించాలి కదా. ఎప్పుడూ ఆ పని చేయాలి.

మరి ఎలా పరిచయం ఏర్పడిందో తెలియదు కానీ... మా ఆస్తి పంపకాల విషయంలో మాత్రం కలుగజేసుకున్నాడు. ఈ సమస్యను మా అక్క కేవలం రాఘవకే చెప్తుంది. ఎంతో బిజీగా ఉండే రాఘవకు మా ఫ్యామిలీ మేటర్‌లో ఎందుకంత ఇంట్రస్ట్‌. మా అక్క ఏదో బాధపడుతుందన్న ఆలోచనతో ఆయన ప్రతి అంశంలో కలుగజేసుకునేవాడు. మా అక్కకు అనుకున్న విధంగానే కట్నకానుకలు ఇచ్చాం. మా అమ్మ రిటైర్‌ అయినప్పుడు వచ్చిన డబ్బులోనూ సగ భాగం ఇచ్చాం. ఇప్పుడు మా అమ్మవాళ్లతో ఉంటోంది అక్క. బావకు సరైన సంపాదన లేకపోయినా ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు.

నాకు మాత్రం ఎలాంటి సంపాదన లేదు. పొలం లేదు. కౌలు ఆదాయం లేదు. నేను రాజమండ్రిలో అద్దెకు ఉంటున్నాను. నా ఫ్యామిలీ పోషణ ఇబ్బందిగా మారింది. నా పరిస్థితి అర్థం చేసుకోలేదు. ఆఫీసర్‌ కొడుకుగా పుట్టి మీ సేవ ద్వారా ఏదో కుటుంబాన్ని నెట్టుకొని వచ్చాను. చాలా మంది స్నేహితులు సహకరించారు. అప్పులు ఇచ్చి హెల్ప్ చేశారు. ఆ అప్పులకు  వడ్డీలు కడుతూ ఆర్థికంగా మరింత కుంగిపోయాను. ఇప్పటి వరకు 30 లక్షలు అప్పులు చేశాను. వాళ్లకు క్లియర్ చేద్దామని నా తండ్రి నుంచి రావాల్సిన ఆస్తిని అడిగాను. పెద్దల సమక్షంలో ఆస్తుల పంపకం జరిగింది.

ఇది జరిగి సంవత్సరం అయినా ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తులు ఇవ్వకుండా నాన్చారు. వాళ్లకు ఏం కావాలో చెప్పకుండా కావాలనే పెండింగ్‌ పెడుతూ వచ్చారు."

రామకృష్ణ చేసిన ఈ రెండో సెల్ఫీ వీడియో మరో సంచలనంగా మారింది. ఇంకా 15పేజీల సూసైడ్‌ నోట్‌ కూడా ఎలాంటి ఆరోపణలు రామకృష్ణ చేశారో అన్న చర్చ కూడా సాగుతోంది. 

Also Read: వనమా రాఘవ అరెస్టు... హైదరాబాద్‌కు వస్తుండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు

Also Read: Vanama Raghava: టీఆర్ఎస్ నుంచి వనమా రాఘవ సస్పెషన్... నాడే శిక్ష వేసి ఉంటే నేడు నాలుగు ప్రాణాలు దక్కేవి

Also Read: కొత్తగూడెం ఫ్యామిలీ సూసైడ్‌ కేసులో మరో ట్విస్టు.. తన భార్యను ఎమ్మెల్యే కుమారుడు రమ్మన్నాడని నాగ రామకృష్ణ సెల్ఫీ వీడియో 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget