By: ABP Desam | Updated at : 07 Jan 2022 06:01 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
వనమా రాఘవేంద్రరావు (ఫైల్ ఫొటో)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సూచన మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, పార్టీ ఖమ్మం వ్యవహారాల ఇన్‌ఛార్జి నూకల నరేష్ రెడ్డిలు.... వనమా రాఘవేంద్రను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని తెలిపారు.
Also Read: పాల్వంచ కుటుంబం ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్... వనమా రాఘవను అరెస్టు చేయలేదని ఏఎస్పీ ప్రకటన
మరో బాధిత కుటుంబం ఆవేదన
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవేంద్రరావు వేధింపులు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వనమా రాఘవ వేధింపులకు ఆరునెలల క్రితం పాల్వంచ పట్టణానికి చెందిన మలిపెద్ది వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన సూసైడ్ నోట్ లో రాఘవతో పాటు 42 మంది పేర్లు రాసినప్పటికీ ఈ కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. వెంకటేశ్వర్లకు చెందిన భూమి విషయంలో వనమా రాఘవ రూ. 10 లక్షలు తీసుకొని, వేరే వారికి మద్దతు పలికాడని వెంకటేశ్వర్లు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. దీంతో పాటు వేరే కేసులో ఇరికించి జైలుకు పంపడంతో వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. ఈ కేసులో పోలీసుల పైనా ఆరోపణలున్నాయి. ఆరు నెలల క్రితం జరిగిన ఈ ఆత్మహత్యపై జాప్యం చేశారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. అప్పుడే సరైన శిక్ష వేస్తే రామకృష్ణ కుటుంబం బతికి ఉండేదని, ఇప్పటికైనా ప్రభుత్వం రాఘవపై చర్యలు తీసుకొని తమ లాంటి వారికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
పోలీసుల అదుపులో నలుగురు..!
తెలుగు రాష్ట్రాల‌్లో సంచలనం సృష్టించిన రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య కేసులో పురోగతి సాధించినట్టు తెలుస్తోంది. కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. అనేక సెటిల్‌మెంట్‌లలో రాఘవతో భాగస్వాములయ్యారని, రామకృష్ణ పంచాయతీ జరిగినప్పుడు కూడా ఈ నలుగురు ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అందుకే వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. కొత్తగూడెం నియోజకవర్గంలో రాజకీయంగా పలుకుబడి ఉన్న ఈ నలుగురు వ్యక్తులపై ఇప్పటికే అనేక అభియోగాలున్నాయి. అయితే రామకృష్ణ ఆత్మహత్యకు ముందు 15 పేజీల సూసైడ్ నోట్ రాసినట్లు ప్రచారం జరుగుతుంది. పంచాయతీ జరిగిన సందర్భంలో ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని అందులో స్పష్టంగా పేర్కొనడంతో పోలీసులు ఆ దిశగా కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు సమాచారం.
Also Read: రామకృష్ణ కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో నలుగురు..? రహస్య ప్రదేశంలో విచారణ!
Bear Attack in Vizag: ఎలుగు దాడిలో కేర్ టేకర్ మృతి - విశాఖ జూపార్కులో విషాదం
Delhi News: ఇళ్లు శుభ్రం చేయమన్నందుకు భర్త చెవి కొరికిన భార్య - ఢిల్లీలో దారుణ ఘటన
Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో మరో విద్యార్థి ఆత్మహత్య
Andhra News: లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ - అవమాన భారంతో ఆత్మహత్య
Kochi Stampede: కొచ్చి వర్సిటీలో టెక్ ఫెస్ట్ లో తొక్కిసలాట- నలుగురు విద్యార్థులు మృతి, శశిథరూర్ దిగ్భ్రాంతి
Uttarkashi Tunnel Rescue: ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ - ప్రపంచస్థాయి నిపుణుడు దేవుడికి సాగిలపడ్డాడు!
Uttarakhand Tunnel Collapse: ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమీ- పిల్లలకు చెప్పాల్సిన ధైర్య సాహసాల కథే "ఆపరేషన్ సిల్కీయారా'
Jagan Case: కోడి కత్తి కేసులో జగన్ పిటిషన్‌కు విచారణ అర్హత లేదు- హైకోర్టులో ఎన్ఐఏ కౌంటర్
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
/body>