Vanama Raghava Arrest: వనమా రాఘవ అరెస్టు... మరో చోటుకు మకాం మార్చుతుంటే అదుపులోకి తీసుకున్న పోలీసులు
Vanama Raghava Latest News Updates: పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని సైతం పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
![Vanama Raghava Arrest: వనమా రాఘవ అరెస్టు... మరో చోటుకు మకాం మార్చుతుంటే అదుపులోకి తీసుకున్న పోలీసులు Vanama Raghava Arrested In Ramakrishna Family Suicide Case Vanama Raghava Arrest: వనమా రాఘవ అరెస్టు... మరో చోటుకు మకాం మార్చుతుంటే అదుపులోకి తీసుకున్న పోలీసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/08/748a60b5db8638bb8037e5593ade65d8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vanama Raghava Arrest News Updates: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న వనమా రాఘవను తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి దమ్మపేట, చింతలపూడి మధ్య పోలీసులు వనమా రాఘవేంద్రరావు(59)ను అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు గిరీష్, మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. విపక్షాల నుంచి విమర్శలు రావడంతో టీఆర్ఎస్ పార్టీ శుక్రవారమే రాఘవను సస్పెండ్ చేసింది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే (కొత్తగూడెం) వనమా వెంకటేశ్వరరావు కుమారుడైన వనమా రాఘవ బెదిరింపుల కారణంగా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం జనవరి 3న ఆత్మహత్యకు పాల్పడింది. రామకృష్ణ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన ఆస్తి పంపకాల విషయంలో కుటుంబంలో విభేదాలు తలెత్తగా ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవ తలదూర్చాడు. హైదరాబాద్‌కు భార్యను తీసుకొచ్చి అప్పగిస్తే ఆస్తి నీకు దక్కేలా చేస్తానని వనమా రాఘవ తనను బెదిరించాడని.. ఈ అవమానాలు తట్టుకోలేక కుటుంబంతో పాటు చనిపోయాతున్నానని రామకృష్ణ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన భార్య, ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు, ఆపై తాను కూడా కాల్చుకుని బలవన్మరణం చెందాడు. రామకృష్ణ సూసైడ్ సెల్ఫీ వీడియో బయటకు రావడంతో దుమారం రేపుతోంది.
రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో ఎ-2గా వనమా రాఘవ ఉన్నాడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు హైదరాబాద్, తొర్రూరు, సూర్యాపేట, విశాఖపట్నం, చీరాల, రాజమండ్రి ప్రాంతాల్లో తలదాచుకున్న రాఘవ సిమ్ కార్డులను పదే పదే మార్చినట్లు తెలుస్తోంది. విశాఖ నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా పశ్చిమ గోదావరి, భద్రాద్రి జిల్లా సరిహద్దులో వనమా రాఘవను శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి అడిషనల్ ఎస్పీ కేఆర్‌కే ప్రసాద్ రావ్ ఆధ్వరంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం పాల్వంచ ఏఎస్పీ ఆఫీసుకు తరలించారు.
Also Read: రామకృష్ణ కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో నలుగురు..? రహస్య ప్రదేశంలో విచారణ!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)